Showing posts with label bharathimata. Show all posts
Showing posts with label bharathimata. Show all posts

Monday, February 11, 2013

ప్రజానిరసనల ఉప్పెనలో...కుటిల నాయకులు కొట్టుకుపోతారు


ఏ దేశ చరిత్ర చూసినా ఒక వ్యక్తి సమాజ శ్రేయస్సుకోసం పాటుపడే ప్రయత్నంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొనక తప్పింది కాదు. ఎంతో మంది నాయకుల జీవితగాథలే ఇందుకు నిదర్శనం. జగన్ ఆస్తుల విషయంలో కేసులను ఇన్ని మలుపులు తిప్పుతూ ‘అయిన వాళ్లకు ఆకుల్లో, కాని వాళ్లకు కంచాలలో’ అన్న చందాన కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించే తీరును ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. అవకాశం వచ్చిన రోజు తగిన విధంగా బుద్ధి చెబుతారు. ఆ రోజున బడుగు బలహీన వర్గాల ఆగ్రహ జ్వాలల్లో కాంగ్రెస్ బూడిద అవక తప్పదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఒక రకంగా జగన్‌కు మంచివే అనాలి. 

ఎందుకంటే విశేష ప్రజాదరణ పొందుతున్న వర్ధమాన నాయకుణ్ణి చూసి ఓర్వలేక కాంగ్రెసు తప్పుడు కేసులు బనాయించి జైల్లో పెట్టిన వైనం ప్రజలు కళ్లారా వీక్షించే ఒక అవకాశం ఇది. నిజాలు నిగ్గుతేలిన రోజున జగన్ కడిగిన ముత్యంలా జైల్లోంచి బయటికి వస్తారు. తండ్రికి తగ్గ తనయుడుగా అసంఖ్యాక ప్రజాదరణతో రామరాజ్యాన్ని తలపించేలా ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలిస్తారు. సమాజంలో మంచి మార్పుని కోరుకునే ప్రతి వ్యక్తి ఎదుర్కొనే ప్రతికూల పరిస్థితులు ఎన్నో రకాలుగా ఉంటాయి. ఒక స్వర్ణయుగం ఆవిర్భావానికి ఇవన్నీ అవరోధాలు. అయితే వీటికి సహనమే ఆయుధం. జగన్ దగ్గర ఆ ఆయుధం ఉంది. ప్రతికూల పరిస్థితుల్లో సైతం ముఖంపై చెదరని చిరునవ్వే జగన్ సహనానికి, నిజాయితీకి నిదర్శనం. 

ఓదార్పు యాత్ర ద్వారా ప్రజల్లో మమేకమై ప్రజల పక్షాన నిలిచిన నాయకుణ్ణి జైల్లో పెట్టి అపఖ్యాతి పాలు చేసి ఏదో సాధించేశామని అనుకునే వారికి త్వరలోనే కనువిప్పు కలుగుతుంది. కుట్రపూరిత, స్వార్ధ రాజకీయ ఎత్తుగడలకి కారణం ఎవరో ప్రజలకు తెలుస్తుంది. ఆనాడు ప్రజల నిరసనల ఉప్పెనలో కుటిల రాజకీయ నాయకులు కొట్టుకుపోతారు. నిజానికి జగన్ పదవే కావాలనుకుంటే ఏనాడో దొరికి ఉండేది. జగన్‌కి పదవీ కాంక్ష ఉండి ఉంటే ఇన్ని కష్టాలు పడాల్సిన అవసరం కూడా లేదు. ప్రజా జీవితం కోరుకునేవారు, సిద్ధాంతపరమైన జీవితాన్ని గడపాలనుకునేవారు పరిస్థితులకి రాజీ పడరు.

జగన్‌ని అనుకరిస్తూ జరుగుతున్న పాదయాత్రలు కేవలం పదవుల కోసం, ప్రభుత్వ మనుగడ కోసం సాగిస్తున్న పోటీ పాదయాత్రలు. వారికి ఏనాడైనా ప్రజలు గుర్తొచ్చారా? ఇంతకాలం ఏం చేస్తున్నట్లు? ప్రభుత్వాన్ని పడగొట్టే సత్తా ఉన్న ప్రధాన ప్రతిపక్షం ఎందుకు ఇంకా మౌనం వహిస్తున్నట్టు? ఎన్నో సందర్భాలలో ‘మీరు అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టండి మేము సహకరిస్తాం’ అని తెలుగు దేశం పార్టీకి వైయస్సార్ సీపీ సవాల్ విసిరినా ఎందుకు వెనుకంజ వేసినట్లు? ఇది అవినీతి ప్రభుత్వానికి కొమ్ము కాయడం కాదా? జోగి, జోగి రాసుకుంటే బూడిద రాలినట్లు ఉప ఎన్నికల్లో పాలిత, ప్రధాన ప్రతిపక్ష పరోక్ష మైత్రికి మిగిలిందేమిటి? ఈ కుటిల రాజకీయ ఎత్తుగడలకి ప్రజలు ఉప ఎన్నికల్లో ఏనాడో బుద్ధి చెప్పారు.

అయినా నేటికీ గ్రహించలేకపోవడం శోచనీయం. ఒక పార్టీ అధినేతని అవినీతి ఆరోపణలపై అరెస్టు చేసినా ఆ పార్టీని ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించడం అనేది చరిత్రలో చాలా అరుదైన సంఘటన. అంటే జగన్ నిర్దోషని ప్రజలు అంగీకరిస్తున్నట్లే కదా. ‘‘దేశం ఒక గొప్ప నాయకుణ్ణి పోగొట్టుకున్నప్పుడల్లా తెలియని స్తబ్ధత నన్ను ఆవరించుకుంటుంది. ఏ సెన్స్ ఆఫ్ నేషనల్ పెరాలసిస్ స్ట్రైక్స్ మి. వాళ్ల విజన్‌ని ఫుల్‌ఫిల్ చేయాలనే పట్టుదల నాలో మొదలవుతుంది’’ అన్న వైయస్ మాటలను అక్షరాలా పుణికి పుచ్చుకుని, ఆయన విజన్‌ని నెరవేర్చగల సత్తావున్న ఏకైక నాయకుడు జగన్ మాత్రమే. 

- బొల్లోజు దుర్గాప్రసాద్, చినముషిడివాడ, విశాఖపట్నం

Saturday, January 26, 2013

మంచితనానికి చోటు లేదా అనిపిస్తోంది!


మొన్న 24వ తేదీ హైకోర్టు జగన్‌కు బెయిల్‌ను నిరాకరించిందని తెలిసిన రోజు సాయంకాలం అత్తమ్మ నా దగ్గరికి వచ్చి ఏడ్చారు. ‘‘ఈ కష్టాలు చూడమని మీ మామ నన్ను వదిలి వెళ్లాడమ్మా’’ అని అత్తమ్మ అన్నారు. ‘‘జగన్‌కు డిగ్రీలో కూడా నేనే అన్నం తినిపించేదానిని - ఎంతో అపురూపంగా చూసుకున్నానమ్మా నా కొడుకును’’ అని అత్తమ్మ అన్నప్పుడు నాకెంతో బాధ అనిపించింది. అత్తమ్మ చాలా వరకు ధైర్యంగా ఉంటారు. నిబ్బరంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. మామ చనిపోయిన తరువాత తన మనసులో ఏమున్నా, బాధ ఉన్నా ఎప్పుడన్నా కొడుకు దగ్గరో, కూతురు దగ్గరో తన బాధను పంచుకుంటారు తప్ప పెద్దగా బయటపడరు. చాలా బాధ అనిపించింది. జగన్ వాళ్ల పెద్దమ్మ కూడా చాలా ఏడ్చారు ఆరోజు - ‘‘బాబు ఎప్పుడు వస్తాడమ్మా ఇంటికి’’ అని! నామటుకు నేనైతే ఇన్ని కుట్రలు జరుగుతున్నా, జగన్‌కు ఇన్ని రోజులు దూరంగా ఉన్నా బతికే ఉన్నానంటే దేవుని దయ అనుకుంటా! ఎంత ధైర్యపరచుకుందామనుకున్నా, ఎంత మనకు మనం సర్దిచెప్పుకున్నా మనసు మాట వినదు. అంత కృంగిపోయినా ఇంకా బతికే వున్నానంటే దేవుని దయనే! 

రాజకీయ లబ్ధికోసం ఎంతవరకైనా దిగజారే మనుషులను చూస్తున్నాం. మంచితనానికి ఇంక చోటు లేదా అని అనిపిస్తోంది.
తెలుగుదేశం పుట్టడమే కాంగ్రెస్‌ను వ్యతిరేకిస్తూ పుట్టిన పార్టీ. కాని గత రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్, టీడీపీ కలిసి పనిచేయడం చూశాం; ఈ రోజు కాంగ్రెస్, టీడీపీ కలిసిపోతాయి అని పత్రికల్లో రాయడం చూస్తున్నాం. ఆ పార్టీని స్థాపించిన ఎన్టీఆర్ గారి ఆత్మ ఎంత క్షోభిస్తూ వుంటుందో! ఆయన ఏ తెలుగువారి ఆత్మగౌరవం కోసం పార్టీని పెట్టారో, అదే పార్టీవారు తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పాద పీఠాల దగ్గర తాకట్టు పెడుతున్నారు. కొన్ని వార్తాపత్రికలు కూడా అంతే! మొదటినుంచీ కాంగ్రెస్‌కు బద్ధశత్రువుగా పరిగణించబడే ఒక పత్రిక నేడు కాంగ్రెస్‌ను వెనకేసుకొచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది... కలికాలం కాబోలు! అధికారమే పరమావధిగా పనిచేస్తున్న పాలక, విపక్షాలను చూస్తున్నాం. ఎవరైనా అడ్డం వస్తే జైలుపాలు జేస్తారు. అధికారులను పంపి వారిని బెదిరిస్తారు. అది జగన్ కావచ్చు... అసదుద్దీన్ గారు కావచ్చు... పార్టీ మారాలనుకునే ఎమ్మెల్యేలు కావచ్చు! రాష్ట్రం మొత్తం, దేశం మొత్తం ఈ అధికార దుర్వినియోగం కింద మూలుగుతూ ఉంది. దేవుడు మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడో, ఎప్పుడు దృష్టిపెడతాడో అని నాలాంటి వారు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.

