కడప : షర్మిల రెండో రోజు పాదయాత్ర అప్రతిహతంగా కొనసాగుతోంది. తాళ్లపల్లిలో మధ్యహ్నం భోజనం చేసిన షర్మిల.. రాజీవ్ నగర్ కాలనీ, నందిపల్లె, తాళ్లపల్లె మీదుగా దుగ్గన్నగారిపల్లెకు మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర చేరుకుంది. అనంతరం.. అమ్మయ్యగారి పల్లె, చాగలేరు క్రాస్, వి.కొత్తపల్లి క్రాస్, గొందెపల్లె క్రాస్, వేముల, భూమయ్యగారి పల్లెలో పాదయాత్ర సాగనుంది. భూమయ్యగారి పల్లెలో షర్మిల రాత్రికి బస చేయనున్నారు.
ఈరోజు ఉదయం షర్మల రాజీవనగర్ కాలనీ నుంచి పాదయాత్రగా బయల్దేరారు. వేంపల్లి మైనార్టీ గురుకుల విద్యార్థులు షర్మిలకు తమ గోడును వెళ్లబుచ్చుకున్నారు. అమ్మయ్యగారిపల్లె మహిళలు కూడా తమ సమస్యలను ఆమె దృష్టికి తీసుకెళ్లారు. పరిస్థితులు చూస్తే పురుగుమంది తాగి చావాలని ఉందన్న మహిళలకు ఆమె ధైర్యం చెప్పారు. తాళ్లపల్లెలో వేరు శెనగపంటను షర్మిల పరిశీలించారు.
వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలో ఉన్నా, లేకున్నా ఎల్లప్పుడూ రైతుల మేలు కోసమే ఆలోచించేవారని ఆయన కుమార్తె షర్మిల అన్నారు. రెండోరోజు పాదయాత్రలో భాగంగా ఆమె శుక్రవారమిక్కడ మాట్లాడుతూ ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవటం వల్లే రాష్ట్రానికి విద్యుత్ సమస్య పట్టి పీడిస్తుందన్నారు.
పల్లెల్లో కరెంట్ ఉండటం లేదని... ప్రజలు కనీసం కంటినిండా నిద్రపోయే పరిస్థితి లేదన్నారు. కాంగ్రెస్, టీడీపీలను నమ్ముకుంటే ప్రజలను నట్టేట ముంచుతారని షర్మిల వ్యాఖ్యానించారు. నందిపల్లెలో విద్యార్థులను కలిసిన ఆమె వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

No comments:
Post a Comment