Friday, November 30, 2012

మా ప్రార్థన ఆయన కోసమే....




నేను ఒక రిటైర్డ్ ఉద్యోగిని. నాకు మొదటి నుంచి వైయస్‌ఆర్ అంటే ఎంతో అభిమానం. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్‌ను 
రెండుసార్లు అధికారంలోకి తీసుకుని వచ్చిన మహానుభావుడాయన. 2009లో కేంద్రంలో 33 మంది ఎంపీలను అందించిన సవ్యసాచి వైఎస్. అలాంటి వ్యక్తి కుటుంబానికి ఇటువంటి బాధలు రావడం నా మనసుకు ఎంతో బాధగా ఉంది. జగన్ తెలివితేటలతో, అతనికున్న వ్యాపారాలతో అభివృద్ధి చెందాడు. దానికే ఇంత అన్యాయమా? అదే కాంగ్రెస్‌తో కలిసి ఉంటే ఏదీ ఉండేది కాదు. సోనియా అల్లుడికి ఒక నీతి, జగన్‌కు ఒక నీతా? నేను రోజూ టీవీ ముందు కూర్చుని జగన్ గురించి ఏ వార్త వస్తుందో అని ఎదురు చూస్తున్నాను. దేనినైనా వదులుకోవచ్చు కానీ, మనోధైర్యాన్ని వదులుకోకూడదు. చివరకు విజయం జగన్‌నే వరిస్తుంది. జగన్ కుటుంబమంతటికీ మంచి జరగాలని ఆ శ్రీనివాసుని ప్రార్థిస్తున్నాను.
- వి.పూర్ణచంద్రరావు, మాచవరం డౌన్, విజయవాడ.

నిరీక్షణ

నిరంతరం సేవాతత్పరతతో
రియల్ హీరోవైన జగనన్నా!
క్షణమొక యుగంగా నీవు జైల్లో గడుపుతుంటే
మా హృదయాలు పగిలిపోతున్నాయన్నా!
నీకు న్యాయం జరుగుతుంది, నీ పాలన వస్తుంది...
అదే మా ఆశ... అందుకే మా నిరీక్షణ..
- వల్లూరి ప్రసాద్‌బాబు, తణుకు, ప.గో. జిల్లా

హోం > వివరాలు ఆ లేఖ చూసి బుద్ధి రావాలి...


పేద, బడుగు, బలహీనవర్గాల ఆశాజ్యోతి... రైతు బాంధవుడు... రాజన్న రాజ్యం తేగల ఏకైక ప్రియతమ యువనాయకుడు వైయస్ జగన్ రాకకోసం ఈ రాష్ట్ర ప్రజలు తమ ఇష్టదైవాలను ప్రార్థిస్తూ, కోట్ల కళ్లతో ఎదురు చూస్తున్నారు. జగన్‌మోహన్‌రెడ్డి కడిగిన ఆణిముత్యం అని ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కాంగ్రెస్, టీడీపీల స్వార్థపూరిత కుట్రలను ప్రజలు బాగా అర్థం చేసుకున్నారు. జగన్ సంధించిన బాణం 

షర్మిలమ్మ ‘మరో ప్రజాప్రస్థానం’ దెబ్బకు కాంగ్రెస్, టీడీపీలు గిలగిల కొట్టుకుంటున్నాయి. ప్రజలు షర్మిలమ్మ పాదయాత్రలో పాదం కలుపుతూ, కదం తొక్కుతూ, జన ప్రభంజనం లాగా సాగుతుండడం కాంగ్రెస్, టీడీపీ, ఎల్లో మీడియాకు కంటగింపుగా మారింది. తేలుకు తోకలో విషముంటుంది... పాముకు తలలో విషముంటుంది... ఎల్లోమీడియాకు నిలువెల్లా విషమే. ఆ విషాన్నంతా జగన్‌పై వెళ్లగక్కుతున్నాయి. చంద్రబాబు అయితే అర్థంపర్థం లేని, ఆధారం లేని అనుచిత వ్యాఖ్యలతో జగన్‌కు బెయిల్ రాకుండా చేయాలని మరో కుట్రకు తెరలేపుతున్నారు.

