40 లక్షల చదరపు అడుగుల స్టోరేజ్అనంతపురం జిల్లా దాడితోట గ్రామ సమీపంలోని రత్నమ్మ అనే రైతుకు చెందిన టమాట తోట ఎండిపోవడంతో అక్కడ ఆగారు. ఇప్పటికే రెండు లక్షల అప్పు ఉందని, ఇప్పుడు టమాట తోట ఎండిపోయి నష్టపోయామని, బోరు ఎత్తిపోవడంతో ఈ పరిస్థితి తలెత్తిందని రత్నమ్మ వాపోయారు. ఇప్పుడు వరిపొలం కూడా ఎండిపోయే పరిస్థితి ఉందని వివరించారు. ‘చిత్రావతికి ఇంత సమీపంలో రైతు ఇన్ని కష్టాలు ఎదుర్కొంటున్న పరిస్థితి. ఈప్రభుత్వానికి మనసే లేదు..’ అని షర్మిల ఆవేదన వ్యక్తంచేశారు. ‘టమాటాలను రైతు 2 రూపాయలకు అమ్ముకునే పరిస్థితి ఉంది..’ అని రైతులు వివరించగా ‘జగనన్న సీఎం కాగానే రాష్ట్రంలో ఇప్పుడున్న 40 లక్షల చదరపు అడుగుల నిల్వ సామర్థ్యానికి అదనంగా మరో 40 లక్షల చదరపు అడుగుల నిల్వ సామర్థ్యం పెంచుతార’ని షర్మిల హామీ ఇచ్చారు. అక్కడి నుంచి దాడితోటకు వచ్చి సాయంత్రం 5.40కి అక్కడి బహిరంగ సభలో మాట్లాడారు. రాత్రి 7.45కు దాడితోట శివారులో రాత్రి బసకు చేరుకున్నారు. ఆరో రోజైన మంగళవారం మొత్తం 15.1 కిలోమీటర్లు నడిచారు. వైఎస్సార్ జిల్లాలో 7.3 కిలోమీటర్లు, అనంతపురం జిల్లాలో 7.8 కిలోమీటర్లు నడిచారు.
No comments:
Post a Comment