జగన్ పార్టీ పెట్టకూడదా?
పేపర్లు పెట్టుకోకూడదా?
చానల్స్ పెట్టకూడదా?
ఎంతోమంది పేపర్లు, చానళ్ళు పెడుతున్నారే. జగన్ రాజకీయాల్లోకి రాక ముందు నుంచి వ్యాపారవేత్తగా నిరూపించుకున్నాడు. ఆయన పెట్టిన వ్యాపారాలన్నీ సక్సెస్ కావడమే పాపమా?
దేవుడున్నాడో లేడో తెలియదు కానీ ఇన్ని కోట్లమంది గుండెల్లో నిలిచిపోయిన రాజశేఖర్‌రెడ్డి మాత్రం నిజంగా దేవుడే. ఇటీవల జరిగిన రాజశేఖర్‌రెడ్డిగారి 3వ వర్థంతి మా పసలపూడి గ్రామంలో చిన్నపిల్లలు ఎంతో ఘనంగా జరిపిన తీరు చూస్తే తెలిసిపోతుంది ఆయన అందరి గుండెల్లో ఎలా కొలువుతీరాడో. తల్లిదండ్రులు చనిపోయినప్పుడు పెద్దకార్యము వెళ్ళేవరకు ఓపికపట్టలేకపోతున్న పిల్లలున్న ఈ రోజుల్లో మూడు సంవత్సరాల కిందట చనిపోయిన రాజశేఖర్‌రెడ్డిగారి వర్థంతి ఇంత ఘనంగా జరపడం ఆయన దేముడనే సంగతి రుజువు చేసింది. రాజశేఖర్‌రెడ్డిగారు వీళ్ళందరికీ ఏమవుతారు? ఎందుకు ఈ బంధం ప్రతి కంటా కన్నీళ్ళు పెట్టిస్తోంది? ఎందుకు రాజశేఖర్‌రెడ్డిగారిని జనం మరిచిపోలేకపోతున్నారు?
అలనాడు భక్త రామదాసును జైల్లో పెట్టినవారి కంటే కూడా ఈ కాంగ్రెస్ పాలకులే దుర్మార్గులు. రామదాసు గుడి కడితే జగన్ కాంగ్రెస్‌పార్టీ బతికి బట్టకట్టడానికి సాక్షి టీవీ, సాక్షి పేపరు పెట్టాడు. అదేనా నేరం? అందుకేనా ఈ బహుమతి? ఈ కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులుంటాయా? అన్నం పెట్టిన చేతులను కుక్క కూడా కరవదు. కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన వైఎస్ కుటుంబాన్ని ఎన్ని కష్టాలు పెడుతున్నారో ప్రజలందరూ గమనిస్తున్నారు. జగన్ పార్టీ పెట్టకూడదా? పేపర్లు పెట్టుకోకూడదా? చానల్స్ పెట్టకూడదా? ఎంతోమంది పేపర్లు, చానళ్ళు పెడుతున్నారే. జగన్ రాజకీయాల్లోకి రావడానికి ముందు నుంచి వ్యాపారవేత్తగా నిరూపించుకున్నాడు. ఆయన పెట్టిన వ్యాపారాలన్నీ సక్సెస్ కావడమే పాపమా?
విజయమ్మ కంటతడికి ఈ కాంగ్రెసోళ్ళ రాతిగుండెలు కరగడం లేదా? భారతమ్మ గోడు వినిపించడం లేదా? అయినా జగన్ బెయిల్ గురించి ఆందోళన చెందాల్సిన పనిలేదు. జైలు జీవితం జగన్‌ని రాటుదేలుస్తుందనటంలో సందేహం లేదు. రోజులు గడిచేకొద్దీ కాంగ్రెస్ పార్టీ ఉరితీతకు ప్రజలు ఉవ్విళ్ళూరుతున్నారు. ఈత రాని పార్టీలోకి వెళితే ఈతవచ్చినవాడు కూడా మునిగిపోతాడు. కాంగ్రెస్, తెలుగుదేశం రెండూ కూడా మునిగిపోతున్న నౌకలు. వైఎస్‌ఆర్ నౌక మాత్రమే తీరం చేరుస్తుందని ప్రజలు ప్రగాఢ విశ్వాసంతో ఉన్నారు. అభిమానులెవ్వరూ అధైర్యపడవద్దు. మనం చేయాల్సిందల్లా ఈ రేయి తొందరగా తెల్లవారి మన కష్టాలు తీర్చే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని దైవాన్ని ప్రార్థిస్తూ వేచి చూడడమే.