చంద్రబాబు గారికి భారతమ్మ రాసిన లేఖ సారాంశాన్ని గ్రహించి, విలువలు, విజ్ఞతకు కట్టుబడతారా లేక పాత పద్ధతినే అనుసరించి కుట్ర, వెన్నుపోటు ధోరణినే కొనసాగిస్తారా అని రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారు. ఆయన పాదయాత్ర అంతంత మాత్రంగా సాగడమే ఆయనకు ప్రస్తుతం ప్రజలు విధిస్తున్న శిక్ష. అసలైన శిక్ష ఎన్నికల్లో విధిస్తారు.

కుళ్లు, కుట్రలు, కుతంత్రాలు, కుయుక్తులతో నడిపే రాజకీయాలు ఎంతోకాలం నిలబడవు. అలాంటి రాజకీయాలు నడిపేవారు చరిత్రహీనులుగా మిగిలిపోతారు. విలువలు, విశ్వసనీయతతో నడిచే రాజకీయాలే ప్రజల హృదయాలలో శాశ్వతంగా నిలిచిపోతాయి. ఇది చరిత్ర చెబుతున్న అక్షరసత్యం.
- ఆదిరెడ్డి యానాదిరెడ్డి, శ్రీకాళహస్తి, చిత్తూరు జిల్లా

ఆడపిల్లల గోడు.. వినిపిస్తోందా!

టీడీపీ అధినేత చంద్రబాబుకు షర్మిల ప్రశ్న
ప్రతి ఆడ శిశువుకు రూ.5 వేలు డిపాజిట్ చేసి, ఉచితంగా చదివిస్తామన్న మీ మాట ఏమైంది?
మీ తొమ్మిదేళ్ల పాలనలో నాలుగంటే.. నాలుగు లక్షల మందికి మీరు డిపాజిట్ చేశారు
ఇప్పుడు పల్లెల్లో మీరు తిరిగినప్పుడు.. కూలీలుగా కనిపిస్తున్న ఆడబిడ్డలను
చూసినప్పుడైనా మీకు బాధ అనిపించలేదా?
ఏ మాటా ఇవ్వకున్నా వైఎస్ ఆ పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేశారు
రూ.5 వేలు కాదు.. తొలిచూరు ఆడబిడ్డకు రూ. 1,00,000 వేశారు
రెండో ఆడపిల్ల పుడితే మరో రూ.30,000 చొప్పున డిపాజిట్ చేశారు
మహానేత మరణించాక రైతులు దిక్కులేక ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి
రైతుల గోడు వినిపించని ఈ ప్రభుత్వం ఉందా? చచ్చిందా?
ఇంత జరుగుతున్నా చంద్రబాబు ఈ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టరట..
కాంగ్రెస్‌తో ఆయన కుమ్మక్కయ్యారు కాబట్టే అవిశ్వాసం పెట్టనంటున్నారు
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ శుక్రవారం యాత్ర ముగిసేనాటికి.. రోజులు: 44, కిలోమీటర్లు: 606

 ‘‘చంద్రబాబు నాయుడు గారూ.. సడన్‌గా మీరు పాదయాత్ర అంటూ పల్లెల వెంట తిరుగుతున్నారు. రకరకాల హామీలు ఇస్తున్నారు. మీరు అధికారంలోకి రావడానికి ముందు ఎన్నికల్లో మీరొక వాగ్దానం చేశారు. పుట్టిన ప్రతి ఆడబిడ్డకు రూ.5 వేలు డిపాజిట్ చేస్తామని, ఆ ఆడబిడ్డ చదివినంత వరకు ఉచితంగా చదివిస్తామని స్వయంగా మీరే మాటిచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఎంత మంది అడపిల్లలకు ఉచిత విద్య అందించారు? మొత్తం మీ తొమ్మిదేళ్ల పాలనలో కేవలం నాలుగంటే నాలుగు లక్షల మందికి రూ.5 వేల చొప్పున మీరు డిపాజిట్ చేశారు. 

