వేంపల్లె(వైఎస్‌ఆర్ జిల్లా), న్యూస్‌లైన్: దివంగత నేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి తనయ, వై.ఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల శుక్రవారం జిల్లాలోని పలు గ్రామాల మీదుగా పాదయాత్ర చేయనున్నారు. ఉదయం 9.30 గంటల ప్రాంతంలో వేంపల్లె శివారులోని రాజీవ్ నగర్ కాలనీ నుండి రెండవ రోజు పాదయాత్ర ప్రారంభిస్తారు. రాజీవ్‌నగర్ కాలనీ,నందిపల్లె,తాళ్లపల్లె, ముసల్‌రెడ్డిగారిపల్లె, దుగ్గన్నగారిపల్లె, అమ్మయ్యగారిపల్లె, వి.కొత్తపల్లె మీదుగా వేముల వరకు పాదయాత్ర కొనసాగించనున్నారు. ఆయా గ్రామాల నుంచి నాయకులు, మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చి సంఘీభావం తెలపాలని వైఎస్‌ఆర్ సీపీ విజ్ఞప్తి చేసింది.
No comments:
Post a Comment