ఎంబీఏ కోర్సుకు అయ్యే ఖర్చు భరించి చదివిస్తానని ఓ వికలాంగ విద్యార్థికి షర్మిల హామీ ఇచ్చా రు. బుధవారం తాడిమర్రి మండలం పెద్దకోట్ల సమీపంలో.. పుట్లూరు మండలం మడుగుపల్లి గ్రామానికి చెందిన బి.నాగేశ్వరరెడ్డి అనే వికలాంగుడు షర్మిలను కలిశాడు. బీకాం చదివిన తనకు ఎంబీఏ చదవాలని ఉందని, అయితే అంత స్తోమత తమకు లేదని, ప్రభుత్వ ప్రోత్సాహం కూడా లేకపోవడంతో చదువు కొనసాగించలేని పరిస్థితి ఉందని వాపోయాడు. షర్మిల స్పందించి.. ‘మహానేత రాజన్నకు ఉన్న పెద్ద మనసు ఈ పాలకులకు లేదు... ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి తూట్లు పొడుస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. జగనన్న వచ్చే దాకా ప్రజల కష్టాలు తీరవు.. ప్రస్తుతానికి నీ ఎంబీఏ కోర్సు చేయడానికి అయ్యే ఖర్చు మేమే భరిస్తాం’ అని హామీ ఇచ్చారు.
No comments:
Post a Comment