అయ్యా.. చంద్రబాబు గారూ.. ఆ పల్లెల వెంట తిరుగుతున్నప్పుడు.. కూలీలుగా పనులు చేసుకొంటున్న ఆడబిడ్డలను చూసినప్పుడైనా ‘అయ్యో..! ఆ వేళ మాట ఇచ్చి తప్పించుకున్నానే.. ఆ ఆడబిడ్డల ఉసురు నాకు తగులుతుందే’ అని మీ మనసుకు ఒక్క సారంటే ఒక్కసారైనా అనిపించలేదా?’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల.. టీడీపీ అధినేత చంద్రబాబును నిలదీశారు. ‘‘అదే మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఎలాంటి వాగ్దానం చేయకుండానే మీ కంటే గొప్పగా ఆ పథకాన్ని అమలు చేశారు. కుటుంబంలో తొలిచూరు ఆడపిల్ల జన్మిస్తే రూ.1,00,000, రెండో ఆడపిల్ల పుడితే రూ.30,000 చొప్పున డిపాజిట్ చేశారు. ఆయన సువర్ణ పాలనలో మొత్తం ఐదున్నర లక్షల మంది చిన్నారుల పేరు మీద ఇలా డిపాజిట్ చేశారు. నా చిట్టి తల్లులు పెరిగి పెద్దవారైతే పెళ్లీడు వచ్చే నాటికి మూడున్నర లక్షల రూపాయల నుంచి నాలుగు లక్షల రూపాయల వరకు నగదు చేతికి వస్తుంది’’ అని షర్మిల గుర్తుచేశారు. ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, దానితో కుమ్మక్కయిన చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర 44వ రోజు శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లాలోని మక్తల్ నియోజకవర్గంలో సాగింది. ఆమె అడుగులో అడుగు వేస్తూ కదం తొక్కేందుకు ఆత్మకూరు మండల
కేంద్రానికి భారీ ఎత్తున ప్రజలు తరలివచ్చారు. వారిని ఉద్దేశించి షర్మిల ప్రసంగిస్తూ పై వ్యాఖ్యలు చేశారు.

ప్రభుత్వం బతికే ఉందా? చచ్చిందా?

‘‘నిన్న(గురువారం) రాత్రి నేను పాదయాత్ర ముగించే సమయంలో పెద చెన్నయ్య అనే రైతు నా వెంట నడిచాడు. ‘అక్కా.. వైఎస్సార్ నాకు కన్న తండ్రి లాగా ఉన్నాడు. పోయిన ఏడాది పత్తి పంట వేశాను. అది చేతికి రాలేదు. ఇప్పుడు పత్తితోపాటు వేరుశనగ కూడా వేశాను. అది కూడా వస్తుందో రాదో తెలీదు. రూ. 3 లక్షలు అప్పుల పాలయ్యాను. నాన్న ఉన్నప్పుడు నా అప్పులన్నీ తీర్చేశాడు. ఇప్పుడు నాకు ఆ పరిస్థితి లేదక్కా..’ అని చెప్పినప్పుడు ఒక పక్క బాధ అన్పించింది. మరోవైపు నాన్న గారు రైతుల హృదయాల్లో ఇంతలా గూడు కట్టుకున్నారని సంతోషపడ్డాను. నాన్న పోయాక రైతులు గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలు చేసుకోవాల్సిన దుస్థితి.. లేకుంటే ఉన్న భూములను అమ్ముకోవాల్సిన పరిస్థితి దాపురించింది. రైతుల గోడు పట్టించుకోని ఈ ప్రభుత్వం బతికి ఉందా లేదా చచ్చిందా’’ అని షర్మిల ధ్వజమెత్తారు.

చంద్రబాబు అవిశ్వాసం పెట్టనంటున్నారు..

