Monday, October 29, 2012

జగన్ అంకుల్ జయిస్తాడు

దేవుడి మీద మాకు కోపం వస్తోంది. ఎందుకంటే దేవుడు మా దేవుడు లాంటి వైయస్‌తాతని తీసుకెళ్లాడు కదా! జనంలో నడిచి, జనం కష్టాలు తెలుసుకుని, జనం కోసమే పరిపాలించాడు వైయస్ తాత. దేవుడికేమో జెలసీ వేసింది, తాతకు తనకన్నా పేరొస్తుందని. అందుకేనా తీసుకెళ్లాడు? మాకైతే ఏడుపొచ్చేసింది. మా ఇంట్లో, మా ఊర్లో అందరూ ఏడ్చారు.

పాపం కొంతమందికి గుండె ఆగిపోయింది. ఎవరూ బాధపడొద్దు, నేనొస్తానని జగనంకుల్ బయలుదేరారు. ఎందరినో ఓదార్చారు. ముసలవ్వలు పెట్టిన పెరుగన్నం ముద్దలు ఇష్టంగా తిన్నారు. మమ్మల్ని కలవడానికి ఎండలో బాగా తిరిగి జగనంకుల్ బాగా చిక్కిపోయారు. షేక్‌హ్యాండ్‌లు అందరికీ ఇవ్వడంతో చేతులపై గీతలు కూడా పడ్డాయి. వాళ్ళెవరో ఢిల్లీలో ఉంటారంట. వాళ్ళకేమో జనంలోకి జగనంకుల్ వెళితే మంచి పేరొస్తుందని భయం వేసిందంట! అరెస్టు చేశారంట! జగనంకుల్‌ని బయటకు రాకుండా, బెయిల్ రాకుండా చేస్తున్నారు. 

మాకు, మా ఫ్రెండ్స్‌కి, మా పెద్దోళ్లకి, పేదోళ్లకి అందరికీ జగనంకుల్ బయటకు రావాలనుంది. దేవుడికి ప్రార్థన చేస్తున్నాం. దేవుడంకుల్! దేవుడంకుల్! జగనంకుల్‌కి బెయిలొస్తే మా రాష్ట్రం బాగుపడుతుంది. మా రాష్ట్రం బాధలు తప్పించడానికైనా అంకుల్‌ని మాలోకి రప్పించు. 

విజయమ్మమ్మని, భారతి ఆంటీని, షర్మిలక్కని అందరినీ మేం ప్రేమిస్తాం. వారొచ్చినా మేం వారితోపాటు ఉంటాం. వైయస్ తాత ఫ్యామిలీ అంటే మాకు అంత ఇష్టం. వాళ్లందరూ కలిసి సుఖంగా ఉండాలని, మా ఆంధ్రప్రదేశ్‌ని సుఖంగా ఉంచాలని మా ఆశ. తీరుస్తావు కదూ దేవుడంకుల్!

- ముక్కా హరికృష్ణ, 7వ తరగతి, పెనుగంచిప్రోలు,
- తుమ్మలపల్లి దివ్యాచౌదరి, 6వ తరగతి, కోదాడ
- తుమ్మలపల్లి దినేష్, 8వ తరగతి, కోదాడ

2 comments:

  1. పిల్లలూ... పిల్లలూ...
    ఇంతకీ జగనంకుల్ మీకు బాబాయా ..? మామయ్యా..?
    విజయమమ్మ అన్నారుకదా మావయ్యే అవాలి.
    వైఎస్ తాత ఆశయ సాధనకి, అమ్మమ్మ, పిన్ని(మీకు షర్మిల పిన్ని, అక్క కాదు) , అత్త, ఇంకా అనిల్ బాబాయ్ (మా పెద్దాళ్ళకు బ్రదరు) ఇంకా దూరంగా ఉన్న మామ, అటుఇటు గా ఉన్న సాయిఅంకుల్
    మనమందరమూ కలిసి కుసి సారీ కృషి చేద్దాం !!

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...