వైఎస్‌ఆర్‌గారు ఒక్కరు లేకపోతే జీవితాలలో ఎంత తేడా వచ్చిందో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు చెబుతారు. మొన్న వయలార్ రవి కూడా ‘‘వైఎస్‌ఆర్ వంటి లీడర్ లేక మాకు ఈ సమస్యలన్నీ వచ్చాయి’’ అని అన్నారని పేపర్‌లో చూశాం. దేవుడు ఆయనకిచ్చిన అవకాశాన్ని ఆయన నిండు మనస్సుతో ప్రజలకు మేలు చేయాలని సంకల్పించారు. అందుకే దేవుడు ఆయన పాలనను ఆశీర్వదించాడు. తన పాలనలో ఎవ్వరికి ఏం కష్టం వచ్చినా నేనున్నానని భరోసా ఇచ్చేవారు ఆయన. కాని ఇప్పటి నాయకుల ధ్యాస అంతా పక్కన ఉండే వారిని ఎలా ఇబ్బందిపెట్టాలి, ఎలా కిందికి లాగాలి అనే! ఇప్పటి ప్రభుత్వం ‘ఖబడ్దార్ నా చేతిలో అధికారం ఉంది’ అనే భయం పుట్టిస్తోంది. అందుకే ప్రజలు వైఎస్‌ఆర్ గారు లేకున్నా ఆయనను కోరుకుంటున్నారు. ఆయనే అసలైన నాయకుడంటున్నారు. ఇప్పుడున్న నాయకులు ఎప్పుడు దిగిపోతారా, ఎప్పుడు మంచి నాయకులు వస్తారా అని అనుకుంటున్నారు. 

దేవుడు త్వరలోనే మనలో కష్టాలలో ఉండే ప్రతి ఒక్కరిని, మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని దర్శించాలని, జగన్‌ను బయటకు తీసుకురావాలని, సుఖసంతోషాలను, ప్రేమ సమాధానాలను ప్రతి ఒక్కరికి అనుగ్రహించాలని కోరుకుంటున్నాను.

అత్తమ్మ చాలా వరకు ధైర్యంగా ఉంటారు. నిబ్బరంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. కాని హైకోర్టు మొన్న జగన్‌కు బెయిల్‌ను నిరాకరించిందని తెలిసిన రోజు నా దగ్గరికి వచ్చి ఏడ్చారు.

అధికారమే పరమావధిగా పనిచేస్తున్న పాలక, విపక్షాలను చూస్తున్నాం. ఎవరైనా అడ్డం వస్తే జైలుపాలు జేస్తారు. అధికారులను పంపి వారిని బెదిరిస్తారు.


- వైఎస్ భారతి
w/oవైఎస్ జగన్

Wednesday, December 5, 2012

నరనరానా అబద్ధాలేనా...?


ఎమ్మార్‌కు భూములు ఇచ్చిన మీరు, ఓఎంసికి లీజులు ఇచ్చిన మీరు, ఐఎంజికి భూములు ఇచ్చిన మీరు బయట వున్నారు. ఏనాడూ, ఏ పదవిలో లేని, ఏ ఫైలుమీదా సంతకం చేయని, ఎవరికీ భూములూ, లీజులూ ఇవ్వని జగన్ జైలులో ఉన్నాడంటే ఇట్టే తెలిసిపోతోంది... ఎవరు ఎవరితో ఒప్పందంలో వున్నారో, ఎవరు విశ్వసనీయత లేకుండా రాజకీయాలు చేస్తున్నారో! 

అయ్యా చంద్రబాబుగారూ, మీ నోట నిజాలు రావా? మా మామగారు అన్నట్టు మీ మీద నిజంగా మునీశ్వరుని శాపం వుందా? మీరు నిజం మాట్లాడితే మీ తల వెయ్యి చెక్కలవుతుందా? మీ వయసుకు, మీ హోదాకు, మీ రాజకీయ అనుభవానికి అబద్ధాలు సమంజసం కాదు. నేను ఇంతకుముందు కూడా మీతో విన్నవించుకున్నాను - ఎదుటలేని వ్యక్తి గురించి చెడు మాట్లాడడం సంస్కారం కాదు, సమంజసం కాదు - అని! అటువంటిది ఏకంగా మీరు నోటికి వచ్చినన్ని అబద్ధాలు మాట్లాడుతున్నారు. భర్త మీద అబద్ధాలు మాట్లాడితే ఏ భారత స్త్రీ కూడా సహించదు. జగన్ భార్యగా ఈ అబద్ధాలను ఖండించడం నా బాధ్యత, నా ధర్మం. మీరు కూడా మీ బాధ్యత ఎరిగి, మీ ధర్మం తెలుసుకుని అబద్ధాలు మాట్లాడడం మానండి. ఎదుటలేని వ్యక్తిని నిందించే చెడు సంస్కారానికి స్వస్తి పలకండి.

మీకు నిజంగా, నీతిగా, న్యాయంగా జగన్ మీద గెలవాలని ఉంటే ధైర్యంగా ఎదురుగా ఉన్నప్పుడు పోరాడండి. అంతేకాని బెయిల్ పిటిషన్ విచారణకు ముందు మీ ఎంపీలను పంపి, బెయిల్ రాకుండా అడ్డుకుని, జైలులో పెట్టి ఇలా అబద్ధాల ప్రచారం ద్వారా గెలవాలనుకోవడం పిరికిపందల చర్య అవుతుంది. ప్రజలు దాన్ని హర్షించరు సరికదా, అసహ్యించుకుంటారు.

నీతి, నిజాయితీ, నిబద్ధత, సంస్కారం - ఇవి మా ఆయనకు ఉన్నవి, మీకు లేనివి. అందుకే ప్రజలు ఈరోజు జగన్ జైలులో ఉన్నా ఆయన వెంబడే ఉన్నారు. మీరు 1000 కిలోమీటర్లు నడిచినా ప్రజలు మిమ్మల్ని నమ్మడం లేదు. మీరు మారండి, అబద్ధాలు మానండి. దొడ్డిదారిన కాకుండా ఎదురుగా నిలబడి వీరోచితంగా పోరాడండి. అప్పుడు ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు, మీ వెంట ఉంటారు. నేను మారాను అని మీరు అంటున్నారు. మనం మారినట్టు మనం అంటే సరిపోదు... మనలోని మార్పును మన చుట్టూ ఉన్న ప్రజలు గమనించినప్పుడే అది నిజమైన మార్పు. అబద్ధాలు మానండి, దొడ్డిదారులు వదలండి. మీ మాటల్లో, మీ ఆలోచనల్లో, మీ పనుల్లో మీ మార్పు అప్పుడు తప్పక కనబడుతుంది. అప్పుడు ప్రజలు మిమ్మల్ని నమ్మే అవకాశం వుంది. 

నా భర్త మీలాగ కాంగ్రెస్‌పార్టీతో రాజీపడి వుంటే మాకు ఈరోజు ఈ కష్టాలు ఉండేవి కాదు. మీతో, కాంగ్రెస్ పార్టీతో ఈ వేధింపులు ఉండేవి కాదు. ఇప్పటికి ఆరు నెలలకు పైగా జగన్ జైలులో ఉన్నాడంటే, 90 రోజులకు రావలసిన బెయిల్ రాలేదంటే కారణం, ఆయన నమ్మినదారి వదలలేదు కాబట్టి. మీ మాదిరి కాంగ్రెస్‌తో చీకటి ఒప్పందం ఉంటే మీలాగ బయట ఉండేవాడు. మీ మాదిరి చీకటి ఒప్పందం ఉంటే కోర్టులు చెప్పినా విచారణకు రాకుండా మేనేజ్ చేసుకునేవాడు. ఆరు నెలలు కాదుకదా ఒక్క గంట కూడా జైలులో ఉండవలసిన పని ఉండేది కాదు.

ఎమ్మార్‌కు భూములు ఇచ్చిన మీరు, ఓఎంసికి లీజులు ఇచ్చిన మీరు, ఐఎంజికి భూములు ఇచ్చిన మీరు బయట వున్నారు. ఏనాడూ, ఏ పదవిలో లేని, ఏ ఫైలుమీదా సంతకం చేయని, ఎవరికీ భూములూ, లీజులూ ఇవ్వని జగన్ జైలులో ఉన్నాడంటే ఇట్టే తెలిసిపోతోంది... ఎవరు ఎవరితో ఒప్పందంలో వున్నారో, ఎవరు విశ్వసనీయత లేకుండా రాజకీయాలు చేస్తున్నారో! అన్నిరోజులూ ఒకేలా వుండవు. దేవుని దయ వలన, ప్రజల అభీష్టం మేరకు జగన్ బయటకు వచ్చేరోజు త్వరలోనే వుంది. ఈలోపలనైనా మీరు మీ అబద్ధాల మార్గం విడిచి, ప్రజలు నమ్మేవిధంగా, ప్రజలు మెచ్చేవిధంగా మారతారని ఆశిస్తున్నాను. మీకంటే చిన్నదాన్ని, మీకు ఈ విధంగా రాసినందుకు క్షమించండి. మళ్లీ చెబుతున్నాను - భర్త మీద అబద్ధాలు మాట్లాడితే ఏ భారత స్త్రీ కూడా సహించదు. నేనూ అంతే. జగన్ బయట లేడు, సమాధానం చెప్పలేడు కాబట్టి, జగన్ బయటకు వచ్చేంతవరకు మీరు పెద్దమనిషిలా సంయమనం పాటిస్తారని, అబద్ధాలు మానేస్తారని, ఎదుటలేని వ్యక్తి గురించి చెడు మాట్లాడే చెడు సంస్కారాన్ని విడిచిపెడతారని ఆశిస్తున్నాను.

- వైఎస్ భారతి
w/oవైఎస్ జగన్

Saturday, November 24, 2012

మా పాప పంపిన ఏడు మెసేజ్‌లు...

ఇంకో రెండు రోజులు పోతే జగన్‌ను అరెస్టు చేసి ఆరు నెలలు అవుతుంది. ఇంకొక నెల గడిస్తే   క్రిస్మస్ పండగ వస్తుంది. రెండు రోజుల క్రితం వేయవలసిన 5వ చార్జిషీట్‌లో 167 కింద బెయిల్ పిటిషన్ సీబీఐ కోర్టులో వేశాము. ఆరోజు నేను కోర్టులో వుండగా మా పాప నాకు ఫోన్‌లో ఏడు మెసేజ్‌లు పంపింది.