‘‘నేను గ్రామాల వెంట వెళ్తున్నప్పుడు చాలా మంది అక్కా చెల్లెమ్మలు ‘మాకు తాగునీళ్లు కూడా లేవు. చేసుకోవడానికి కూలి పనులు కూడా దొరకడం లేదు. పసి పిల్లలను ఇంటి దగ్గర వదిలిపెట్టి బతుకు దెరువు కోసం వలసలు వెళ్తున్నా’మని చెప్తున్నారు. ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉంటే పట్టించుకోని ఈ ప్రభుత్వాన్ని నిలదీసి ప్రజల సమస్యలు తీర్చేలా చేయాల్సిన ప్రతిపక్ష నేత చంద్రబాబు.. అధికార పక్షంతోనే కుమ్మక్కయ్యారు’’ అని షర్మిల టీడీపీ అధినేతను తూర్పారబట్టారు. ‘‘చంద్రబాబుకు మాట మీద నిలబడటం అంటే ఈ జన్మలో తెలీదు. తొమ్మిదేళ్లలో ఎనిమిదిసార్లు కరెంటు చార్జీలు పెంచి వాటిని కట్టమని రైతులపై ఒత్తిడి తెచ్చాడు. కరువు వచ్చింది.. తినటానికే తిండి గింజలు లేవు.. ఇప్పుడు బిల్లులు కట్టలేం మహాప్రభో అని రైతులు మొరపెట్టుకున్నా చంద్రబాబు వినలేదు. అప్పుడు రాజన్న ప్రతిపక్షంలో ఉన్నారు. ఆయన పదవి ఉన్నా లేకపోయినా రైతులకు అండగా నిలబడ్డారు. అదే బాబు రైతులు కరెంటు బిల్లులు కట్టలేదని వారింట్లో సామాను లాక్కున్నారు. కేసులు పెట్టించారు. ఇంట్లో మగవారు లే నిపక్షంలో ఆడవారిని పోలీస్ స్టేషన్‌లో పెట్టారు. బకాయిలు కట్టలేక, అవమానం తట్టుకోలేక 4 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇది మరిచిపోలేని విషయం. ఈ పాపం బాబుది కాదా?’’ అని నిలదీశారు.

బాబు శ్మశానాలుగా మార్చిన గ్రామాల్లోనే..

‘‘చంద్రబాబు పాదయాత్ర అని ఇప్పుడు కొత్తగా డ్రామాలు ఆడుతున్నారు. తన తొమ్మిదేళ్ల పాలనలో శ్మశానాలుగా మార్చిన గ్రామాల మీది నుంచే ఇప్పుడు ఆయన పాదయాత్ర చేస్తున్నాడు. ప్రజలకు తెలుసు.. మాట మీద నిలబడటం అంటే చంద్రబాబుకు ఈ జన్మలో అర్థం కాదు. పాదయాత్ర చేయాల్సిన అవసరమే ఆయనకు లేదు. ఆయనకు తగినంత మంది ఎమ్మెల్యేల బలం ఉంది. అవిశ్వాసం పెట్టి ఈ ప్రభుత్వాన్ని దించవయ్యా చంద్రబాబు అంటే అవిశ్వాసం పెట్టనంటే పెట్టనంటున్నారు. ప్రభుత్వంతో కుమ్మక్కయ్యారు కాబట్టే ఆయన అవిశ్వాసం పెట్టనంటున్నారు’’ అని షర్మిల విమర్శించారు.

షర్మిలకు నేతల సంఘీభావం

మహబూబ్‌నగర్, న్యూస్‌లైన్ ప్రతినిధి: షర్మిలకు సంఘీభావంగా వైఎస్సార్ కాంగ్రెస్‌కు చెందిన పలువురు నాయకులు శుక్రవారం పాదయాత్రలో పాల్గొన్నారు. వారిలో ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు బాజిరెడ్డి గోవర్ధన్, బాల మణెమ్మ, ఆది శ్రీనివాస్, జ్యోతుల నెహ్రూ, రోజా, వాసిరెడ్డి పద్మ, ఎడ్మ కిష్టారెడ్డి, స్వర్ణ సుధాకర్‌రెడ్డి, రెడ్డిగారి రవీందర్‌రెడ్డి, తలశిల రఘురాం, కాపు భారతి, వర్కటం జగన్నాథరెడ్డి, రాకేష్‌రెడ్డి, యాపర్ల మహేశ్వరమ్మ, కందూరి లక్ష్మి, కోట్ల హరిచక్రపాణిరెడ్డి, తిరుమల రెడ్డి, రావుల రవీంద్రనాథ్‌రెడ్డి, గౌరారం వెంకటరెడ్డి తదితరులున్నారు.

