Saturday, October 20, 2012

కాలపరీక్షకు నిలిచిన నాయకుడు

రాక్షసులు రాజ్యమేలుతున్నప్పుడు
మంచితనం మహానేరమవుతుంది
అవకాశాలు అందలాలెక్కిస్తున్నప్పుడు 
మాటతప్పని మడమతిప్పని నైజం దేశద్రోహమవుతుంది
ప్రజల్ని ఓటువేసే యంత్రాలుగా చూస్తున్నప్పుడు
కొండంత ప్రేమ కురిపించటం కడుపుమంటవుతుంది
ఒక మహానేత నిష్ర్కమణ తీరని విషాదమైతే
అప్పనంగా వచ్చిన అధికారాన్ని అనుభవిస్తూ
ఆ దివంగతనేత కుటుంబాన్ని వేధించడం
జగనన్నని బంధించడం మరింత దారుణం
దుఃఖం.... దుఃఖం.... దుఃఖం....
రాష్ట్రం నలుచెరుగులా మండుతున్న గుండెల దుఃఖం!
ప్రజల అభిమానాన్ని కనలేని కబోదులకు 
కాలమే లిఖిస్తుంది మరణశాసనం
సూర్యుడిపై ఉమ్మేసిన వాళ్ళు
నిప్పుని గుప్పెట్లో బంధించిన వాళ్ళు
చివరకు మిగిలేది చరిత్రహీనులుగానే
జనం కోసమే జగన్, జగన్ కోసమే జనం!

- ఎమ్.శ్రీనివాసరావు, వల్లూరు, పశ్చిమగోదావరిజిల్లా

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...