Wednesday, October 31, 2012

రాష్ట్రంలో అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసిన రాజన్నను కుట్రలతో కూల్చేశారు. కుళ్ళు రాజకీయాలతో జగనన్ననూ జైలులో బంధించారు. దీంతో రాజన్నను జనం మరిచిపోతారని కొందరు ఊహలలో విహరిస్తున్నారు. మరి కొందరేమో జగన్‌తో ప్రజలకు ఉన్న బంధం మాయమైపోతుందని భావిస్తున్నారు. కాని వాస్తవం అదికాదు. ఒక్క నిరుపేదైనా కష్టం వచ్చి రాజన్న సమాధి వద్ద కన్నీళ్ళు కార్చితే చాలు నిరుపేదల కన్నీటిని తుడవడానికి రాజన్న వస్తారు.

కారణం తెలుసా... మాట తప్పని ధీరుడు రాజన్న . కాంగ్రెస్‌లో అవినీతి ఉండదని వీహెచ్ లాంటి వారు అంటున్నారు. బోఫోర్స్ , 2జీ, బొగ్గు కుంభకోణాలు ఎవరు చేశారు?... కాంగ్రెస్‌లో అవినీతి వుంటే ఉరి వేసుకుంటాన్న వీహెచ్... బొగ్గు కుంభకోణాలను చూసి ఎప్పుడు ఉరి వేసుకుంటారో ఆయనకే తెలియాలి.

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ త్యాగమయి అని, తన భర్తను చంపిన వారికి క్షమాభిక్ష పెట్టారని శంకర్‌రావు, వీహెచ్, మధుయాష్కీ, సర్వేసత్యనారాయణ లాంటి వారు అంటున్నారు. కాని సోనియాగాంధీ తన భర్తను చంపిన వారికి క్షమాభిక్ష పెట్టారని ధైర్యంగా ఒక్కరు కూడా తమిళనాడులో చెప్పగలరా? కాలం వేగంగా తిరుగుతోంది. త్వరలో జగనన్న జైలు నుంచి రావాలి... రాజన్న పాలన రావాలి. వైఎస్ కుటుంబానికి అత్మీయులు, ఆత్మలుగా చెప్పుకున్న నేటి కాంగ్రెస్ పెద్దలు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఆ కుటుంబానికి అండగా నిలబడండి.

కొండా దంపతుల్లాగ ఆదర్శంగా నిలబడండి. ఎందుకంటే రాబోయేది జగనన్న పాలన. జగన్‌కు ఏమి చెప్పి ఓట్లు అడుగుతారని కొందరి ప్రశ్న... జలయజ్ఞం, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, పావలా వడ్డీ రుణాలు, 108... ఇంత కన్నా ఏం కావాలి ఓటు అడగగానికి?

- కోనేటి వెంకటేశ్వర్లు, లెక్చరర్, అర్ధశాస్త్రం,

తిరువళ్లూరు జిల్లాలోని ప్రైవేటు కళాశాల, తమిళనాడు

కదలండి.. కదలండి...

ఓ అన్నల్లారా, ఓ అక్కల్లారా!
ఓ అయ్యల్లారా, ఓ తమ్ముల్లారా..!
కదలండి, కదలండి
కదం తొక్కి కదలండి
నడవండి, నడవండి
నడుం బిగించి నడవండి
షర్మిలమ్మకు తోడుగా,
జగనన్నకు అండగా
మన రాజన్న రాజ్యం కోసం,
మన పల్లెల స్వరాజ్యం కోసం
ఓ చిన్నారి పాపల్లారా,
ఓ చిరుచిరు నవ్వుల్లారా!
ఓ చెల్లెళ్లారా, ఓ చదువుల తల్లుల్లారా
కదలండి, కదలండి
కదం తొక్కి కదలండి
ఈ కుట్రల కుతంత్రాల నడుం విరుద్దాం
మన యాత్రల పదునేంటో చూపిద్దాం
ఓ విద్యార్థుల్లారా, ఓ వీధినపడ్డ తమ్ముల్లారా!
ఓ నిరుద్యోగుల్లారా, ఓ నిరుపేదల్లారా
కదలండి, కదలండి
కదం తొక్కి కదలండి
ఈ ప్రభుత్వం నిద్ర లేచే దాకా!
ఆ జైలు గేటులు తెరిచే దాకా
షర్మిలమ్మకు తోడుగా
జగనన్నకు అండగా!

- బివియస్ రామకృష్ణ, ప్రైవేట్ టీచర్, హౌసింగ్ బోర్డు కాలనీ, అనంతపురం

అబద్ధాల చంద్రబాబు

* షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ 
* బుధవారం యాత్ర ముగిసేనాటికి.. రోజులు: 14, కిలోమీటర్లు: 188.30
* బాబు హయాంలో గ్యాస్ ధర పెరగలేదట! 
* ఫీజుల పథకం, ఆరోగ్యశ్రీ ఆయన ఆలోచనలేనట!
* ఈ ప్రభుత్వం అన్ని విధాలుగా విఫలమైంది
* దాన్ని నిలదీయాల్సిన చంద్రబాబు.. సర్కారుతోనే కుమ్మక్కయ్యారు
* 14వ రోజు వర్షంలోనూ ఆగని షర్మిల.. 3 కి.మీ. మేర తడుస్తూనే యాత్ర 