షర్మిలకు అల్లీపురంలో ఆత్మీయ స్వాగతం


షర్మిల పాదయాత్ర శుక్రవారం రాత్రి ఆత్మకూరు మీదుగా అల్లీపురంవైపు సాగింది. ఇక్కడ కొంత మంది యాత్రకు ఆటంకం కలిగించే ప్రయత్నం చేశారు. విషయం దావానలంలా గ్రామంలో వ్యాపించడంతో ప్రతి ఇంటి నుంచీ మహిళలు బయటికి వచ్చారు. షర్మిలకు అండగా నిలబడ్డారు. ఆమెకు హారతి పట్టి ఆహ్వానించారు. రైతులు కూడా అండగా కదలిరావడంతో అల్లీపురం చౌరస్తా జనంతో కిటకిటలాడింది. ప్రజలను చూసి ఆ ఆందోళనకారులు తమ ప్రయత్నం విరమించుకున్నారు. మహిళలు తోడు ఉండి గ్రామ శివారులో ఏర్పాటు చేసిన బస వరకు షర్మిలను సాగనంపారు. 44వ రోజు శుక్రవారం ఉదయం మూలమల్ల శివారు నుంచి మొదలైన యాత్ర ఆత్మకూరు మీదుగా రాత్రి 8 గంటలకు అల్లీపురం చేరింది. శుక్రవారం మొత్తం 17 కిలోమీటర్ల మేర షర్మిల నడిచారు. ఇప్పటివరకు మొత్తంగా 606 కిలోమీటర్ల మేర పాదయాత్ర పూర్తయింది.

‘యువకిరణాలు’ ఎటు పోతున్నాయ్

మూలమల్ల గ్రామంలో షర్మిల నిర్వహించిన రచ్చబండలో ఓ అంధ విద్యార్థి మాట్లాడుతూ.. ‘‘నా పేరు నవీన్. వికలాంగుడిని.. డిగ్రీ, డీఎడ్ పూర్తి చేశాను. నా సోదరి కూడా వికలాంగురాలు. వికలాంగులకు మూడు శాతం రిజర్వేషన్ ఉంది కానీ అది సరిగా అమలు కావడం లేదు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి రాజీవ్ యువకిరణాలతో నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామని చెప్పారు. మాకు ఇంతవరకు ఏ ఉపాధీ చూపించ లేదు. పైరవీకారుల ఇంటికి యువ కిరణాలు చేరుతున్నాయక్కా’’ అని చెప్పుకొచ్చారు. షర్మిల స్పందిస్తూ జగనన్న రాగానే వికలాంగులు చిన్నచిన్న వ్యాపారాలు చేసుకునేందుకు రుణాలు ఇప్పించి ప్రోత్సహిస్తారని భరోసా ఇచ్చారు.

Thursday, November 29, 2012

రాజన్న రాజ్యం మళ్లీ రావాలి...


రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సమస్యల విషవలయంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఆకాశాన్నంటుతున్న ధరలు, ఊహించని స్థాయిలో కరెంటు కోతలు రాష్ట్రాన్ని అట్టుడికిస్తున్నాయి. ఎవరెన్ని కబుర్లు చెప్పినా, కల్లబొల్లి వాగ్దానాలు చేసినా తెలుగు ప్రజలు వినే స్థితిలో లేరు. కిరాయికి ఉండే కుటుంబాలు కరెంటు బిల్లులతో బెంబేలెత్తుతున్నాయి. రాజన్న లేకుంటే ఇంతలోనే ఎంత మార్పు! రాష్ట్ర సమగ్రాభివృద్ధినీ, ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని విలక్షణ పథకాలను రూపొందించి రాజన్న విజయవంతంగా అమలు చేసి అభివృద్ధి పథాన రాష్ట్రాన్ని నడిపించిన ఘనత దివంగత నేత ముఖ్యమంత్రి మన రాజన్నదేనన్న విషయం నిరాకరించలేని వాస్తవం. రైతులు ఎదుర్కొంటున్న సాగునీటి సమస్యల శాశ్వత పరిష్కారానికి ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన జలయజ్ఞానికి గాను మన రాజన్న... అన్ని రాజకీయ వర్గాలకు అతీతంగా, జాతీయ స్థాయిలో అన్ని రాజకీయ పార్టీల నేతల నుంచి ప్రశంసలను అందుకున్నారు. అందుకే రెండోసారి రాజన్న కాంగ్రెస్ పార్టీకి పట్టం గట్టారు.

రాజన్న అకాల మరణంతో అన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు కావడం లేదు. ప్రజల సంక్షేమం గాలికి కొట్టుకుపోయింది. అభివృద్ధి కుంటుపడి విద్యుత్ కోతలతో పరిశ్రమలు కూడా మూతకు గురవుతున్నాయి. చిరునవ్వు నవ్వుతూ అందరితో కలుపుగోలుగా మాట్లాడే వ్యక్తి మన రాజన్న. ఆయన నవ్వులు రాష్ట్రంలోని ప్రతివారి పెదవులపై విరజిమ్మాలంటే ఆ రాజన్న పాలన జగనన్న ద్వారా మళ్ళీ రావాలని, అది కలకాలం నిలవాలని మనసా వాచా కోరుకుంటున్నారు. ఆ మంచి కాలం ఎప్పుడెప్పుడా అని వేయికళ్లతో అందరూ ఎదురుచూస్తున్నారు.
- కందికట్ల సదానందం, సిరిసిల్ల, కరీంనగర్

తండ్రి ఆశయాలను నెరవేర్చే తనయుడు

నేను మండల కేంద్రంలోని ఒక ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యయునిగా పనిచేస్తున్నప్పుడు ప్రజలతో సత్సంబంధాలుండాలన్న భావనతో, వారితో కలివిడిగా ఉండేవాడిని. ఒకరోజు ఒక వ్యక్తిని ‘బాగున్నావా? చాలా రోజులుగా కనిపించడంలేదు’ అని పలకరించాను. వెంటనే ఆయన తన చొక్కా బటన్స్ విప్పి, ఛాతీ చూపించి, తనకు జరిగిన శస్త్రచికిత్స గురించి చెప్పాడు.

‘ఆ మహానుభావుని దయవల్ల, పైసా ఖర్చులేకుండా, ఖరీదైన చికిత్స అందింది. గుండె ఆపరేషన్ అయింది. ఇప్పుడు బాగున్నాను’ అని రెండు చేతులు జోడించి, ‘రాజశేఖరరెడ్డి లాంటి ముఖ్యమంత్రులుండాలి. పేద ప్రజలకు మేలు జరగాలని కోరుకుంటున్నాన’ని వినమ్రంగా చెప్పాడు.

ఆయన ఒక సాధారణ రైతు. ఖరీదైన వైద్యచికిత్స చేయించుకునే తాహతు లేదు. దివంగత మహానేత రాజశేఖర్‌రెడ్డి గారి ఆలోచనల్లోంచి ఉద్భవించిన ‘ఆరోగ్యశ్రీ’ ద్వారా పేద ప్రజలకు కార్పొరేట్ చికిత్స అందుతున్నందుకు నేను మనసులోనే ఆనందించాను. ప్రజలు ఆరోగ్యంగా ఉంటే రాష్ట్రం ఆరోగ్యంగా ఉంటుందని నమ్మే వ్యక్తి అయినందున, ముఖ్యమంత్రిగా ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టి, దేశంలో అందరికీ ఆదర్శంగా నిలిచాడు. చాలా రాష్ట్రాలు ఈ పథకాన్ని ఆమలు చేశాయి.

ఈరోజు ఆ పథకాన్ని ప్రభుత్వం నీరుగారుస్తోంది. జాబితాలోని చాలా జబ్బులను ఆ పథకం నుంచి తొలగించారు. కొన్నింటికి చికిత్స ప్రభుత్వ ఆస్పత్రులకే పరిమితం చేశారు. అక్కడ డాక్టర్ల కొరత, వసతులు, మందులు లేని కారణంగా, ఈ పథకం నీరుగారిపోతోంది.

రాజశేఖరరెడ్డి గారి ఆశయాలు పూర్తిగా అమలు కావాలంటే జగనన్న ముఖ్యమంత్రి కావాలి. తండ్రి ఆశయాలు నెరవేర్చే నాయకుడు జగన్ మాత్రమే అని ప్రజలు నమ్ముతున్నారు. తొందరలోనే ఆరోజు వస్తుందని, రాజన్న సువర్ణ యుగం వస్తుందని నమ్మే ప్రజలలో నేనొకడిని.
- వి. షణ్ముఖరెడ్డి, అనంతపురం

నీరు పారితే.. వలసలుండవు

పాలమూరు జిల్లాలో 4 ప్రాజెక్టులను 75 శాతం వరకు నాన్న పూర్తి చేశారు
మిగతా 25 శాతం పూర్తి చేయడానికి ఈ ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది
దీంతో నీరు లేక, కూలీ దొరకక పాలమూరు జిల్లా ప్రజలు వలసల బాట పడుతున్నారు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ జిల్లాను దత్తత తీసుకొని ప్రయోజనమే లేదు
పైగా ఈ అసమర్థ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టమంటే.. ఆయన డొంకతిరుగుడు వ్యాఖ్యలు చేస్తున్నారు
త్వరలోనే జగనన్న వస్తాడు.. ప్రతి ఇంటినీ సంతోషంగా ఉంచుతాడు
నెట్టెంపాడు ప్రాజెక్టు వద్ద వైఎస్సార్ స్మృతులతో కన్నీరుమున్నీరైన షర్మిల
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ గురువారం యాత్ర ముగిసేనాటికి.. రోజులు: 43, కిలోమీటర్లు: 589

  ‘ఈ జిల్లాలో(పాలమూరు) పంటలు పండించడానికి నీరు లేక, చేసేందుకు కూలి పనులు లేక ఇక్కడివారంతా బతుకుదెరువు కోసం ఇతర జిల్లాలకు, దేశాలకు వలసపోతున్నారు. అదే ప్రాజెక్టులు ఉండి.. నీళ్లు పారి.. పంటలు పండితే వారు వలస పోవాల్సిన అవసరమే ఉండదు. జిల్లాలో ఉన్న కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ ప్రాజెక్టులను పూర్తి చేస్తే జిల్లా సస్యశ్యామలం అవుతుంది. ఆ ఉద్దేశంతోనే నాన్న రాజశేఖరరెడ్డి ఈ ప్రాజెక్టుల్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని తపించేవారు. ‘ఆ ప్రాజెక్టులు పూర్తయితే నా అన్నాతమ్ములు వలసలు మానేసి కుటుంబాలతో ఇక్కడే సంతోషంగా ఉంటారు’ అని నాన్న ఎప్పుడూ చెప్తుండేవారు’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల.. తన తండ్రి మహోన్నత ఆశయాలను గుర్తుచేసుకుంటూ వ్యాఖ్యానించారు.

Wednesday, November 28, 2012

మేము స్మరించే పేరు...

ఢీ కొట్టిన కెరటాన్ని తిప్పి కొట్టినప్పుడే ఆ ఒడ్డు నిలుస్తుంది అన్నాడో మహాకవి. అది జగనన్నకు సరిపోతుంది. క్రూరమైన అసూయ, ద్వేషం, కక్ష కలగలిసిన కెరటాలై తన మీదకు దూసుకొచ్చిన వాటిని తిప్పికొట్టి ధీరుడై నిలిచినాడు. జగన్ అనే మూడక్షరాలను 24 గంటల్లో కనీసం కొన్ని గంటలైనా స్మరించలేకుండా ఉండలేము, ఆయన గూర్చి వార్తలు చదవకుండా ఉండలేము, ఏదో పవర్ ఆయన పేరులోనే ఉంది. అసూయ పడేటంత జనాభిమానం ఉంది. చరిత్రలో అతికొద్దిమంది మాత్రమే ఆ రాజఠీవిని పొందగలరు. ఎంతైనా సహనానికి, ధైర్యానికి, పట్టుదలకు, మన మాట అవునంటే అవును, లేదు అంటే లేదు అనే దానికి జగనన్న ప్రత్యక్ష సాక్షి. అందుకే జగనన్న మాకు రోల్ మోడల్ 
i am really proud of leader jagan garu.

- కె. శేఖర్, కాకినాడ

ఓన్లీ లీడర్ జగన్

ప్రపంచంలో ఏ మహిళా సాహసించని విధంగా మహాపాదయాత్రలో ప్రజల సమస్యలను తెలుసుకుని, రాజన్న కూతురుగా, జగనన్న చెల్లెలుగా ముందుకు నడుస్తున్న షర్మిలను చూస్తే అటు వంటి స్ఫూర్తి ఆ కుటుంబానికే సాధ్యం అని అనిపిస్తోంది. జగన్ వదిలిన బాణంగా షర్మిల దూసుకుపోతోంది. ఆమెకు ఆ శక్తి ఎక్కడిది? జగన్ శక్తే ఆమె శక్తి. జగన్‌ను షర్మిలలో చూసుకుంటున్నారు జనం. తాత్కాలికంగా తమకు దూరమైన ఆ యువనేతను షర్మిలలో చూసుకొని ఊరిడిల్లుతున్నారు. జగన్ విడుదలైన రోజున ఆయనకు స్వాగతం చెప్పడానికి ఈ భూమి చాలదు. 

ఇదంతా వైఎస్ దయ. వై.యస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ప్రతి పథకం పార్టీలతో వర్గాలతో, ప్రాంతాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చిచింది. వారు సమాజంలో ఉన్నతంగా ఎదిగేందుకు దోహదపడింది. అందువలన వై.యస్. చనిపోయి ఇన్నేళ్ళయినా ప్రజలు గుండె అనే గూటిలో గుడి కట్టుకొని ఆరాధిస్తున్నారు, అభిమానిస్తున్నారు. ఇది జగమెరిగిన సత్యం. రాజన్న మరణం రాష్ట్రానికి తీవ్ర నష్టాన్ని, దుఃఖాన్ని మిగిల్చింది. రాజన్న రెక్కల కష్టంతో వచ్చిన అధికారాన్ని అప్పనంగా అనుభవిస్తున్న ఢిల్లీ గల్లీ ప్రభుత్వాలు ప్రజల సమస్యలు గాలికి వదిలేసి, వారి కుర్చీలు కాపాడుకోవడానికి కష్టపడుతున్నారు. అలాంటి సమయంలో ప్రజల పక్షాన నిలబడి నేనున్నాను అంటూ ముందుకు వచ్చి, ప్రజాసాగరంలో పగలు, రాత్రి, ఎండ, వాన లెక్క చేయకుండా ప్రజలనే కుటుంబంగా భావించి, ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాడిన యోధుడు, వీరుడు, ఏకైక వ్యక్తి జగనన్న.

జగనన్నకు లభిస్తున్న ప్రజల అభిమానాన్ని, ప్రేమను తట్టుకోలేని దుష్ట కాంగ్రెస్ - దుర్మార్గ టిడిపి కుమ్మకై నీతిమాలిన రాజకీయ కుట్రలతో జైలుకు పంపారు. ప్రతి పేదవాడి గుండె లబ్‌డబ్ లబ్‌డబ్ అని కాకుండా జగనన్నా జగనన్నా అని కొట్టుకుంటోందన్న విషయం వారికి తెలియదు. ప్రజావ్యతిరేక ప్రభుత్వం పడిపోయే స్థితిలో ఉన్నా, అవిశ్వాస తీర్మానం పెట్టకుండా పాదయాత్రతో టైంపాస్ చేస్తున్న చంద్రబాబు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే ప్రజాక్షేత్రంలో తానూ ఒక మనిషి అనే గుర్తింపు అయినా దక్కించుకుంటారు.

- వి.వి. శ్రీనివాస్‌యాదవ్, నకిరేకల్

ఆల్మట్టి పాపం చంద్రబాబుదే!

చంద్రబాబూ మీరు కేంద్రంలో చక్రం తిప్పానని చెప్తుంటారు..
మీ హయాంలోనే కర్ణాటక ఆల్మట్టి ఎత్తు పెంచుతుంటే ఏమీ చేయలేక అసమర్థుడిగా ఉండిపోయారు
ఆ వేళ ఆల్మట్టికి అడ్డంపడి ఉంటే.. ఈ రోజు పాలమూరు జిల్లాలో పంట పొలాలు ఎండిపోయేవా?
ఆ పాపం మీదే అని మీకు అనిపించడం లేదా?.. ఏసీబీ, సీబీఐ, ