వైఎస్ విజయమ్మ దసరా శుభాకాంక్షలు

హైదరాబాద్, న్యూస్‌లైన్: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ తెలుగు ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. చెడుపై మంచి సాధించిన విజయానికి దసరా పండుగ ప్రతీక అని ఆమె మంగళవారం ఇచ్చిన ఒక సందేశంలో పేర్కొన్నారు. చెడు ఎంత దుర్మార్గమైనదైనా, ఎంతటి పాశవికమైనదైనా అంతిమ విజయం మంచినే వరిస్తుందని అనేక సందర్భాల్లో రుజువైందని, అదే నేటికీ పరంపరగా వస్తున్నదని ఆమె తెలిపారు. లోకంలోని ప్రజలందరినీ రక్షిస్తూ.. వారికి సుఖశాంతులు కలగాలని కాంక్షించే దుర్గామాత తన పిల్లలను చల్లగా చూస్తుందన్నారు.
No comments:
Post a Comment