Sunday, October 21, 2012

'ఫ్యాన్’ తుఫాను ఖాయం


జగన్ కడప పార్లమెంట్ మెంబర్‌గా ఎన్నికైన రోజుల్లో కేంద్రంలోని అధినేత్రి ‘‘నీవు నా కుమారుడిలాంటి వాడివి, నీ సంగతి నేను చూసుకుంటాను’’ అని అభయం ఇచ్చి, సీబీఐ నేరం రుజువవ్వకుండానే ఎందుకు జైలు పాలు చేసింది? అయినా జైలు శిక్ష మేలే చేసింది. ఎన్నికలలో ప్రతిపక్షాలకు డిపాజిట్లు కూడా రాలేదు. నేరం రుజువు కాకుండా దేశంలో ఎంతమందిని జైలు పాలు చేశారు? బోఫోర్స్ కేసులో ప్రధాన నిందితుడు ఇటలీ దేశస్థుడు ఖత్రోచీని ఎందుకు విడిచిపెట్టారు. బోఫోర్స్ లంచాలు ముట్టిన ‘జి’ ఎవరు? తన పేరిట స్విస్ బ్యాంక్‌లో బోఫోర్స్ ఫిరంగుల కంపెనీ ఎంత ధనం దాచింది? ఆదాయపు పన్ను ఎగవేసి కోట్లధనం దాచిన వారి పేర్లు ప్రభుత్వం ఎందుకు బయటపెట్టలేదు. తీగలాగితే డొంకంతా కదులుతుంది. ప్రభుత్వాలు పడిపోతాయి. ఎంతకాలం దాస్తారు?

కేంద్రంలో ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చు. 2014లో మళ్లీ ఇప్పటివారినే గద్దెకెక్కించడానికి ప్రజలు పిచ్చివారు కాదు. ‘‘దేవుడు కాలములను, సమయములను మార్చువాడై యుండి రాజులను త్రోసివేయుచు, నియమించుచు ఉన్నవాడు. మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యముపై అధికారియై యుండి, తానెవరికి అనుగ్రహింప నిశ్చయించునో వారికనుగ్రహించుననియు, ఆయా రాజ్యముపై అత్యల్ప మనుష్యులను ఆయన నియమించుచున్నాడు.’’ దాని. 2:21, 4:17. ‘‘సర్వశక్తిమంతుడు సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి, దీనులను ఎక్కించెను’’ లూకా 1:52అప్పట్లో బ్రిటిష్‌వారు కారణం లేకుండా ఎవరినీ జైలులో వుంచేవారు కాదు. కాని ఇప్పుడు మనవారు మాత్రం నేరం రుజువు కాకుండగానే జైలుపాలు చేస్తున్నారు. ఇది ఎక్కడి న్యాయం? ప్రపంచదేశాల్లో ఈ విడ్డూరం ఎక్కడైనా ఉందా? జగన్ గారిని విడిచిపెడితే సాక్షులను ప్రభావితం చేస్తాడేమోనని అనుమానించి బెయిల్ కూడా ఇవ్వడం లేదట. జైలులో ఉంటే మాత్రం, ఆయన అనుచరులు, అభిమానులు సాక్షులను ప్రభావితం చెయ్యకూడదా? జగన్‌గారిని జైల్లో వుంచితే తన అభ్యర్థులకు ప్రజలు ఓట్లు వెయ్యరనే అభిప్రాయం బెడిసి కొట్టింది. బైఎలక్షన్ల జయం కొంచెమే. 2014లో వచ్చే జయం ‘ఫ్యాన్ తుఫాను’ లాగా ఉంటుంది. అప్పుడు బండ్లు ఓడలవుతాయి. ఓడలు బండ్లవుతాయి. - జగన్ అభిమాని, గుంటూరు

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...