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘న్యూస్‌లైన్’ ప్రత్యేక ప్రతినిధి: అధికార కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన పాదయాత్రలో అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చెల్లెలు షర్మిల విమర్శించారు. ‘‘ప్రజలకు మేలు చేయడంలో, వారి సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం అన్ని విధాలుగా ఘోరంగా విఫలమైంది. తాగునీరు, సాగునీరు, కరెంటు ఇవ్వడంలోనూ, ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించడంలోనూ, నిరుపేదల ఆరోగ్యం పరిరక్షించడంలోనూ విఫలమైంది. నిలదీయాల్సిన ప్రధాన ప్రతిపక్షం టీడీపీ.. ఆ సర్కారుకే కొమ్ముకాస్తోంది. ఇది చాలదన్నట్లు ఇప్పుడు చంద్రబాబు పాదయాత్రలో కొత్తగా అబద్ధాలు వల్లె వేస్తున్నారు. 
తన హయాంలో గ్యాస్ ధర పెరగలేదట. ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ తన ఆలోచనేనట. నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడుతున్నారాయన’’ అని షర్మిల మండిపడ్డారు. ‘‘కాంగ్రెస్, టీడీపీ కలిసి నీచమైన కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతున్నాయి. ఇంతటి అన్యాయం, ఘోరం, నీచమైన రాజకీయాలు మరెక్కడా లేనేలేవు. ఇంతటి కుట్రలు, కుతంత్రాలు ఇంతకుముందెన్నడూ లేవు. వారంతా పెద్ద మనుషులే. కానీ చిన్న మనసులు..’’ అని విమర్శించారు. ‘మరో ప్రజా ప్రస్థానం’ పాదయాత్ర 14వ రోజు బుధవారం అనంతపురం జిల్లా కూడేరులో జరిగిన భారీ బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజా సమస్యలు పట్టని ప్రభుత్వ వైఖరికి, దానితోనే కుమ్మక్కయిన టీడీపీ వైఖరికి నిరసనగా వైఎస్ జగన్ తరఫున ఈ యాత్ర చేపట్టిన షర్మిల బుధవారం వర్షంలోనూ ఆగకుండా పాదయాత్ర చేశారు.

పెట్టుబడి రూ. 50 వేలు.. పంట రూ. 5 వేలు: ఉదయం 10.30కు కమ్మూరు క్రాస్‌రోడ్డు నుంచి బయలుదేరిన షర్మిల అరవకూరు సమీపంలో ఎండిపోయిన ఓ వేరుశనగ పంటను పరిశీలించారు. అరవకూరుకు చెందిన నారాయణ అనే ఆ రైతు తాను ఐదెకరాల్లో రూ. 50 వేల పెట్టుబడితో వేరుశనగ పంట వేయగా.. చెట్టుకు ఒకటో రెండో కాయలు మాత్రమే కాశాయని, ఇప్పటికే ఆకు ఎండి రాలిపోతోందని వాపోయారు. పంటకు మొత్తం రూ. 5 వేలకు మించి వచ్చే పరిస్థితి లేదని, చేను తెంపేందుకే ఇవి సరిపోవని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ పంట ద్వారా రూ. 45 వేలు నష్టపోయినట్టేనని కన్నీటి పర్యంతమయ్యారు.

నష్టపరిహారం కూడా వచ్చే అవకాశం లేదని తోటి రైతులు అంటున్నారని, వాతావరణ బీమా అంటూ ఎంత ప్రీమియం కడితే అంతే పరిహారం వస్తుందని చెబుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. దీనికి షర్మిల స్పందిస్తూ ‘చంద్రబాబు ప్రభుత్వంలోనూ ఇదే జరిగింది. ఆయన మైండ్‌సెట్‌లోకే ప్రజలు రావాలన్నారుగానీ ఆయన మాత్రం ప్రజల అవసరాలను గుర్తించలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా పరిహారం చెల్లించే ఉద్దేశం లేకనే ఇలా నడచుకుంటోంది. రాజన్న ఉన్నప్పుడు గ్రామం యూనిట్‌గా దాదాపు 95 శాతం వరకు పరిహారం ఇచ్చారు.. పెన్నా రిజర్వాయర్‌కు నీళ్లు తెచ్చి చెరువులు నింపి తద్వారా గ్రామాలకు సాగునీటి కొరతను తీర్చారు..’ అని గుర్తుచేశారు. ఉదయం 11.30కు అరవకూరు చేరుకోగానే మహిళలు షర్మిలకు స్వాగతం పలికి అక్కడే కూర్చుని తమ సమస్యలు విన్నవించారు.

రూ. 20 వేల కరెంటు బిల్లు:
కూడేరు సమీపంలో గాంగ్యా నాయక్ అనే రైతుకు చెందిన చీనీ తోటను పరిశీలించిన షర్మిలతో ఆ రైతు మాట్లాడుతూ.. ఉచిత విద్యుత్తు అంటూనే రూ. 20 వేల కరెంటు బిల్లు కట్టాలని తనను వేధిస్తున్నారని, బుధవారం ఉద యం కూడా అధికారులు తన దగ్గరికి వచ్చారని వివరించారు. చీనీ(బత్తాయి)కి ధర లేదని, గిట్టుబాటు కావడం లేదని వాపోయారు. ‘సర్‌చార్జీలు వేసి ఉండొచ్చు. 

