Monday, October 22, 2012

నేటి మధ్యాహ్నం నుంచి ‘అనంత’లో షర్మిల యాత్ర

వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తరఫున సోదరి షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర మంగళవారం అనంతపురం జిల్లాలోకి ప్రవేశించనుంది. వైఎస్సార్ జిల్లాలో పాదయాత్ర చేస్తున్న షర్మిల సోమవారం రాత్రి నేర్జాంపల్లి శివారులో బస చేశారు. మంగళవారం నేర్జాంపల్లి గ్రామం దాటాక మళ్లీ వైఎస్సార్ జిల్లాలోనే మరో 5 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్నారు. పార్నపల్లిలో ప్రజలతో మమేకమయ్యాక చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ను సందర్శిస్తారు. మధ్యాహ్న భోజనం అనంతరం ఒంటి గంటకు అనంతపురం జిల్లా దాడితోటకు చేరుకుని ప్రజలతో మాట్లాడతారు. ఆ గ్రామ శివారులోనే రాత్రికి బసచేస్తారు. మంగళవారం పాదయాత్రలో వైఎస్ షర్మిల 15.1 కిలోమీటర్లు నడవనున్నట్లు వైఎస్‌ఆర్ సీపీ ప్రోగ్రాం కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, జిల్లా కన్వీనర్ శంకరనారాయణ తెలిపారు.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...