Wednesday, October 31, 2012

రాష్ట్రంలో అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసిన రాజన్నను కుట్రలతో కూల్చేశారు. కుళ్ళు రాజకీయాలతో జగనన్ననూ జైలులో బంధించారు. దీంతో రాజన్నను జనం మరిచిపోతారని కొందరు ఊహలలో విహరిస్తున్నారు. మరి కొందరేమో జగన్‌తో ప్రజలకు ఉన్న బంధం మాయమైపోతుందని భావిస్తున్నారు. కాని వాస్తవం అదికాదు. ఒక్క నిరుపేదైనా కష్టం వచ్చి రాజన్న సమాధి వద్ద కన్నీళ్ళు కార్చితే చాలు నిరుపేదల కన్నీటిని తుడవడానికి రాజన్న వస్తారు.

కారణం తెలుసా... మాట తప్పని ధీరుడు రాజన్న . కాంగ్రెస్‌లో అవినీతి ఉండదని వీహెచ్ లాంటి వారు అంటున్నారు. బోఫోర్స్ , 2జీ, బొగ్గు కుంభకోణాలు ఎవరు చేశారు?... కాంగ్రెస్‌లో అవినీతి వుంటే ఉరి వేసుకుంటాన్న వీహెచ్... బొగ్గు కుంభకోణాలను చూసి ఎప్పుడు ఉరి వేసుకుంటారో ఆయనకే తెలియాలి.

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ త్యాగమయి అని, తన భర్తను చంపిన వారికి క్షమాభిక్ష పెట్టారని శంకర్‌రావు, వీహెచ్, మధుయాష్కీ, సర్వేసత్యనారాయణ లాంటి వారు అంటున్నారు. కాని సోనియాగాంధీ తన భర్తను చంపిన వారికి క్షమాభిక్ష పెట్టారని ధైర్యంగా ఒక్కరు కూడా తమిళనాడులో చెప్పగలరా? కాలం వేగంగా తిరుగుతోంది. త్వరలో జగనన్న జైలు నుంచి రావాలి... రాజన్న పాలన రావాలి. వైఎస్ కుటుంబానికి అత్మీయులు, ఆత్మలుగా చెప్పుకున్న నేటి కాంగ్రెస్ పెద్దలు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఆ కుటుంబానికి అండగా నిలబడండి.

కొండా దంపతుల్లాగ ఆదర్శంగా నిలబడండి. ఎందుకంటే రాబోయేది జగనన్న పాలన. జగన్‌కు ఏమి చెప్పి ఓట్లు అడుగుతారని కొందరి ప్రశ్న... జలయజ్ఞం, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, పావలా వడ్డీ రుణాలు, 108... ఇంత కన్నా ఏం కావాలి ఓటు అడగగానికి?

- కోనేటి వెంకటేశ్వర్లు, లెక్చరర్, అర్ధశాస్త్రం,

తిరువళ్లూరు జిల్లాలోని ప్రైవేటు కళాశాల, తమిళనాడు

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...