ఈ ప్రభుత్వం రైతులను దెబ్బతీసే చర్యలే తప్ప వారికి ప్రయోజనం కలిగించే చర్యలు చేపట్టడం లేదు. జగనన్న రాగానే పంటల గిట్టుబాటుకు రూ. 3 వేల కోట్ల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తారు’ అని షర్మిల భరోసా ఇచ్చి ముందుకు కదిలారు. సాయంత్రం 5.10కి పాదయాత్ర కూడేరుకు చేరుకునే సరికి అక్కడ బహిరంగ సభకు భారీగా జనం తరలివచ్చారు. 

కిక్కిరిసిపోయిన జనం మధ్య షర్మిల మాట్లాడుతూ అధికార, ప్రతిపక్షాల తీరును దునుమాడారు. బుధవారం నాటి పాదయాత్రలో ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శోభానాగిరెడ్డి, గురునాథరెడ్డి, కాపు రాంచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ నారాయణరెడ్డి, మాజీ శాసన సభ్యుడు ప్రసాదరాజు, పార్టీ సీజీసీ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, పార్టీ నేతలు వాసిరెడ్డి పద్మ, కొల్లి నిర్మలాకుమారి, కాపు భారతి తదితరులు పాల్గొన్నారు.

బుధవారం యాత్ర 12 కిలోమీటర్ల మేర సాగింది. తుపాను నేపథ్యంలో ఉదయం పూట తుంపర్లతో చిరుజల్లులు కురవగా.. సాయంత్రం 6 నుంచి రాత్రి 7 గంటల వరకు ఈదురుగాలులతో కూడిన ఒక మోస్తరు వర్షం కురిసింది. వర్షంలోనే షర్మిల 3 కిలోమీటర్ల వరకు పాదయాత్ర కొనసాగించి.. రాత్రి 7 గంటలకు ముద్దలాపురం సమీపంలో రోడ్డు పక్కన టెంట్‌లోనే బసచేశారు. బుధవారం నాటికి పాదయాత్ర మొత్తం 188.3 కిలోమీటర్లు పూర్తిచేసుకుంది.

వాళ్లు ఊహించేది జరగదు...

రాష్ట్రంలో అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసిన రాజన్నను కుట్రలతో కూల్చేశారు. కుళ్ళు రాజకీయాలతో జగనన్ననూ జైలులో బంధించారు. దీంతో రాజన్నను జనం మరిచిపోతారని కొందరు ఊహలలో విహరిస్తున్నారు. మరి కొందరేమో జగన్‌తో ప్రజలకు ఉన్న బంధం మాయమైపోతుందని భావిస్తున్నారు. కాని వాస్తవం అదికాదు. ఒక్క నిరుపేదైనా కష్టం వచ్చి రాజన్న సమాధి వద్ద కన్నీళ్ళు కార్చితే చాలు నిరుపేదల కన్నీటిని తుడవడానికి రాజన్న వస్తారు. 

కారణం తెలుసా... మాట తప్పని ధీరుడు రాజన్న . కాంగ్రెస్‌లో అవినీతి ఉండదని వీహెచ్ లాంటి వారు అంటున్నారు. బోఫోర్స్ , 2జీ, బొగ్గు కుంభకోణాలు ఎవరు చేశారు?... కాంగ్రెస్‌లో అవినీతి వుంటే ఉరి వేసుకుంటాన్న వీహెచ్... బొగ్గు కుంభకోణాలను చూసి ఎప్పుడు ఉరి వేసుకుంటారో ఆయనకే తెలియాలి.

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ త్యాగమయి అని, తన భర్తను చంపిన వారికి క్షమాభిక్ష పెట్టారని శంకర్‌రావు, వీహెచ్, మధుయాష్కీ, సర్వేసత్యనారాయణ లాంటి వారు అంటున్నారు. కాని సోనియాగాంధీ తన భర్తను చంపిన వారికి క్షమాభిక్ష పెట్టారని ధైర్యంగా ఒక్కరు కూడా తమిళనాడులో చెప్పగలరా? కాలం వేగంగా తిరుగుతోంది. త్వరలో జగనన్న జైలు నుంచి రావాలి... రాజన్న పాలన రావాలి. వైఎస్ కుటుంబానికి అత్మీయులు, ఆత్మలుగా చెప్పుకున్న నేటి కాంగ్రెస్ పెద్దలు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఆ కుటుంబానికి అండగా నిలబడండి. 

కొండా దంపతుల్లాగ ఆదర్శంగా నిలబడండి. ఎందుకంటే రాబోయేది జగనన్న పాలన. జగన్‌కు ఏమి చెప్పి ఓట్లు అడుగుతారని కొందరి ప్రశ్న... జలయజ్ఞం, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, పావలా వడ్డీ రుణాలు, 108... ఇంత కన్నా ఏం కావాలి ఓటు అడగగానికి?
- కోనేటి వెంకటేశ్వర్లు, లెక్చరర్, అర్ధశాస్త్రం, 
తిరువళ్లూరు జిల్లాలోని ప్రైవేటు కళాశాల, తమిళనాడు

ఏదీ అభయహస్తం?