- పోతంశెట్టి సాయిరామ్మోహన్‌రెడ్డి,
పసలపూడి, రాయవరం మండలం, తూ.గో.జిల్లా
పేపర్లు పెట్టుకోకూడదా?
చానల్స్ పెట్టకూడదా?
ఎంతోమంది పేపర్లు, చానళ్ళు పెడుతున్నారే. జగన్ రాజకీయాల్లోకి రాక ముందు నుంచి వ్యాపారవేత్తగా నిరూపించుకున్నాడు. ఆయన పెట్టిన వ్యాపారాలన్నీ సక్సెస్ కావడమే పాపమా?

అలనాడు భక్త రామదాసును జైల్లో పెట్టినవారి కంటే కూడా ఈ కాంగ్రెస్ పాలకులే దుర్మార్గులు. రామదాసు గుడి కడితే జగన్ కాంగ్రెస్‌పార్టీ బతికి బట్టకట్టడానికి సాక్షి టీవీ, సాక్షి పేపరు పెట్టాడు. అదేనా నేరం? అందుకేనా ఈ బహుమతి? ఈ కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులుంటాయా? అన్నం పెట్టిన చేతులను కుక్క కూడా కరవదు. కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన వైఎస్ కుటుంబాన్ని ఎన్ని కష్టాలు పెడుతున్నారో ప్రజలందరూ గమనిస్తున్నారు. జగన్ పార్టీ పెట్టకూడదా? పేపర్లు పెట్టుకోకూడదా? చానల్స్ పెట్టకూడదా? ఎంతోమంది పేపర్లు, చానళ్ళు పెడుతున్నారే. జగన్ రాజకీయాల్లోకి రావడానికి ముందు నుంచి వ్యాపారవేత్తగా నిరూపించుకున్నాడు. ఆయన పెట్టిన వ్యాపారాలన్నీ సక్సెస్ కావడమే పాపమా?
విజయమ్మ కంటతడికి ఈ కాంగ్రెసోళ్ళ రాతిగుండెలు కరగడం లేదా? భారతమ్మ గోడు వినిపించడం లేదా? అయినా జగన్ బెయిల్ గురించి ఆందోళన చెందాల్సిన పనిలేదు. జైలు జీవితం జగన్‌ని రాటుదేలుస్తుందనటంలో సందేహం లేదు. రోజులు గడిచేకొద్దీ కాంగ్రెస్ పార్టీ ఉరితీతకు ప్రజలు ఉవ్విళ్ళూరుతున్నారు. ఈత రాని పార్టీలోకి వెళితే ఈతవచ్చినవాడు కూడా మునిగిపోతాడు. కాంగ్రెస్, తెలుగుదేశం రెండూ కూడా మునిగిపోతున్న నౌకలు. వైఎస్‌ఆర్ నౌక మాత్రమే తీరం చేరుస్తుందని ప్రజలు ప్రగాఢ విశ్వాసంతో ఉన్నారు. అభిమానులెవ్వరూ అధైర్యపడవద్దు. మనం చేయాల్సిందల్లా ఈ రేయి తొందరగా తెల్లవారి మన కష్టాలు తీర్చే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని దైవాన్ని ప్రార్థిస్తూ వేచి చూడడమే.
- పోతంశెట్టి సాయిరామ్మోహన్‌రెడ్డి,
పసలపూడి, రాయవరం మండలం, తూ.గో.జిల్లా
No comments:
Post a Comment