‘మనము గెలిచామా’
‘గెలిచామా అమ్మా’
‘డాడీకి బెయిల్ వచ్చిందా’
‘వచ్చిందా అమ్మా డాడీకి’
‘ప్లీజ్ చెప్పు అమ్మా’
‘చెప్పు అమ్మా’
‘ప్లీజ్...’


నేను బయటకు వచ్చి చూసుకున్నాను. నేను, నా బిడ్డలే కాదు... ప్రసాద్ అన్న భార్య ఆశ, వాళ్ల పిల్లలు, సునీల్ భార్య తేజ, వాళ్ల అబ్బాయి... ఇలా ఒక రాజగోపాల్ భార్య పిల్లలు కానివ్వండి, మోపిదేవి భార్య పిల్లలు కానివ్వండి... అసలు తప్పు జరిగిందో లేదో తెలియకుండా, రాజకీయ ప్రయోజనాలకోసం ఇన్ని కుటుంబాలను కన్నీటిపాలు చేయడం ఒక సభ్యసమాజంలో, ఒక ప్రజాస్వామ్య దేశంలో, ఇంతమంది కళ్లముందు జరుగుతూ వుంది. ఇంతమంది పెద్దమనుషులు ఈ రాక్షస క్రీడను ప్రోత్సహిస్తున్నారు. దీన్ని ఆమోదించని పెద్దలు, ప్రజలు ఏమీ చేయలేని స్థితిలో చూస్తూ వున్నారు.

ఈరోజు నేను సీబీఐని, రాజకీయ నాయకులను, పత్రికా యజమానులను, టీవీ ఛానెల్స్ అధిపతులను చేతులు జోడించి ఒక్కటే వేడుకుంటున్నాను - దయచేసి మా జీవితాలతో ఆడుకోవద్దండీ - మా భర్తలతో పోరాడాలనుకుంటే వాళ్లను బయట పెట్టుకుని పోరాడండి. అంతేకాని, వాళ్లను లోపలపెట్టి మాతో ఎందుకు మీ పోరాటం? పాపం, పుణ్యం తెలియని మా పిల్లలు ఏం చేశారని వాళ్లను ఈరోజు మానసిక వేదనకు గురిచేస్తున్నారు. దారినపోయేవారు ఏదో అభియోగం మోపారని, తను అనుకున్న దారిలో నడవాలని నా భర్త అనుకున్నాడని, ప్రజాభిమానం కూడగట్టుకున్నాడని, తన తండ్రి వారసత్వం పుణికిపుచ్చుకున్నాడని... ఇంతగా మమ్మల్ని మానసికంగా హింసించటం ఎంతమాత్రం సరైనదో మీరే ఆలోచించండి. పెద్దలు చెబుతూ వుంటారు - ఒకరిని బాధపెట్టి మనం సంతోషపడలేమని. మరి మమ్మల్ని బాధపెట్టి, మీరు అనుకున్న తీరాన్ని చేరగలరా? సంతోషాన్ని పొందగలరా?

రాజకీయ నాయకులైనా, పత్రికాధిపతులైనా, టీవీ ఛానెల్స్ అధిపతులైనా, సీబీఐ అధికారులైనా, న్యాయాధిపతులైనా మీరు వుండేది మంచి సమాజ నిర్మాణం కోసం కాదా! ఒకరి హక్కులకు భంగం కలిగించాలనో, ఒకరిని అన్యాయంగా ఇరికించాలనో, అబద్ధాలు మాట్లాడి, ఉన్నవి లేనివీ రాసి, మసిపూసి మారేడుకాయ చేయడం ద్వారా మీరు మంచి సమాజాన్ని నిర్మించగలరా? పనికి వచ్చే పనుల మీద, మంచితనం మీద, మానవత్వం మీద, సమానత్వం మీద ధ్యాస పెట్టండి. ప్రసాద్‌గారికి, జగన్‌కు, మోపిదేవికి ఒక రూలు, ల్యాంకో రాజగోపాల్ తమ్ముడు శ్రీధర్‌కు, ధర్మానకు, మిగతా మంత్రులకు, చంద్రబాబుకు ఒక రూల్ పెట్టడం ద్వారా సమసమాజం నిర్మిస్తున్నామని, న్యాయం చేస్తున్నామని అనగలరా? ఎందుకీ వివక్ష? ఎందుకీ అన్యాయం? 

దయచేసి మీరు ఏం చేస్తున్నారో ఆలోచించుకోండి. దేనికోసం నిలబడ్డారో ఆలోచించుకోండి. ఈలోకం గుండా వెళ్తూ వెళ్తూ మన వెనుక ఏమి విడిచి వెళ్తున్నామో ఆలోచించండి. మంచిని, మానవత్వాన్ని, న్యాయాన్ని, సభ్యతను భావితరాలకు, మీ సొంత పిల్లలకు ఇచ్చి వెళ్లండి. అంతేకాని, మాలాంటివాళ్లకు కన్నీటిని, వేదనను, అన్యాయాన్ని, కష్టాన్ని విడిచి వెళ్లకండి. చేతనైతే ఒకరికి సహాయం చెయ్యండి. అంతేకాని ఇతరులకు చేటు చేయకండి. ఇకముందైనా మీ మూలంగా మాలాంటి వాళ్ల హక్కులు హరించబడకుండా, జీవితాలు ఒడిదుడుకులకు లోనుకాకుండా, మా పిల్లలు వేదనకు గురికాకుండా ఉండాలని కోరుకుంటున్నాను.

- వైఎస్ భారతి
w/oవైఎస్ జగన్

Friday, November 23, 2012

చంద్రబాబు సారుకు బహిరంగ లేఖ...

గౌరవనీయులైన చంద్రబాబు గారికి,

సార్, ఈమధ్యకాలంలో పేపర్‌లో మీ ప్రసంగాలు చదివినప్పుడు, టీవీలో మీ ప్రసంగాలు విన్నప్పుడు, నా భర్త తరచు అనే మాటలు నాకు గుర్తుకు వచ్చాయి- ‘ఈరోజు రాజకీయాల్లో విలువలు లేని పరిస్థితి చూస్తున్నాము’ అని. అదెంత నిజమో ఇప్పుడు తెలుస్తోంది! మీరు మీ ఎంపీలను చిదంబరం దగ్గరికి పంపి నా భర్తకు రావాల్సిన బెయిల్‌ను అడ్డుకున్నారు. మీ నీచ రాజకీయాలకోసం సీబీఐతో, కాంగ్రెస్‌తో చేతులు కలిపి, మీ గోబెల్స్ ప్రచారకులను, కొన్ని ఎల్లో పత్రికలను, ఛానల్స్‌ను వాడుకుని, జగన్ మీద, మా కుటుంబం మీద మీరు కరడుగట్టిన ఫ్యాక్షనిస్ట్ కంటే అన్యాయంగా ప్లాన్స్ వేసి, నా భర్తను మా నుండి, మా పిల్లల నుండి, ప్రేమించే ప్రజల నుంచి ఎంతకాలం వీలైతే అంతకాలం దూరంగా వుంచాలని నిత్యం ప్రయత్నిస్తున్నారు. నా భర్తను జైలు లోపల వుంచి, ఆయన మీద ఎన్ని అబద్ధాలు వీలైతే అన్ని అబద్ధాలు మీరు, మీ గోబెల్స్ ప్రచారకులు, మీ ఎల్లో గ్యాంగ్ కలిపి ప్రచారం చెయ్యాలనుకుంటున్నారు.

ఒక మనిషి ఎదుట లేనప్పుడు ఆ మనిషి గురించి తప్పుగా మాట్లాడడం కుసంస్కారం అని మాకు తెలిసిన, మాకు నేర్పిన విలువలు సార్! మరి మీరు నిజాలు కాదు... ఆ మనిషి లేనప్పుడు ఏకంగా అబద్ధాలే ప్రచారం చేస్తున్నారు. అది మీ స్థాయికి, మీ వయస్సుకు తగదు సార్. మిమ్మల్ని ఎందరో ప్రజలు గమనిస్తున్నారు. మీ నుంచి భావితరాలు ఎన్నో నేర్చుకోవాలి. అందుకే ఇటువంటి విలువలు లేని రాజకీయాలను భావితరాలకు నేర్పకండి. ఇప్పటికైనా విశ్వసనీయత లేని రాజకీయాలు చేయడం మానండి. మనిషి ఎదురుగా వున్నప్పుడు పోరాడితే అది ఒక సమఉజ్జీ పోరాటం అవుతుంది. అంతేకాని ఇలా దొడ్డిదారిగుండా ఒకరిని తగ్గించి, మనలను మనం పెంచుకోవాలనుకోవడం వీరుల లక్షణం కాదు సార్. అది నా దృష్టిలో పిరికివారు, నయవంచకులు, వెన్నుపోటుదారులు వాడే మార్గం సార్.

సార్, ఈరోజు మీరు నా భర్త స్థాపించిన వ్యాపారాల గురించి మాట్లాడుతున్నారు. నా భర్త స్థాపించిన రెండు కంపెనీలు - భారతి సిమెంట్, జగతి పబ్లికేషన్స్ రెండూ దేశంలోనే అగ్రగామిగా, మన రాష్ట్రానికి వన్నె తెచ్చేవిగా, ఈరోజు నిలిచాయంటే దానికి కారణం -దేవుని దయ, నా భర్త యొక్క అంకితభావం! 

ఈరోజు ఆ రెండు కంపెనీలు ఆధారంగా 30,000 పైచిలుకు కుటుంబాలు బతుకుతున్నాయి. మీకు జగన్ మీద, మా మామగారి మీద వుండే కక్షపూరితమైన మనస్సుతో ఈ 30,000 కుటుంబాలకు అన్యాయం చేసే నీచ రాజకీయాలు మానండి. 

సార్, తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, ఒకానొకప్పుడు దేశ రాజకీయాలను నిర్దేశించిన వ్యక్తిగా, మన రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష ముఖ్యనాయకుడుగా వున్న మీ ద్వారా ప్రజలకు, నాలాంటి ఈ రాష్ట్ర ఆడబిడ్డలకు మంచి జరగాలి కానీ, మీ మూలంగా నాలాగా ఏ ఆడబిడ్డ ఈ రాష్ట్రంలో కన్నీరు పెట్టకూడదు సార్! నాలాంటి ఆడబిడ్డల కన్నీరు మీకు మంచిది కాదు... మన రాష్ట్రానికి అంతకన్నా మంచిది కాదని చెప్తూ...

వయస్సులోను, అనుభవంలోనూ మీకంటే చిన్నదాన్ని అయిన నేను రాయడం తప్పుగా భావిస్తే క్షమించమని కోరుతూ... 
విలువలుగల రాజకీయాల కోసం నా భర్త నిలబడినట్టుగా మీరు కూడా నిలబడాలని మనస్పూర్తిగా ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.

yours sincerely,
Y.S. Bharathi


  

Sunday, November 18, 2012

దేవుడు జగన్ విజయాన్ని ఆరోజే రాసిపెట్టాడు

175 రోజులు అయ్యింది. ఇన్ని రోజులు జగన్‌ను జైలులో నిర్బంధించినా దేవుని దయతో చివరకు విజయం జగన్‌దే అవుతుంది. అధికార కాంగ్రెస్‌కు జగన్‌ను కష్టపెట్టడం తప్ప వేరే పనిలేదు. ప్రధాన ప్రతిపక్షమైన టిడిపికి, దాని ప్రముఖులకు జగన్ తుమ్మాడు, దగ్గాడు దగ్గర నుంచి జగన్ గురించి మాట్లాడడం తప్ప వేరే టాపిక్ లేదు. 175 రోజులు అయినా రెండు రోజులకు ఒకసారి సీబీఐ జగన్ మీద తప్పుడు లీకులు ఇవ్వకుండా వుండలేదు. వాటిని పతాక శీర్షికలలో, దిగజారుడు పదాల్లో కొన్ని పత్రికలు, టీవీలు చూపించక మానరు.

ఇదంతా ఒకవైపు ఉంటే 175 రోజులు జైలులో వుండి ప్రజలకు దూరంగా వున్నా, ప్రజలకు జగన్ మీద ఆ ప్రేమ, ఆ అభిమానం, ఆ ఆప్యాయత ఏమాత్రం తగ్గలేదు సరికదా ఎన్నోరెట్లు పెరిగింది. తమ కన్నబిడ్డకో, తమ సొంత అన్నకో అన్యాయం జరిగినట్లుగా భావించి వేదనపడుతున్నారు, రగిలిపోతున్నారు, కన్నీరుపెడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు.

ఇక మా ఇంట్లో అత్తమ్మకు, నాకు, పిల్లలకు గుండెనిండా జగనే. ఆలోచనలన్నీ జగన్ మీదే. షర్మిల వేసే ప్రతి అడుగు, మాట్లాడే ప్రతి మాట వెనుక అన్న మీద షర్మిలకు ఉండే ప్రేమ,అన్నకోసం తన మనస్సులోని బాధ, ఆరాటం ప్రతిబింబిస్తూ ఉంది.
రెండేళ్ల కుట్రలు, 175 రోజుల క్రూరత్వం నడుమ - ఈ మూడేళ్ల నుంచి ప్రజలు చూపించిన ప్రేమ, అండదండలు, ఆదరాభిమానాలు, దేవుని దయ, నిండైన ఆశీర్వాదం... ఇవి మా జీవితాల్ని నడిపిస్తున్నాయి. 

చరిత్ర తిరగేసినా, పురాణాలు చదివినా, ఏ మతం బోధించినా, మనం చూసేది ఒక్కటే... అన్యాయం, అక్రమం, దురాగతం - వీటి మీద అంతిమ విజయం - మంచిమార్గంలో, న్యాయమార్గంలో, ప్రేమ, మానవత్వ మార్గంలో నడిచేవారిదే. ఒక హిట్లర్ అయినా, ఒక గోబెల్లే అయినా, ఒక నరకాసురుడైనా, ఒక రావణుడైనా, కౌరవులైనా... వీరి పతనం, వీరి ఓటమి యుద్ధం మొదలవ్వకముందే రాసిపెట్టుంది. ఎందుకంటే గెలుపు మనం ఆడే ఆట మీద ఆధారపడదు - మనం ఎంచుకునే మార్గం మీద ఆధారపడి ఉంటుంది.

యధార్ధ హృదయం గలవారిని బలపరచడంకోసం దేవుని కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తూనే వుంటుంది. దేవుని కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల మీదా వుంటాయి. కాబట్టి, ఎన్ని యాత్రలు చేసినా, ఎన్ని మాటలు మాట్లాడినా, ఎన్ని కుట్రలు చేసినా, అధికార దుర్వినియోగం చేసి అన్యాయం చేసినా - 175 రోజులు జగన్‌ను జైలులో పెట్టినా జగన్ విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఈరోజు కాదు - ఇచ్చిన మాటకోసం ఎందరు బెదిరించినా, అదిలించినా బెదరకుండా ఓదార్పు యాత్ర మొదలుపెట్టిన రోజునే జగన్ విజయం రాసిపెట్టి వుంది. ఇచ్చిన మాటకోసం ఇస్తానన్న మంత్రిపదవిని, ముఖ్యమంత్రి పదవిని తృణప్రాయంగా ఎంచుకున్న రోజే దేవుడు జగన్‌కు విజయాన్ని రాసిపెట్టాడు. రెండున్నర సంవత్సరాలకు పైగా ప్రజలకోసం, ప్రజల మధ్య వారిలో ఒకనిగా వారితోనే తింటూ, వారితోనే వుంటూ, వారికి అన్నలాగా, తమ్మునిలాగా, కొడుకులాగా, మనవనిలాగా - 
‘వాళ్లకోసం నేను నిలబడాలి, వాళ్ల జీవితాలలో నేను వెలుగు తేవాలి, వాళ్ల కష్టాలను నేను తీర్చాలి’ అని జగన్ అనుకున్న ఆ మొదటి క్షణమే జగన్‌కు దేవుడు విజయాన్ని రాసిపెట్టాడు. తను జైలులో వున్నా తన గురించి కాకుండా ప్రజల గురించి, ప్రజా సమస్యల గురించి ఆలోచిస్తున్న జగన్‌కు దేవుడు విజయం రాసిపెట్టాడు. హాయిగా బెంగుళూరులో వుండి వ్యాపారాలు చేసుకుంటూ, భార్యాపిల్లలతో సంతోషంగా వుండడం కంటే, కష్టాలుపడే ప్రజలతో చేయిచేయి కలపాలని, వాళ్లను సంక్షేమ మార్గంలో నడిపించాలని నిశ్చయించిన రోజునే జగన్‌కు విజయాన్ని రాశాడు దేవుడు. 

ఎంత ఆపాలనుకున్నా కృష్ణుని పుట్టుకను కంసుడు ఆపలేకపోయినట్లే, క్రీస్తు పుట్టుకను హేరోదు ఆపలేకపోయినట్లే, జగన్ బయటకు రావడాన్ని ఎవ్వరూ ఆపలేరు. జగన్ విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఎందుకంటే జయాపజయాలు మన యుక్తి మీద, శక్తి మీద కాదు ఆధారపడేది - మనం నీతికి, న్యాయానికి, మంచితనానికి నిలబడ్డామా, లేక అన్యాయం, అక్రమం కోసం నిలబడ్డామా అనేదాని మీద ఆధారపడి వుంటాయి. కాబట్టి 175 రోజులైనా సరే సత్యమార్గంలో నడుస్తున్న జగన్‌దే విజయం

Tuesday, November 13, 2012

ఏ విలువలకోసం మీ జర్నలిజం?

కొన్ని వార్తా పత్రికల్లో మా సంస్థల గురించి ఏవేవో రాశారని సన్నిహితులు చెప్పారు. ఈ రోజు ఉదయం ఈనాడులో జగన్ బొమ్మవేసి బ్యానర్‌లో ‘‘కర్ణాటకలోనూ పోగేశారు’’ అనే కథనం రాశారు. జగన్, నేను కర్ణాటకలో భారీ ఎత్తున స్థిరాస్తులు సేకరించామని, సీబీఐ దర్యాప్తుకు హాజరైన సండూర్ పవర్ జీఎం గోపాల కృష్ణన్ మురళి తన వాంగ్మూలంలో వాటిని వెల్లడించారని అంటూ మాకున్న స్థలాలు, పొలాల వివరాలను ‘ఈనాడు’ రాసింది. ఈ రోజు ఈనాడు పెట్టిన శీర్షిక, రాసిన తీరు వరకు అంతా అభ్యంతరకరంగా ఉంది. మూడున్నర దశాబ్దాల చరిత్ర కలిగిన పత్రిక జర్నలిజం విలువలకు పాతర వేసి ఇలా రాయటం ఎంతో విచారకరం!
ఆ వివరాలు చూసిన తరవాత నా భావాలను విజ్ఞులైన ఈ రాష్ట్ర ప్రజల ముందు ఉంచాలనిపించింది. ఆ భావాల్లో మొట్టమొదటిది - ఈ వివరాలు జగన్ ఎన్నికల అఫిడవిట్ రూపంలోనో, మేము ప్రభుత్వ సంస్థ అయిన రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీలకో, ఆదాయ పన్ను రిటర్న్ ద్వారానో వెల్లడించినవే! మా దగ్గర ఆదాయానికి మించిన ఒక్క రూపాయి ఆస్తి కూడా లేదు. మా ఆస్తులు ఏవైనా, చట్ట బద్ధ ఆదాయంతో, పన్నులు చెల్లించి మేం కొనుగోలు చేసిన ఆస్తులే. ఆ విషయాన్నే మా సంస్థల్లో ఉన్నత ఉద్యోగి అయిన మురళి సీబీఐకి చెప్పి ఉంటారు. విశేషం ఏమిటంటే... సీబీఐ అధికారి, మురళి మధ్య ప్రశ్నలు, జవాబులు ఏమిటన్నది వారిద్దరికీ తప్ప మూడో వ్యక్తికి తెలిసే అవకాశం లేదు, ఉండకూడదు. కానీ చట్టబద్ధమైన మా లావాదేవీలకు సంబంధించిన వివరాలను మా ఉద్యోగి సీబీఐకి చెబితే, ఆయన ఏం చెప్పాడన్నది ఈనాడుకు ఎలా తెలిసింది? ఈ ఒక్క సందర్భంలో మాత్రమే కాదు... దర్యాప్తు ప్రారంభించిన 2011 ఆగస్టు 10 నుంచి, ఈ రోజు వరకు ఇలా వందలకొద్దీ కథనాలు నేరుగా గిట్టని మీడియా సంస్థల చేతుల్లోకి ఎలా వస్తున్నాయి?

ముందుగానే చెప్పినట్టు మా వ్యాపారాలు, వ్యాపార లావాదేవీలు, ఆస్తులు... ఇవేవీ మేం ప్రజలకు కనిపించకుండా దాచుకోలేదు. ఇవి రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్(ఆర్ ఓ సీ)కి మాకుగా మేం వెల్లడించినవి. ఇవి ఐటీ శాఖకో, ఎన్నికల సంఘానికో మేం సమర్పించిన వివరాల్లోనివి. ఇవి వివిధ సంవత్సరాల్లో మేం చేసిన కొనుగోళ్ళకు సంబంధించినవి. వీటికి సంబంధించి సీబీఐ ఎందుకు లీకులు ఇస్తోంది? ఎవరిని ప్రభావితం చేయటానికి, ఏం సాధించటానికి ఇంతకు దిగజారుతున్నారు? ఇంతకీ సీబీఐ ఈ దర్యాప్తును కొనసాగిస్తున్నది కోర్టు ఆదేశాలకు లోబడా? లేక ప్రజల్లో జగన్ ప్రతిష్టను తగ్గించాలన్న దురుద్దేశంతోనా? మేము కంపెనీలే రిజిస్టర్ చేయకూడదు, వ్యాపారాలే చేయ కూడదు, లాభాలు సంపాదించ కూడదు... మా కంపెనీల్లో పెట్టుబడులే పెట్టకూడదన్నట్టు కక్ష సాధింపుతో జరుగుతున్న వ్యవహారాన్ని దర్యాప్తు అంటారా? మాకు వ్యతిరేకమైన రాజకీయ పార్టీలకు, పత్రికలకు తప్పుడు సమాచారాన్ని లీకులివ్వటం చట్ట బద్ధమా? అది నేరం కాదా? విజ్ఞులైన ప్రజలు దీన్ని గ్రహించాలి. 

మాకున్న కంపెనీల్లో ఎంతమంది ఉద్యోగులు ఉన్నారన్నదీ మేం దాచుకునే ప్రయత్నం చేయలేదు. ఏ కంపెనీ డబ్బుతో ఎక్కడ కొనుగోలు చేశామన్నది మాకుగా మేం ఆర్ ఓ సీకి సమర్పించాం. కాకపోతే దీన్ని ‘ఈనాడు’లో ‘పోగేయటం’గా రాశారు. గిట్టని మనుషులమీద ఈ స్థాయికి దిగజారి కథనాలు రాయటం ఏ జర్నలిజం ప్రమాణాలకు పట్టం కట్టటమో మీరే ఆలోచించాలి. గిట్టని వారిని ఆడిపోసుకోవటానికి, బెదిరించటానికి, అదిలించటానికి ధర్మ విరుద్ధమైన పనులకు జర్నలిజం అనే పేరు ఎలా అతుకుతుంది? 

ఆస్తులను మా గ్రూపు సంస్థల ద్వారా కొన్నామని రాశారు. మా కంపెనీల ఆస్తులు మా కంపెనీల ద్వారా కాకుండా ఎవరి కంపెనీల ద్వారా కొంటాం? ఏ ఆస్తులను కొన్నా, వ్యాపార విస్తరణ వ్యూహంలో భాగంగానే ఆ పని చేశాం. వ్యాపార విస్తరణ ద్వారా ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలను సృష్టించాం. ఈ రోజున మా పెట్టుబడులున్న సంస్థలు కనీసం పాతికవేల ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించాయన్నది అందరికీ తెలిసిన విషయం. 

జగన్ తండ్రి, తాత ఏనాడో భారీగా వ్యాపారాలు చేసిన వ్యక్తులు. మూడు తరాలనుంచి మాది మైనింగ్, వ్యాపారం, పారిశ్రామికరంగాలతో ముడిపడిన కుటుంబం. ఈ రాష్ట్రంలో అత్యంత ఖరీదైన గనులకు 1970-80ల నాటికే వైఎస్ కుటుంబీకులు యజమానులు. అదీగాక, నాలుగయిదు తరాలుగా వైఎస్‌లది చంద్రబాబు, రామోజీలకు భిన్నంగా బిజినెస్‌లో ఉన్న కుటుంబం. రాజశేఖరరెడ్డిగారు అధికారంలోకి రాక మునుపే మా కుటుంబం బెంగుళూరులో మకాం ఉంది. అక్కడ వ్యాపారాలు ప్రారంభించింది. 

మరో ముఖ్య విషయం ఏమిటంటే, జగన్ అటు వ్యాపారంలో ఉన్నా, ఇటు ప్రజా క్షేత్రంలో ఏ పని చేసినా త్రికరణ శుద్ధితతో చేసే మనస్తత్వం. అందుకే ఒక సాండూర్ పవర్, ఒక భారతి సిమెంట్, ఒక సాక్షి... ఇలా ఏదయినా అనతి కాలంలోనే కార్య రూపంలోకి వచ్చింది. నిర్మాణాలు, మెషినరీ, మార్కెట్‌లో వాటికి బ్రాండింగ్... అన్నీ జగన్ ఓ కమిట్‌మెంటుతో, విసుగూ విరామం లేకుండా పూర్తి చేశాడు. చేసే పనిలో క్వాలిటీ, ట్రాన్స్‌పెరెన్సీ ముఖ్యం అన్నది జగన్ నైజం. ఇందులో ఏ మాత్రం రాజీపడడు. అందుకే ప్రజలు ఆదరించారు. దేవుడు ఆశీర్వదించాడు. రాజకీయాల్లోనూ అంతే. ఒక్కసారి అంటూ నల్ల కాలువ దగ్గర మాట ఇచ్చి కదిలిన తరవాత, ఇక వెనుదిరిగి చూసే మనస్తత్వం లేదు. ప్రజలకు జగన్ కంపెనీలమీదగానీ, జగన్ పార్టీమీదగానీ ఆకాశమంత విశ్వాసం ఉందంటే అందుకు కారణం జగన్ వ్యక్తిత్వమే. ఈ వ్యక్తిత్వం వల్ల ఒకోసారి జగన్ బాగా కష్టపడిన సందర్భాలూ ఉన్నాయి. కానీ నమ్మిన బాటలో నడిచే ఎవ్వరూ నష్టపోరు. జగన్‌కు లొంగే మనస్తత్వమే ఉంటే, రాజీపడే ధోరణి అలవడి ఉంటే, విలువలన్నింటికీ తిలోదకాలు ఇచ్చి ఉంటే... ఏనాడో కేంద్రమంత్రో, ముఖ్యమంత్రో అయి ఉండేవాడు.

తాను ఎదగాలన్న ఆలోచన ఉన్న వ్యక్తుల్ని ఎవరూ తప్పు పట్టరు. కానీ ఇతరుల్ని కిందికి లాగటమే జీవితంగా పెట్టుకున్న వ్యక్తులు ఏనాటికీ పైకి రారు. వారు బయట, బాహాటంగా తిరుగుతున్నా వారి ఆలోచనలన్నీ ఇతరుల్ని నాశనం చేయాలన్న ఆలోచనలతో నిండి ఉంటే అలాంటి వ్యక్తుల్ని సమాజం ఆమోదించదు. మరోవంక, వీరందరి కుట్రల ఫలితంగా జైల్లో ఉన్నా, ప్రజా సమస్యలమీద ఉద్యమించండి అంటూ జగన్ అక్కడినుంచే పార్టీ శ్రేణులను పరుగులు తీయిస్తున్నాడు. ఇతరులను ఎలా కిందికి లాగాలా అని ఆలోచించి విలువైన సమయాన్ని వృథా చేసుకునే మనస్తత్వం ఆయనకు లేదు. 

జగన్‌ను అరెస్టు చేసి 168 రోజులయింది. సీబీఐ దర్యాప్తు ప్రారంభమై 15 నెలలు పూర్తయ్యాయి. ఈ దేశంలో రాజకీయ ఆరోపణల కారణంగా సీబీఐ దర్యాప్తు ప్రారంభమై ఒక రాజకీయ నాయకుడి ఇంటి మీద దాడులు చేయటంగానీ, అరెస్టు చేయటంగానీ ఏనాడూ జరగలేదు. అరెస్టు చేసిన 90 రోజుల్లోగా విచారణ పూర్తి చేయాలన్న నిబంధనకు దర్యాప్తు సంస్థ లోబడనట్టయితే బెయిల్ ఇవ్వాలని చట్టం చెపుతున్నా, ఈ రోజువరకు జగన్‌మోహన్‌రెడ్డి విషయంలో ఆ నిబంధన వర్తించలేదు. ఇది అన్యాయం అని మాకు అనిపించినా న్యాయస్థానాలమీద, ప్రజాస్వామ్యంమీద మాకున్న గౌరవం సడలలేదు. అధికారం, ప్రతిపక్షం, మీడియాలో ఒక వర్గం... ఈ మూడింటి కుట్రలూ కుహకాలు ఏ స్థాయిలో ఉన్నాయో విన్నవించటానికి ఈ బహిరంగ లేఖను మీ ముందుంచుతున్నాను. 

రాష్ట్రం, దాని ప్రయోజనాలు ఎటు పోయినా... ప్రజా నాయకుడిని ప్రజల్లో ఎదుర్కోలేక జైల్లో పెట్టి అధికార పక్షం, ప్రతిపక్షం నాయకులు జనంలో విశృంఖలంగా తిరుగుతున్నా... వారికి భరోసా లేదు. వైఎస్ అనే రెండక్షరాలు, జగన్ అనే మూడక్షరాలు చట్టాన్ని, రాజ్యాంగాన్ని కూడా ఉల్లంఘించేలా దర్యాప్తు సంస్థల్ని, వాటి బాసుల్ని వక్ర మార్గాల్లో నడుపుతున్నాయి. వారు వేసే ప్రతి ఎత్తుగడ జగన్‌ను మరింత పెద్దవాణ్ణి చేస్తుంది. వారు చేసే ప్రతి కుట్ర జగన్‌ను ప్రజల గుండెలకు మరింత చేరువగా తీసుకువెళుతుంది. ఇది నా నమ్మకం మాత్రమే కాదు... గత మూడేళ్ళ చరిత్ర! దేవుడు న్యాయాన్ని, సత్యాన్ని బట్టి ప్రతి ఒక్కరికీ వారి క్రియా ఫలాన్ని ఇచ్చేవాడు కాబట్టి, వీరు వేసే ప్రతి నిందకూ దేవుడు రెట్టింపు ఘనతను జగన్‌కు చేకూరుస్తాడని నేను నమ్ముతున్నాను.

Saturday, October 27, 2012

మీ పలుకుబడితో చేస్తున్న పని ఇదా?!

ప్రజలు మిమ్మల్ని నాయకులుగా చేసింది మీ స్వప్రయోజనాల కోసం పోరాడడానికా, ప్రజల స్వరం వినిపించడానికా? జగన్‌కు వ్యతిరేకంగా చేసే పోరాటంలో ఒక్క శాతం అయినా ప్రజలకోసం నిజంగా పోరాడండి. ప్రజలకు సౌకర్యాలను సాధించిపెట్టండి. అప్పుడు ‘మీకోసం’ అంటే ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు. 

కొద్దిరోజుల క్రితం జగన్ బెయిల్ హియరింగ్ రోజున- అంటే అక్టోబర్ 5న సుప్రింకోర్టుకు సీబీఐ అందించిన స్టేటస్ రిపోర్ట్ చూశాను. అందులో ‘సాక్షి’ సంస్థ ఆస్తుల ఈడీ అటాచ్‌మెంట్ ప్రస్తావన వుంది. అది చూసిన వారికి ఎవరికైనా ఇట్టే అర్థం అవుతుంది - కాంగ్రెస్, సంబంధిత సీబీఐ మరియు టీడీపీ ఎంత బాగా కలిసి పనిచేస్తున్నాయో.

సుప్రింకోర్టులో రాతపత్రం - అందునా 17 పేజీల రాతపత్రం సమర్పించాలంటే అప్పటికప్పుడు టైప్ చేయించి ఇవ్వడం వీలుపడదు. కానీ అక్టోబర్ 4 సాయంత్రం చంద్రబాబుగారి టీడీపీ ఎంపీలు చిదంబరం గారిని కలిసి ‘జగన్ ఆస్తులను అటాచ్ చెయ్యండి’ అని వినతిపత్రం ఇచ్చారు. ‘మీకోసం’ పాదయాత్రలో ఉన్న బాబుగారితో ఫోన్‌లో మాట్లాడించారు. రెండుమూడు గంటల వ్యవధిలో ‘సాక్షి’ సంస్థ ఆస్తులు అటాచ్ అయ్యాయి. ఇది అక్టోబర్ 5న సీబీఐ రాతపత్రం సమర్పించడానికి కొన్ని గంటల ముందు జరిగిన పరిణామం. అయినప్పటికీ సీబీఐ రాత

పత్రంలో ఈ విషయం చోటుచేసుకుంది. రెండు నెలలకు పైగా సుప్రీంకోర్టులో ఈ బెయిల్ హియరింగ్ విచారణలో వుంది. ఇన్ని రోజులు సమర్పించని రాతపత్రం టీడీపీ ఎంపీలు ‘సాక్షి’ ఆస్తులు అటాచ్ చేయించిన వెంటనే దాన్ని కూడా కొన్ని గంటల వ్యవధిలోనే రాతపత్రంలో పొందుపరిచి కోర్టుకు సమర్పించారు. టీడీపీ వాళ్ల వినతి మేరకు ఈడీ అటాచ్ చేస్తుంది... చేసిన వెంటనే అక్టోబర్ 5న దానిని జతచేసి రాతపత్రం కోర్టుకు సమర్పించాలనేది కాంగ్రెస్, టీడీపీ, సీబీఐల వ్యూహం. అక్టోబర్ 5న ఈ కుట్రల వల్ల బెయిల్ రాలేదు. ఇది అందరూ కలిసి ఆడుతున్న నాటకమని, దీనివెనక బెయిల్ రాకుండా అడ్డుకోవడానికి ఎంత కుట్ర దాగివుందని అర్థమవుతుంది. 

ఒక కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడానికి ఎందుకు ఇన్ని ప్లాన్‌లు వేస్తున్నారు? వైయస్‌ఆర్ గారికి, జగన్‌కు ఉన్న ప్రజాభిమానం చూసి ఓర్వలేక వారిని ఇబ్బందిపెట్టాలనుకుంటున్నారా? కానీ ఇలా చేస్తే వైయస్‌ఆర్ గారికి, జగన్‌కు ప్రజాభిమానం పెరిగేదే కాని తరిగేది కాదు. పెపైచ్చు ఇంత అన్యాయంగా కుట్రలు చేసే మీమీద అసహ్యం పెరగక మానదు. మిమ్మల్ని జనం అపనమ్మకంతో చూస్తారు. మీరు చేసేవన్నీ నాటకాలు అనుకుంటారు.

నిజం నిప్పులాంటిది. అన్నిరోజులు అందరినీ మోసం చేయలేరు. ప్రజాభిమానం పొందాలంటే మీ ఎంపీలను ఢిల్లీ పంపి ప్రజలకోసం వినతిపత్రాలు ఇవ్వండి. జగన్‌కు వ్యతిరేకంగానో, మీ కేసుల కోసమో కాకుండా ప్రజా సమస్యలపై కేంద్ర ప్రభుత్వంతో నేరుగా మాట్లాడి... లేదంటే ఫోన్‌లో మాట్లాడి పనులు చేయించండి. ఫోన్‌లో మాట్లాడి, ఎంపీలను పంపి ఆస్తులు అటాచ్ చెయ్యగల సామర్థ్యం ఉన్నప్పుడు ఆ సామర్థ్యాన్ని ప్రజా సమస్యల కోసం వాడండి. ఒక పెన్షన్ ఇప్పించండి. ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయించండి. కొన్ని గంటలైనా అదనంగా కరెంటు ఇప్పించండి. అప్పుడు ప్రజాభిమానం దానంతట అదే వస్తుంది. దేవుడిచ్చిన పలుకుబడిని ఒకరిని ఇబ్బందిపెట్టడానికి బదులు, ఒకరికి మేలు చేయడానికి వాడండి. అప్పుడు ప్రజలు మిమ్మల్ని మెచ్చుకుంటారు. దేవుడు మిమ్మల్ని కటాక్షిస్తాడు.

ఈరోజు జగన్‌కు వుండే బలం అదే. ‘సాక్షి’ ఆస్తులు అటాచ్ చేస్తే జగన్‌ను దెబ్బతీసినట్టు అనుకుంటే అది పొరపాటు. ఎందుకంటే జగన్ ఆస్తి ప్రజాభిమానం, దేవుని దయ. జగన్ పోరాటం తనకోసం కాదు... ప్రజలకోసం. అందుకే ప్రజలు జగన్‌ను అభిమానిస్తున్నారు.

గత మూడు సంవత్సరాలుగా ప్రజలు ఇన్ని కష్టాలు పడుతుంటే ప్రజా సమస్యలు గాలికి వదిలేసి, మన రాష్ట్రంలోని రెండు ప్రధాన పార్టీలు చనిపోయిన వ్యక్తి గురించి చెడు మాట్లాడడం సభ్యత కాదు అని కూడా మరచి మాట్లాడుతున్నారు. 2009కి ముందు అసలు హైదరాబాద్‌లోనే లేని, ప్రభుత్వంతో సంబంధం లేని జగన్ మీద నిందలు మోపి, కేసులు వేసి, కుట్రతో జైలుకు పంపారు. బెయిల్ రాకుండా ప్రయత్నించి సఫలీకృతులయ్యారు. ఈరోజు కొత్తగా జైలులో సౌకర్యాలు అని పాట పాడుతున్నారు. ఇన్ని మాటలు మాట్లాడే పెద్దమనుషులు వారిని ఎన్నుకున్న ప్రజలకోసం ఎంత మాట్లాడారు? వైయస్సార్ గారికి, జగన్‌కు వ్యతిరేకంగా ఎన్ని మాటలు మాట్లాడారు? ప్రజలు వీరిని నాయకులుగా చేసింది వీరి స్వప్రయోజనాల కోసం పోరాడడానికా, ప్రజల స్వరం వినిపించడానికా? జగన్‌కు వ్యతిరేకంగా చేసే 

పోరాటంలో ఒక్క శాతం అయినా ప్రజలకోసం నిజంగా పోరాడండి. ప్రజలకు సౌకర్యాలను సాధించిపెట్టండి. అప్పుడు ‘మీకోసం’ అంటే ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు. 

జగన్ ఆలోచనలన్నీ ప్రజలకోసం తనేం చెయ్యగలనా అని! అంతేకాని, మిమ్మల్ని ఎలా ఇరికించాలా, ఎలా ఇబ్బందులు పెట్టాలా అని కాదు. అందుకే జగన్‌ను ప్రజలు నమ్ముతున్నారు. అభిమానిస్తున్నారు. జగన్‌కు కుళ్ళు, కుట్రలు రావు, తెలీదు. అందుకే దేవుని దయ జగన్‌ను ఆశీర్వదిస్తుంది.

Tuesday, October 23, 2012

బిడ్డల మీద ప్రమాణం చేయగలరా?


నేను, నా భర్తను కలవడానికి వెళ్లినపుడు ఈ దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా వీడియో కెమెరాలు పెట్టారు ఈ ప్రభుత్వ పెద్దలు. అంటే భార్యాభర్తలు మాట్లాడుకునే మాటలు కూడా వీళ్లు చెవులు పెట్టి రికార్డు చేసి అంతా వినాలని. దీనినిబట్టి మీరే చెప్పాలి - ఇంతకంటే గొప్ప సౌకర్యం ఏముంటుందో! మా పెళ్లిరోజు నేను జగన్‌ను చూడడానికి వెళ్లినపుడు నాకు, జగన్‌కు పది అడుగుల దూరంలో ఒక పోలీసును కూర్చోబెట్టారు. ఇంత గొప్ప సౌకర్యాలు మాకు ఇస్తున్నారు.

రెండు మూడు రోజులుగా టిడిపి పెద్దలు - జగన్‌కు జైలులో సౌకర్యాలు కల్పిస్తున్నారంటూ కొత్త కథను తెరమీదికి తెచ్చారు. 2010 డిసెంబర్ మొదలుకుని టీడీపీ - కాంగ్రెస్‌తో కలిసి ఆడుతున్న నాటకంలో ఇది ఇంకొక మెట్టు. ఈ 18-20 నెలలుగా ఈ రెండు పార్టీలు ఆడుతున్న రాజకీయ క్రీడను గమనిస్తున్న ఎవరికైనా, రాజకీయాలలో ఓనమాలు రాని నాలాంటి వారికైనా స్పష్టంగా అర్థమయ్యేది ఏమిటంటే - జగన్‌ను ఇబ్బందిపెట్టడానికి ఒక పార్టీ ప్రతిపాదిస్తుంది... రెండవ పార్టీ దాన్ని బలపరుస్తుంది అని! కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకరరావు గారు లెటర్ రాశారు... టిడిపి నాయకుడు ఎర్రంనాయుడుగారు, మరికొందరు దానితో జతకలిశారు. కోర్టుకు రాస్తారు... అక్కడ మొదలుకుని మొన్న బెయిల్ వరకు టిడిపి, కాంగ్రెస్ కలిసి ప్రతి మలుపులో జగన్‌ను ఇబ్బంది పెట్టడానికి వేయని నాటకం లేదు.

నాకు అర్థంకానిది ఒకటే - వీళ్లందరూ - రెండు పార్టీలవారు తలపండిన రాజకీయ నేతలు - 20-30 సంవత్సరాల రాజకీయ అనుభవం కలవారు - జగన్ రాజకీయ వయస్సు 3 సంవత్సరాలు. మరి జగన్‌ను ఎదుర్కోవడం వీరికి ఎంతో సులభం. ఒక పిహెచ్‌డి వ్యక్తి ఫస్ట్‌క్లాస్ పిల్లాడితో తలపడినట్లే. వాళ్ల అనుభవానికి, వాళ్ల ప్రజాసేవ చరిత్రకి వాళ్లు ఇంతగా జగన్‌ని చూసి ఉలిక్కిపడాల్సిన అవసరం లేదు. కానీ, ఇలా ఎందుకు వాళ్లు దొడ్డిదారిన, దొంగతనంగా జగన్‌తో తలపడుతున్నారో నాకు, ఈ రాష్ట్రంలోని సామాన్య ప్రజలకు అర్థం కాని విషయం.

ఈరోజు టీడీపీ పెద్దలు జైలులో జగన్‌కు సౌకర్యాలు అంటున్నారు. జగన్ జైలులో సెల్‌ఫోన్ వాడుతున్నాడు అన్నారు. జగన్ జైలులో సెల్‌ఫోన్‌లో మాట్లాడలేదు అని నేను నా బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్పగలను. మిగతా విషయాల్లో మీ సత్యసంధత తరువాత సంగతి... ఈ విషయంలోనైనా మీ బిడ్డల మీద ప్రమాణం చేసి జగన్ జైలులో సెల్‌ఫోన్ వాడుతున్నాడని మీరు అనగలరా?

జగన్‌ను ఈరోజు అన్యాయంగా విచారణ పేరుతో అరెస్టు చేసినా, బెయిల్ రాకుండా మీరు ఇంతమంది కుట్రలు చేస్తున్నా జగన్ గురించి నాకు తెలిసింది ఒక్కటే - జగన్ నియమ నిబంధనలు పాటించే మనిషి. జగన్ ఎంచుకున్న మార్గం కష్ట మార్గమని తను పార్టీ నుంచి బయటికి వచ్చిన రోజే చెప్పాడు - ‘‘నాతో వస్తే కష్టాలు వుంటాయి. వాటికి తట్టుకుని నిలబడగలిగితేనే నాతో రండి’’ అని. ఎంతటి ఆటుపోట్లకు గురిచేసినా చెదరని మనిషి, జైలు నియమ నిబంధనల దగ్గర మారతాడా. అసలు జగన్ మీరన్నట్టు రాజీపడి రాజకీయాలు చేసేవాడైతే ఇంతదూరం రావలసిన పనిలేదు. జైలుకు వెళ్లవలసిన పనిలేదు. సుఖంగా బెంగుళూరులో వుండి వ్యాపారాలు చేసుకుంటూ, కుటుంబంతో హాయిగా వుంటే, గులాంనబీ ఆజాద్‌గారు అన్నట్టు కాంగ్రెస్ పార్టీలోనే వుంటే ఎప్పుడో వారే సెంట్రల్ మినిస్టర్‌ని చేసేవారు... తర్వాత ముఖ్యమంత్రిని కూడా చేసేవారు. అంతవరకు ఎందుకు అనుకుంటే - కొందరు పెద్దల మాదిరి చీకట్లో చిదంబరం గారిని కలుసుకుని అన్నీ చక్కబెట్టుకునేవాడు. 

నేను ఈరోజు జగన్‌కు జైలులో సౌకర్యాలు అనే అంశం మీద రాష్ట్ర ప్రజలకు జైలులో జరిగిన రెండు సన్నివేశాల గురించి చెప్పదలచుకున్నాను.

నేను, నా భర్తను కలవడానికి వెళ్లినపుడు ఈ దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా వీడియో కెమెరాలు పెట్టారు ఈ ప్రభుత్వ పెద్దలు. అంటే భార్యాభర్తలు మాట్లాడుకునే మాటలు కూడా వీళ్లు చెవులు పెట్టి రికార్డు చేసి అంతా వినాలని. దీనినిబట్టి మీరే చెప్పాలి - ఇంతకంటే గొప్ప సౌకర్యం ఏముంటుందో! మా పెళ్లిరోజు నేను జగన్‌ను చూడడానికి వెళ్లినపుడు నాకు, జగన్‌కు పది అడుగుల దూరంలో ఒక పోలీసును కూర్చోబెట్టారు. ఇంత గొప్ప సౌకర్యాలు మాకు ఇస్తున్నారు. అంతా టీడీపీ పెద్దల చలవే!

అసలు ఇన్ని సౌకర్యాలు మన దేశంలోనే కాదు కదా, భూమి మీద ఏ దేశంలోనూ ఉండవు. ఇన్ని చేస్తున్నా ఓర్చుకొని ఉన్నాం. మా ఆయన ఒక ఎంపీ, ఒక పార్టీ అధ్యక్షుడు. మా మామగారు రాష్ట్రానికి ఎంతో సేవచేసి, స్వాతంత్య్ర భారతదేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని సంక్షేమాన్ని, అభివృద్ధిని రాష్ట్రానికి అందించిన మహానాయకుడు. ప్రజాసేవలోనే తుదిశ్వాస విడిచారు. అటువంటిది మీరు (టీడీపీ - కాంగ్రెస్) మమ్మల్నే ఇంత వేధిస్తున్నారంటే ఇక సామాన్య ప్రజల మాటేమిటి? 

ఈరోజు ప్రజలకు నేను రెండు మాటలు చెప్పదలచుకున్నాను. మొదటిది - ఎవరైనా ధైర్యం వుంటే ఎదురుగా నిలబడి పోరాడాలి. అంతేకాని, ఇలా దొంగగా పోరాడేది పిరికిపందలే. జగన్‌ను నేరుగా ఎదుర్కోలేక జైలులో పెట్టారు. ఇప్పుడు బయట ఉన్నది ముగ్గురు ఆడవాళ్లు. రాజకీయాల్లోకి కాదు కదా, ఏరోజూ బయటికే రాని ఆడవాళ్లు. వాళ్లను కూడా ఈ టీడీపీ, కాంగ్రెస్ పెద్దలు నేరుగా ఎదుర్కోలేకుండా వున్నారంటే మీరే చెప్పండి - మేమేం చెయ్యాలో.

రెండవది - ప్రజల ముందు మరొకటి చెబుతున్నా - జగన్‌కు జైలులో సౌకర్యాలు అని టీడీపీ చేసే ఆరోపణలు రాబోతున్న మరో కుట్రకు సంకేతం. టీడీపీ వాళ్ల మాటలకు అనుగుణంగా కాంగ్రెస్ ఏమైనా జగన్‌కు ప్రతికూలంగా చర్యలు తీసుకుంటే - ఈ కుట్రలకు, ఈ చీకటి ఒప్పందాలకు మీరే సాక్షులు. కొన్నిరోజుల క్రితం నేను డీజీ గారికి ‘జైల్ మాన్యువల్ ప్రకారం నా భర్తను నేను వారానికి మూడుసార్లు కలవడానికి వీలు కల్పించమ’ని లెటర్ రాశాను. ఆ విషయంలో కానీ, మరే విషయంలో కానీ కాంగ్రెస్ ప్రభుత్వం (కేంద్ర, రాష్ట్ర) ఈ టీడీపీ ఆరోపణల నేపథ్యంలో ప్రతికూలంగా స్పందిస్తే అది వారి అపవిత్ర కలయికకు మరో నిదర్శనం అవుతుంది. దానికి ప్రజలే సాక్షులు. 

నిజం చెప్పండి - మా మీద పెట్టిన ఈ కేసులు, జగన్ అరెస్టు, 3 సంవత్సరాలుగా వేధింపులు - వీటికి కారణం మాకున్న ఆస్తులా లేక మా మామగారు, ఆ తరువాత నా భర్త సంపాదించుకున్న ప్రజాభిమానం అనే కొండంత ఆస్తా. నిజం చెప్పండి... ఈ కేసులకు మూలం - సాక్షి పత్రిక, టీవీ ఛానల్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ - వీటి మీద ప్రజలు చూపుతున్న ఆకాశమంత అనురాగమా, లేక మేము తప్పు చేశామనా? సమాధానాలు అందరికీ తెలుసు. 

అయినా ఇన్ని ప్రజా సమస్యలుంటే అవేవీ పట్టనట్టు జైల్లో వున్న జగన్ మీదే వాళ్ల ధ్యాసంతా.

ఈ కుట్రలను కుతంత్రాలను దేవుడు చూస్తున్నాడు. ప్రజలు చూస్తున్నారు. ఎవరు తీసిన గోతిలో వాళ్లే పడే కాలం ఎంతోదూరంలో లేదు. దేవుని ఆశీస్సులతో ఇవన్నీ దాటుకుని బయటకు వస్తాం. అంతవరకూ మా ఈ పోరాటం ఆగదు

Monday, October 22, 2012

పదికోట్ల మందితో పెనవేసుకున్న బంధం...

జనం కోసం జగన్, జగన్ కోసం జనం - ఈ మాటలు ఎవరు కూర్చారో నాకు తెలియదు కానీ, ఈ నాలుగు రోజుల పాదయాత్రలో ఆ మాటలు నిజం అని చాలా దగ్గరగా చూడగలిగాను. పావురాలగుట్టలో జగన్ మాట ఇచ్చినప్పుడు - జగన్ ఒక్కడు! ఒక దివంగత ముఖ్యమంత్రి కొడుకు! కానీ ఈరోజు జగన్10 కోట్ల ఆంధ్రులకు ఒక అన్న, ఒక తమ్ముడు, ఒక కొడుకు, ఒక మనవడు - ఈరోజు జగన్ ఒక్కడు కాదు... 10 కోట్ల ఆంధ్రులతో ప్రేమానుబంధం పెనవేసుకుని వారిలో నుండి వారి కోసం పుట్టుకొని వచ్చిన నాయకుడని నాకు అనిపించింది.

నాకు ఇవాళ ఆరోజు గుర్తుకు వచ్చింది. జగన్‌ను మే 27న అరెస్టు చేశారు. జూన్ 12న ఎలక్షన్... జూన్ 15న బైఎలక్షన్ ఫలితాలు వెల్లడయ్యాయి. ఫలితాలు వచ్చిన తరువాత వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వచ్చి ‘ఎన్నికలు అయిపోయాయి. ఎన్నికలకు ముందు మిమ్మల్ని అన్యాయంగా అరెస్టు చేశారు. మేము మీకోసం ఏమైనా పోరాటం చేస్తాం’ అన్నారు. కానీ, జగన్ - ‘నాకోసం వద్దు, ప్రజలు ఎంతో ఇబ్బందులలో వున్నారు. వాళ్లకు నీళ్లు లేవు, కరెంటు లేదు, పెట్రోలు ఛార్జీలు పెంచారు. ఫీజు రియింబర్స్‌మెంట్ లేదు... వాటి మీద పోరాటం గట్టిగా చెయ్యండి’ అని చెప్పాడు. అలా జైలులో పెట్టి 90 రోజులు కావచ్చింది.

మళ్లీ పార్టీ నాయకులంతా - ‘రాజ్యాంగం ప్రకారం 90 రోజులకు మీకు బెయిల్ రావాలి. మమ్మల్ని ఊర్లలో ప్రజలు అడుగుతున్నారు - జగన్‌ను ఎప్పుడు బైటికి తెస్తారు - అని. మేం ఏదైనా ఆందోళన కార్యక్రమం చేపడతాం’ అన్నారు. కానీ మళ్లీ జగన్ ‘మనం ప్రజల తరఫున పోరాడతాం అని జనం మన మీద ఎంతో నమ్మకం పెట్టుకుని ఉన్నారు. మనం మన సమయాన్ని, శక్తిని మన కోసం కాదు, మన మీద నమ్మకం పెట్టుకున్న ప్రజల కోసం ఉపయోగించాలి. మనకోసం వద్దు, ప్రజల కోసం చేయండి’ అని చెప్పాడు. నేను కూడా జగన్‌తో అన్నాను - ‘జగన్... టిడిపిలో కానీ, కాంగ్రెస్‌లో కానీ వాళ్ల పార్టీ నాయకుడిని ఎవరైనా ఏమైనా మాట అంటేనే వాళ్లు ఎన్నో ఆందోళనలు చేస్తారు. అటువంటిది నిన్ను ఏకంగా అరెస్టు చేశారు. మనం ఏమీ చేయడం లేదు’ అని. దానికి జగన్ - ‘మన పార్టీ వుండేది మనకోసం కాదు... ప్రజలకోసం. ప్రజలకు మేలు చేయడం కోసం’ అని అన్నాడు.

మొన్న సుప్రీంకోర్టులో బెయిల్ రాని రోజు షర్మిల వాళ్ల అన్నతో అంది - ‘అన్నా, నీకోసం ఎంతోమంది వేచివున్నారన్నా. మేం ఇంతమంది నిన్ను ప్రేమిస్తూ కూడా నీకోసం ఏమీ చెయ్యలేమా అన్నా. ఏమైనా చేస్తామన్నా నీకోసం’ అంది. దానికి జగన్ - 
‘నాకోసం వద్దు, ప్రజల కోసం చెయ్యాలి. నా తరఫున ప్రజల దగ్గరికి వెళ్లి, వాళ్లకి నా మాటలు చెప్పు’ అన్నాడు. ‘అలాగైతే నీకోసం నల్ల రిబ్బన్ అయినా కట్టు కోనివ్వు అన్నా. మా అందరి నిరసన తెలియజేయడం కోసం’ అంది. దానికి జగన్ ‘సరే, నీ ఇష్టం’ అన్నాడు.

నేను నడిచిన 3 రోజుల పాదయాత్రలో నాకర్థం అయింది - జగన్‌కు ప్రజల మీద ఇంత ఆలోచన ఎందుకో. నిజంగా ప్రజలు చాలాచాలా కష్టాలలో వున్నారు. వర్షాలు సరిగా లేవు, కరెంటు లేదు, తాగునీటికి సైతం ప్రభుత్వం బోర్లు వేయడం లేదు. పంటలు ఎండిపోతున్నాయి. ఎరువులు, విత్తనాల రేట్లు పెరిగిపోయాయి. ఇన్సూరెన్స్ రావడానికి ఎన్నో కండిషన్స్ పెడుతున్నారు. చీనీ చెట్లకు 5 సంవత్సరాలు దాటితేనే ఇన్సూరెన్స్ అంటున్నారు. చనిక్కాయకు మాత్రమే ఇన్సూరెన్స్ ఇస్తారట. సోయా చిక్కుడుకైతే ఇన్సూరెన్స్ ఇవ్వరట. మరి ఇన్సూరెన్స్ రాకపోతే వాటిమీద పెట్టుబడి ఏట్లో వేసినట్లేనా?

ఒక పెద్దాయన, ఒక రైతు తన కష్టాలు చెబుతూ - చీనీ చెట్లను సన్నబిడ్డలను కాపాడినట్లు కాపాడుకోవాలమ్మా. అంతగా చూసుకుని, చేతికి వచ్చిన కొడుకును చంపుకున్నట్లుంది. కానీ విధిలేక చెట్లకు నీళ్లు ఇవ్వలేక నరుక్కుంటున్నాము’ అని అన్నాడు. ఇంకొక పెద్దాయనకు ‘7 ఎకరాలు వుంటే గత 3 సంవత్సరాలలో పంటల పెట్టుబడికి చేసిన అప్పులకోసం 3 ఎకరాలు అమ్మేశాను. ఇప్పుడు ఆ మిగిలిన 4 ఎకరాలు కూడా నష్టమేగానీ ఇంకేమీ లేదమ్మా’ అన్నాడు.

ఇంకొక ఆవిడ అంది - ‘భర్త చనిపోయి 3 సంవత్సరాలు అయింది. పెన్షన్ ఇవ్వడం లేదమ్మా’ అని. ఇంకొకామె అంది -‘ఆరోగ్యశ్రీ కింద వైయస్సార్ గారు వున్నప్పుడు మా అబ్బాయికి జబ్బు బాగైంది. ఇప్పుడు మళ్లీ జబ్బువచ్చి, కార్డు తీసుకెళితే - ఈ కార్డుతో పని కాదు అన్నారమ్మా’ అని. ఎంతో బాధ అనిపించింది. కానీ వాళ్లు ఇన్ని కష్టాలలో, ఇన్ని బాధలలో కూడా -‘జగన్ అన్న ఎప్పుడు వస్తాడమ్మా... అమ్మా మీరు ధైర్యంగా ఉండడమ్మా.. మేమంతా మీతో ఉన్నాం.. జగనన్నకోసం మేము ప్రార్థనలు చేస్తున్నామమ్మా, జగన్ననకోసం ఎదురు చూస్తున్నామమ్మా’ అన్నారు. ఇన్ని కష్టాలలో వీళ్లుండి కూడా మమ్మల్ని ఓదారుస్తున్నారు, ధైర్యం ఇస్తున్నారంటే వీళ్లది ఎంత గొప్ప మనసు. వీళ్లది నిజమైన మానవత్వం. ఇదీ నాగరికత అంటే... సభ్యత అంటే - అని అనిపించింది.

జనంకోసం జగన్, జగన్‌కోసం జనం - ఇది ఎవరు కూర్చారో కాని, ఎంతో దివ్యదృష్టితో రాశారు అనిపించింది. ఇది ఎంతో నిజం - కుట్రలు, కుతంత్రాలు, జైల్‌గోడలు ఈ సత్యాన్ని మార్చలేవు. దేవదేవుని ఆశీర్వాదంతో ఇవన్నీ దాటి జగన్ బయటికి వచ్చేరోజు త్వరలోనే వుంది. ఆరోజుకోసం 10 కోట్ల ఆంధ్రులతో నేను కూడా వేచి వున్నాను.

Thursday, October 18, 2012

ప్రతి ఒక్కరూ అడుగు కలపాలని చేతులు జోడించి అడుగుతున్నా...


- వైఎస్ భారతి
w/oవైఎస్ జగన్
ఒక జగన్‌ను జైలులో పెట్టాలనుకుంటే కోట్లమంది జగన్‌కోసం రోడ్లు ఎక్కుతారు. ప్రజల కోసం ప్రాణాన్ని పెట్టిన వైఎస్‌ఆర్‌ను ప్రజల గుండెల్లో నుండి చెరిపివేయడం ఎవరి తరం కాదని తెలుసుకుంటారు.

ఈ రోజుకు మూడు సంవత్సరాల 46 రోజులైంది మామగారు మన మధ్యనుంచి వెళ్లిపోయి. ఆ రోజు మొదలుకొని మా కుటుంబం ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో ఒడిదుడుకుల మధ్య నడుస్తూ ఉంది. అయ్యో ఇంటి పెద్దదిక్కును కోల్పోయిన కుటుంబం... ప్రజలకు, దేశానికి తన జీవితాన్ని అంకితం చేసిన వైఎస్‌ఆర్ కుటుంబమని ఆదరించాల్సిందిపోయి పగపట్టి, ఫ్యాక్షనిస్ట్‌లకన్నా అన్యాయంగా కక్ష్యకట్టి మమ్ముల్సి సా(వే)ధిస్తున్నారు. అది వారి నాగరికత, వారి మానవత్వం, వారి విజ్ఞత.
Related Posts Plugin for WordPress, Blogger...