మరో ప్రజాప్రస్థానం’లో షర్మిలకు జనం మొర షర్మిల 
కాంగ్రెస్సోళ్లు వడ్డీ లేని రుణాలన్నారు..రెండు రూపాయల వడ్డీ గుంజుతున్నారు
బాబు ఆనాడు రూ. 15 వేల లోనిచ్చాడు..
అధికారులు పుస్తెలమ్మి కట్టేవరకు వెంటపడ్డారు
వీళ్లు ఇప్పుడిచ్చే హామీలు నమ్మలేం
వైఎస్ వెళ్లిపోయాక మా గోడు వినే నాథుడే లేకుండాపోయాడు
‘మరో ప్రజాప్రస్థానం’మంగళవారం యాత్ర ముగిసేనాటికి..రోజులు: 13, కిలోమీటర్లు: 176.30

 ‘‘చంద్రబాబు నాయుడు ఊళ్ల మీద పడ్డాడు ఎందుకు? ఆయన ఉన్నప్పుడు నాకు చేనేత సొసైటీ ద్వారా రూ. 15 వేలు అప్పు ఇచ్చారు. కట్టలేకపోతే మా ఇంటికొచ్చి వేరుశనగ మూటలన్నీ బయటపడేశారు. అవి అమ్మినా అప్పు తీరని పరిస్థితి. చేసేది లేక పుస్తెలమ్మి ఆ అప్పు కట్టాను. ఇప్పుడు ఆయనే వడ్డీ మాఫీ, రుణాల మాఫీ అంటున్నాడు. నాడు ఆయనను గెలిపిస్తే ఒక్క సాయమూ చేయలేదు. ఇప్పుడు ఆయన మాటలు నమ్మలేం. రాజశేఖరరెడ్డి హయాంలో మాకు లోన్లు మాఫీ అయితే కాలేదు గానీ ఒకసారి రూ. 18 వేలు ఇన్సూరెన్స్ వచ్చింది’’
- చంద్రబాబుపై లక్ష్మి అనే మహిళ మండిపాటు

‘మేమందరం చేనేత కార్మికులమే. రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు కొంతమంది పెన్షన్ల కోసం పేర్లు నమోదు చేసుకున్నారు. ఆయన వెళ్లిపోయాక అభయహస్తం అన్న మాటే మరిచిపోయారు. అప్పుడు నమోదు చేసుకున్న పేర్లు కూడా ఇప్పుడు తీసేస్తున్నారు. ఇల్లు ఇస్తే పెన్షన్ ఇవ్వరట. మాకు 60 ఏళ్లు దాటాక పెన్షన్ వచ్చేలా రాజశేఖరరెడ్డి ఒక అవకాశం కల్పిస్తే ఈ ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది..’ 
- మరో మహిళ ఆవేదన

..ఇవీ అధికార, ప్రతిపక్షాలపై పేదింటిఆడపడుచుల అభిప్రాయాలు. మంగళవారం అనంతపురం నగర శివార్లలోని సిండికేట్‌నగర్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ నాయకురాలు షర్మిల పాదయాత్ర సందర్భంగా మహిళా సంఘాలన్నీ ఒక్క చోట చేరి ఆమెకు స్వాగతం పలికి తమ సమస్యలు ఏకరువు పెట్టాయి. పై అభిప్రాయాలన్నీ ఆ సందర్భంగా వారు చెప్పినవే. తమకు పెద్ద దిక్కులాంటి మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చనిపోయాక, తమను పట్టించుకునే నాథుడే కరువయ్యాడని మహిళలంతా ఆవేదన వ్యక్తంచేశారు. ‘మగ్గాలు గిట్టుబాటు కాక రెండు నెలలుగా ఖాళీగా ఉన్నాం. కనీసం పిల్లలను బడికి పంపేటప్పుడు రూ. 2 ఇచ్చే స్తోమత కూడా లేదు.. మిద్దెలు, కార్లు ఉన్నోళ్లనే ఈప్రభుత్వం పట్టించుకుంటోంది..’ అని మరో మహిళ కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రజా సమస్యలు పట్టని ప్రభుత్వ వైఖరికి, ఆ సర్కారును అవిశ్వాసంతో కూలదోయకుండా దానితోనే కుమ్మక్కైన టీడీపీ రాజకీయాలకు నిరసనగా చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ 13వ రోజు మంగళవారం షర్మిలకు సిండికేట్‌నగర్‌తోపాటు అడుగడుగునా ప్రజలిలా తమ గోడు వెళ్లబుచ్చుకున్నారు.

2 రూపాయల వడ్డీ కడుతున్నాం..

సాయంత్రం బ్రాహ్మణపల్లి క్రాస్‌రోడ్డులో కూడా మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై షర్మిలకు స్వాగతం పలికి తమ కష్టనష్టాలను వివరించారు. ‘రెండేళ్లుగా తాగునీరు లేదు. కరెంటు రెండు మూడు గంటలు కూడా రావడం లేదు. పంటలు లేవు. పావలా వడ్డీ అంటారు.. కానీ రెండు రూపాయల వడ్డీ కట్టించుకుంటున్నారు. ఇదేమని అడిగితే పావలా వడ్డీ అని ఎవరు చెప్పారమ్మా అని ఒకరంటారు. వెనక్కి వ స్తుందిలే అని ఇంకొకరంటారు. పావలా వడ్డీ అమల్లో లేదని ఇంకొకరంటారు’ అని ఆవేదన వ్యక్తంచేశారు.

ఉరవకొండలోకి యాత్ర..

అనంతపురం నగరశివారులో కళ్యాణదుర్గం బైపాస్‌రోడ్డులో యాత్ర ప్రారంభమవగా.. శివారు కాలనీల ప్రజలు భారీ సంఖ్యలో షర్మిల వెంట కదం కలిపారు. కేకే కాలనీ, సిండికేట్‌నగర్‌లో భారీసంఖ్యలో మహిళలు తరలివచ్చి ఘనస్వాగతం పలికారు. మధ్యాహ్నం ఒంటి గంటకు రాచానపల్లి సమీపంలో భోజన విరామానికి ఆమె ఆగారు. తిరిగి నాలుగు గంటలకు పాదయాత్ర ప్రారంభమవగా స్థానికులు షర్మిలకు పలు వినతిపత్రాలు అందజేశారు. లెప్రసీకాలనీ వద్ద ఉరవకొండ నియోజకవర్గంలోకి యాత్ర ప్రవేశించింది. రాత్రి 7.15కు కమ్మూరు క్రాస్‌రోడ్డుకు చేరుకున్న షర్మిల అక్కడ బస చేశారు. షర్మిల మంగళవారం మొత్తం 12.9 కిలోమీటర్లు నడిచారు. 

మహిళలంటే చిన్నచూపు: షర్మిల

సిండికేట్‌నగర్‌లో, బ్రాహ్మణపల్లిలో మహిళల సమస్యలు షర్మిల విని మాట్లాడుతూ.. ‘ఈ ప్రభుత్వానికి మహిళలంటే చిన్నచూపు. రాజన్న ఉన్నప్పుడు సాగుకు ఉచితంగా 7 గంటల కరెంటు ఇస్తే.. వీళ్లు రెండు మూడు గంటలు కరెంటు ఇచ్చేందుకు ఆపసోపాలు పడుతున్నారు. రాజన్న ఉన్నప్పుడు గ్యాస్‌పై రూ.305 కంటే ఒక్క పైసా పెంచలేదు. ఇప్పుడు నెలకో సిలిండర్ వాడేవాళ్ల పరిస్థితి ఘోరం. సగటున రూ. 950 వెచ్చించాల్సిన పరిస్థితి. వడ్డీలేని రుణాలని చెబుతూనే రూ. 2 వడ్డీ వసూలు చేస్తున్నారట. పక్క గ్రామాల్లో కూడా మహిళలు ఈ విషయం చెప్పారు. రాజన్న ప్రతీ పథకం పూర్తిగా, అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా శ్రద్ధ తీసుకున్నాడు’’ అని అన్నారు.

Monday, October 29, 2012

ఎందుకు అడుగుతారు నన్ను జగన్ అంటే నీకు ఇష్టం అని?

తండ్రి దుర్మరణంతో పుట్టెడు దుఃఖంలో ఉన్నప్పటికీ తండ్రిని ప్రేమించి ప్రాణమిచ్చే ప్రజల కన్నీటిని తుడవడానికి, దుఃఖాన్ని తనలో దిగమింగుకుని లాల్‌బహదూర్ స్టేడియంలో ప్రజలకు అభివాదం చేస్తూ తరలివెళ్లిపోతున్న జగన్‌లో నాడే ఒక నాయకుడు కనబడలేదా? 

తండ్రి చనిపోయిన వారంలోనే తన తండ్రితోపాటు చనిపోయిన వ్యక్తుల కుటుంబ సభ్యులను పలకరించిన జగన్‌లో ఒక కుటుంబ పెద్ద కనపడలేదా?

తన తండ్రి మరణవార్త విని చనిపోయిన వందలమందిని నేను స్వయంగా కలుస్తాను అని చెప్పి, వద్దని వారించినా సోనియాను ఎదిరించిన నాడు జగన్‌లో తనవారికోసం తెగించి పోరాడే వీరుడు కనపడలేదా? తన తల్లితోపాటు సోనియాను కలిసి, తాము ఎందుకు ఓదార్పుయాత్ర చేస్తున్నామో చెపుతుంటే, తన తల్లి ఏడుస్తూ అభ్యర్థిస్తుంటే, చీత్కారంగా చూసిన దేశ అత్యున్నత మహారాణి సోనియాపై తిరగబడాలని నిర్ణయించుకున్నప్పుడు నా తెలుగు గడ్డ రాయలసీమ పౌరుషం కనపడలేదా?

ఇంకా ఎందుకు అడుగుతారు నువ్వెందుకు జగన్‌ని పిచ్చిగా ప్రేమిస్తావని? రెండున్నరేళ్లు రాత్రీ, పగలూ కాలికి చక్రాలు ఉన్నట్టు ఆంధ్రదేశాన్ని చుట్టి, ప్రతి గాయపడ్డ గుండెకూ ధైర్యం చెప్పిన జగన్‌లో మీకు మనసున్న మారాజు కనపడలేదా? ప్రతి పేదవాడి చెవికీ జగన్ అనే మాట వినపడగానే గుండెలో భావోద్రేకం, కళ్లలో మెరుపు పెల్లుబుకుతుంటే తెలియడం లేదా? నేనెందుకు జగన్‌ని శ్వాసిస్తూ ఉన్నానో?

ఇంకా అడుగుతారా నేనెందుకు జగన్‌ని ఇష్ట పడుతున్నానో..? కులాల కట్టుబాట్లు చీల్చుకుని, గుండెలో పేరుకుపోయిన ద్వేషాన్ని కడిగేసుకుని ముందుకు చూడు, స్వచ్ఛమైన పేదవాడి కళ్లలో చూడు జగన్ అంటే అతనికి ఎందుకు ఇష్టమో? అప్పుడు అర్థమవుతుంది నేను ఎందుకు జగన్‌ని ఇష్టపడుతున్నానో!!!

- గోపాల్ గోరంట్ల, సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్,
మోఫస్ట్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్

జగన్ అంకుల్ జయిస్తాడు

దేవుడి మీద మాకు కోపం వస్తోంది. ఎందుకంటే దేవుడు మా దేవుడు లాంటి వైయస్‌తాతని తీసుకెళ్లాడు కదా! జనంలో నడిచి, జనం కష్టాలు తెలుసుకుని, జనం కోసమే పరిపాలించాడు వైయస్ తాత. దేవుడికేమో జెలసీ వేసింది, తాతకు తనకన్నా పేరొస్తుందని. అందుకేనా తీసుకెళ్లాడు? మాకైతే ఏడుపొచ్చేసింది. మా ఇంట్లో, మా ఊర్లో అందరూ ఏడ్చారు.

పాపం కొంతమందికి గుండె ఆగిపోయింది. ఎవరూ బాధపడొద్దు, నేనొస్తానని జగనంకుల్ బయలుదేరారు. ఎందరినో ఓదార్చారు. ముసలవ్వలు పెట్టిన పెరుగన్నం ముద్దలు ఇష్టంగా తిన్నారు. మమ్మల్ని కలవడానికి ఎండలో బాగా తిరిగి జగనంకుల్ బాగా చిక్కిపోయారు. షేక్‌హ్యాండ్‌లు అందరికీ ఇవ్వడంతో చేతులపై గీతలు కూడా పడ్డాయి. వాళ్ళెవరో ఢిల్లీలో ఉంటారంట. వాళ్ళకేమో జనంలోకి జగనంకుల్ వెళితే మంచి పేరొస్తుందని భయం వేసిందంట! అరెస్టు చేశారంట! జగనంకుల్‌ని బయటకు రాకుండా, బెయిల్ రాకుండా చేస్తున్నారు. 

మాకు, మా ఫ్రెండ్స్‌కి, మా పెద్దోళ్లకి, పేదోళ్లకి అందరికీ జగనంకుల్ బయటకు రావాలనుంది. దేవుడికి ప్రార్థన చేస్తున్నాం. దేవుడంకుల్! దేవుడంకుల్! జగనంకుల్‌కి బెయిలొస్తే మా రాష్ట్రం బాగుపడుతుంది. మా రాష్ట్రం బాధలు తప్పించడానికైనా అంకుల్‌ని మాలోకి రప్పించు. 

విజయమ్మమ్మని, భారతి ఆంటీని, షర్మిలక్కని అందరినీ మేం ప్రేమిస్తాం. వారొచ్చినా మేం వారితోపాటు ఉంటాం. వైయస్ తాత ఫ్యామిలీ అంటే మాకు అంత ఇష్టం. వాళ్లందరూ కలిసి సుఖంగా ఉండాలని, మా ఆంధ్రప్రదేశ్‌ని సుఖంగా ఉంచాలని మా ఆశ. తీరుస్తావు కదూ దేవుడంకుల్!

- ముక్కా హరికృష్ణ, 7వ తరగతి, పెనుగంచిప్రోలు,
- తుమ్మలపల్లి దివ్యాచౌదరి, 6వ తరగతి, కోదాడ
- తుమ్మలపల్లి దినేష్, 8వ తరగతి, కోదాడ

సొంతింటికి వచ్చినట్టుంది


అనంతలో టీడీపీకి షాక్: భారీగా వైస్సార్సీపీలోకి నేతలు

‘ఇన్నాళ్లూ అద్దె ఇంట్లో ఉన్న తాను ఇప్పుడు సొంత ఇంటికి వచ్చినంత ఆనందంగా ఉంది’అని అనంతపురంలో సోమవారం షర్మిల సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరిన టీడీపీ నాయకుడు తరిమెల శరత్‌చంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ రైతు విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, శింగనమల మండలం మాజీ జెడ్పీటీసీ సభ్యుడిగా పని చేసిన తరిమెల. తో పాటు మాజీ జెడ్పీటీసీ సభ్యుడు రామకృష్ణ తదితరులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. షర్మిల చేపట్టిన ‘మరో ప్రజా ప్రస్థానం’ పాదయాత్ర సందర్భంగా వైఎస్సార్ సర్కిల్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వారికి పార్టీ జిల్లా కన్వీనర్ శంకరనారాయణ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. 

