నా చిన్నప్పుడు మా మాస్టారు ‘‘రాజకీయం అంటే దోచుకోవడం, రాజనీతి అంటే పరిపాలించడం’’ అని చెప్పారు. నాకు అప్పుడు అర్థం కాకపోయినా చంద్రబాబు పాలనలో మాత్రం అర్థమైంది. ఆ సమయంలో పారిశ్రామిక, వ్యవసాయక రంగాలు కరెంట్ కోతలతో నష్టపోయాయి. ముసలివాళ్లకు పెన్షన్ అంటే తెలియని పరిస్థితి. సరిగ్గా ఆ సమయంలోనే పొడుగాటి తెల్లని చొక్కా, తెల్లని పంచె కట్టి, నెత్తిన కండువా చుట్టి, చిరునవ్వుతో వస్తున్న దైవసమానులైన ప్రియతమ వై.యస్.రాజశేఖరరెడ్డి గారిని చూశాం. జనం మొహంలో ‘బాధ’ కు బదులు ‘చిరునవ్వు’ ను చూడాలనుకొన్నారు. కాబట్టే ఐదేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన కాలంలో రాష్ట్రంలో ప్రతి ఇంటా రైతు తన గుండెలమీద చేయి వేసుకొని నిద్రపోయాడు. ఆయనకు జనం మీద ప్రేమ ఏ స్థాయిలో ఉందో ఆయన ప్రవేశపెట్టిన పథకాలే చెబుతాయి. రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఫీజ్ రీయింబర్స్‌మెంట్, పావలా వడ్డీ రుణాలు, ఇందిరమ్మ పక్కా గృహాలు, ఉచిత కరెంట్, రెండు రూపాయల కిలో బియ్యం, ‘జలయజ్ఞం’... ఎన్నో మంచి పథకాలను ప్రజల కోసం వైయస్సార్ ప్రవేశపెట్టారు. కాబట్టి 2009లో ప్రజలు మళ్లీ వైయస్సార్‌ని గెలిపించారు.
విధి మళ్లీ నాలాంటి పౌరుడిని రాష్ట్రం గురించి ఆలోచించేలా చేసింది. జగన్‌మీద కేసులు బనాయించి ఆయనను అన్యాయంగా జైల్లో పెట్టారు. వైయస్సార్ జీవోల మీద సంతకం చేయమంటే, కళ్లు మూసుకొని చేశామంటున్నారు మంత్రులు. వీరంతా గుమస్తాలా?ప్రజాప్రతినిధు లా? వైయస్సార్ ఉన్నంత కాలం నోరు తెరవని ‘శంకర్‌రావు’ ఎవరి ప్రోద్బలంతో లేఖ రాశాడు? జగన్ జైలుకి వెళ్లి 150 రోజులు కావస్తోంది. సీబీఐ జగన్ మీద మోపిన కేసులు ఎందుకు నిరూపించలేకపోతోంది? వైయస్సార్ మరణంతో మంత్రులందరు పోటాపోటీగా సంతకాలు పెట్టి జగన్‌ని నాయకుడిగా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయాలనుకొన్నారు. అలాంటిది వైయస్సార్‌ని, జగన్‌ని తిట్టడానికి వెనకాడని పరిస్థితిలోకి వచ్చారు. దీన్ని ‘పదవీ వ్యామోహం’ అనాలా లేదా ‘హైకమాండ్‌కి గురుదక్షిణ’ అనుకోవాలా? వైయస్సార్ జ్ఞాపకాలను తుంగలోకి తొక్కుతూ జగన్‌ని మా నుంచి దూరం చేసి జైల్లో పెట్టారు. ఈ చేష్టలన్నింటికీ నాలాంటి పౌరులందరూ ‘సాక్షులు’. వీటన్నింటికీ బుద్ధి చెప్పే రోజు ఎంతో దూరంలో లేదు. జగన్ జనంలో ఉంటాడు. అతని గుండె వెనుక నాలాంటి ఓటరు ఉన్నాడు.
- వై.నాగక్రాంతి, కందుకూరు, ప్రకాశం జిల్లా

No comments:
Post a Comment