ఈ సందర్భంగా తరిమెల మాట్లాడుతూ మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించే సత్తా కేవలం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి మాత్రమే ఉందని ప్రగాఢంగా విశ్వసిస్తున్నామన్నారు. ఇదే సభలో పుట్టపర్తి నియోజకవర్గం నాయకుడు డాక్టర్ సి.సోమశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో కొత్తచెరువు మండలానికి చెందిన ఇద్దరు టీడీపీ మాజీ ఎంపీటీసీ సభ్యులు, మరో ఇద్దరు కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచులు, పలువురు కాంగ్రెస్, టీడీపీ కార్యకర్తలు, నగరానికి చెందిన టీడీపీ జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు పి.నూర్‌జాన్, మరికొందరు కార్యకర్తలు పార్టీలో చేరారు. ఈ సభలో నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, అనంతపురం ఎమ్మెల్యే గురునాథరెడ్డి, రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

షర్మిల వెంట ‘అనంత’ జనవాహిని

12వ రోజు పాదయాత్రలో భాగంగా షర్మిల అనంతపురం ఎస్కేయూ నుంచి సోమవారం ఉదయం పది గంటలకు పాదయాత్రకు బయలుదేరారు. ఉదయం నుంచే అనంతపురం ప్రజలు పెద్ద ఎత్తున ఆమె వెన్నంటి ఉన్నారు. వేలాది మంది ఆమెతో కదం కలిపారు. వీధులన్నీ పోటెత్తగా షర్మిల ముందుకు సాగారు. మార్గమధ్యలో చియ్యేడుకు చెందిన రైతులు తాము కూలీలుగా మారిన పరిస్థితిని ఆమె దృష్టికి తెచ్చారు. నీరు లేక, కరెంటు లేక, పంటలు పండక, నష్టపరిహారం రాక ఈ దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తంచేశారు. అనంతరం 11.20కి విన్సెంట్ పాఠశాలలో పిల్లలకు అభివాదం తెలిపి పాదయాత్ర కొనసాగించారు. తర్వాత ఇటుక బట్టీ కార్మికులతో మాట్లాడారు. షర్మిల ఇటుక మూసలో మట్టి పోసి రెండు మూడు ఇటుకలు తయారు చేశారు. మధ్యాహ్నం 12.15కు ఆర్డీటీ ఆసుపత్రి సమీపంలో భోజన విరామానికి ఆగారు. తిరిగి 3.30కు పాదయాత్రకు బయలుదేరారు. 4.45కు వాల్మీకి విగ్రహానికి హారతి ఇచ్చి, అక్కడ్నుంచి బహిరంగ సభ ప్రాంతమైన సప్తగిరి సెంటర్‌కు సాయంత్రం 5.15కు చేరుకున్నారు. అనంతపురం నగరమంతా అక్కడికి తరలిరావడంతో మెయిన్ రోడ్డు అంతా ట్రాఫిక్ జామైంది. యువతీయువకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మైనారిటీ సోదరులు బంతిపూల తివాచీ పరిచి స్వాగతం పలికారు. రాత్రి 7.35 గంటలకు కల్యాణదుర్గం బైపాస్ రోడ్డులో రాత్రి బసకు చేరుకున్నారు. పాదయాత్రలో ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, పార్టీ ఎమ్మెల్యేలు గురునాథరెడ్డి, కాపు రాంచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ డి.నారాయణరెడ్డి పాల్గొన్నారు.

జగనన్నతోనే రైతన్న రాజ్యం

కోటి ఎకరాలకు నీరివ్వాలన్న వైఎస్ కలను సాకారం చేస్తాడు
వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ఉంటుంది
రైతన్న గిట్టుబాటు ధరకోసం రూ. 3 వేల కోట్లతో స్థిరీకరణ నిధి
రాజన్నకు, జగనన్నకు ఉన్నది.. చంద్రబాబుకు లేనిది విశ్వసనీయత
చంద్రబాబుకు ప్రభుత్వాన్ని దించే శక్తి ఉన్నా.. ఎందుకు అవిశ్వాసం పెట్టడం లేదు?
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ సోమవారం యాత్ర ముగిసేనాటికి..రోజులు: 12, కిలోమీటర్లు: 163.4

 ‘‘ఒకరోజు వస్తుంది. ఎలాగైతే ఉదయించే సూర్యుడిని ఆపలేమో జగనన్నను కూడా ఆపలేరు. ఆరోజు జగనన్న బయటకు వస్తాడు. మనందరినీ రాజన్న రాజ్యం దిశగా తీసుకెళతాడు. రైతన్న రాజ్యం స్థాపిస్తాడు..’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెల్లెలు షర్మిల ఉద్ఘాటించారు. కోటి ఎకరాలకు నీరివ్వాలన్న దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలను జగనన్న సాకారం చేస్తాడని చెప్పారు. వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ పెట్టి, రైతన్న గిట్టుబాటు ధరకే తమ ఉత్పత్తులను అమ్ముకోవడానికి వీలుగా రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తాడని పేర్కొన్నారు. రైతులకు, మహిళలకు వడ్డీలేని రుణాలను అందిస్తాడని అన్నారు. 

మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా 12వ రోజు సోమవారం అనంతపురంలోని సప్తగిరి సర్కిల్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. ‘‘జగనన్న అధికారంలోకి వస్తే పెద్ద చదువులకు ఇక ఆటంకం ఉండదు. ప్రతి మహిళా తన పిల్లలను బడికి పంపేందుకు వీలుగా ‘అమ్మ ఒడి’ ద్వారా తల్లి బ్యాంకు ఖాతాలో పదో తరగతి వరకు రూ.500, ఇంటరైతే రూ.700, డిగ్రీ అయితే రూ.1,000 వేస్తాడు. వృద్ధులకు, వితంతువులకు రూ.700, వికలాంగులకు రూ.1,000 పింఛన్ ఇస్తాడు. రాజన్న చెప్పినవీ చేశాడూ.. చెప్పనివీ చేశాడు. జగనన్న కూడా మాట మీద నిలబడే మనిషి. చెప్పినవే కాకుండా ప్రజల అవసరాలను గమనించి అన్నీ సమకూరుస్తాడు. మైనారిటీలకు వీలైనంత ప్రయోజనం కల్పించాలన్నదే వైఎస్ లక్ష్యం. అదే లక్ష్యంతో జగనన్న పనిచేస్తాడు..’’ అని చెప్పారు.

చంద్రబాబుకు లేనిది.. విశ్వసనీయత!

రాజన్న, జగనన్నలకు ఉన్నది.. టీడీపీ అధినేత చంద్రబాబుకు లేనిది విశ్వసనీయత, మాటమీద నిలబడే నైజం అని షర్మిల అన్నారు. ‘‘చంద్రబాబుకు అసలు పాదయాత్ర చేయాల్సిన అవసరమే లేదు. ఈ అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దించే శక్తి టీడీపీకి ఉంది. వైఎస్సార్‌సీపీ కూడా మద్దతు ఇస్తామంటున్నా చంద్రబాబు అవిశ్వాసం పెట్టరట. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా ప్రభుత్వం, ప్రధాన ప్రతిపక్షం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కుమ్మక్కయ్యాయి. సీబీఐని వాడుకుని విచారణ పేరుతో జగనన్నను బందీని చేశారు. వారి లక్ష్యం ఒక్కటే. జగనన్న బయటే ఉంటే ప్రతి సమస్యకూ స్పందిస్తాడు. రేయనక పగలనక మీ మధ్య ఉంటాడు. మీ ప్రేమ, ఆప్యాయతలు పొందుతాడు. కాంగ్రెస్, టీడీపీలకు మనుగడ ఉండదు. ఇలాగైతే తమ దుకాణాలు మూసుకోవాల్సి వస్తుందని వారు జగనన్నను దోషిగా చిత్రీకరించారు. జైల్లో పెట్టారు. కానీ దేవుడున్నాడు. దేవుడున్నాడన్నది ఎంత నిజమో మంచివారి పక్షాన నిలబడతాడన్నదీ అంతే నిజం. అధర్మానికి ఆయుష్షు తక్కువ’’ అన్నారు.

సొమ్మొకరిది.. సోకొకరిది అన్నట్టుగా ఉంది..

‘‘కరువు జిల్లా అని అనంతపురంపై ప్రత్యేక శ్రద్ధతో రాజన్న హంద్రీనీవా సుజల స్రవంతి పథకాన్ని 4 వేల కోట్ల రూపాయలతో చేపట్టి 95% పనులు పూర్తిచేస్తే.. ఈ మూడేళ్లలో ఈ ప్రభుత్వం 5% కూడా పూర్తిచేయలేకపోయింది. ఇంకో రూ.45 కోట్లు వెచ్చిస్తే మొదటి విడత పనులు పూర్తవుతాయి. ఈ పనుల కోసం మంత్రి రఘువీరారెడ్డి పాదయాత్ర చేసి పూర్తి చేస్తారట. సొమ్మొకరిది.. సోకొకరిది అన్న చందంగా ఉంది ఆయన కథ. పోనీలెండి. ఆ పనులైనా పూర్తిచేస్తే సంతోషమే..’’ అని షర్మిల విమర్శించారు.

కేంద్రంలో వైఎస్సార్‌సీపీ అతిపెద్ద మూడో పార్టీ: మేకపాటి

బహిరంగ సభలో లోక్‌సభ సభ్యుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ కారణజన్ముడని పేర్కొన్నారు. ఢిల్లీ పెద్దలు రుద్దే నేతలు మనల్ని పాలించడం సరికాదన్నారు. డిసెంబర్‌లోగా జగన్ బయటికి వస్తాడని ఆశాభావం వ్యక్తంచేశారు. ఎప్పుడు ఎన్నికలొచ్చినా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని, ఢిల్లీలో కూడా కాంగ్రెస్, బీజేపీల తరువాత 35 ఎంపీ స్థానాలతో అతి పెద్ద పార్టీ వైఎస్సార్‌సీపీ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. సప్తగిరి సర్కిల్‌లో జరిగిన సభలో తెలుగుదేశం అనుబంధ తెలుగు రైతు రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డికి సమీప బంధువు తరిమెల శరత్‌చంద్రారెడ్డి షర్మిల సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరారు.
Related Posts Plugin for WordPress, Blogger...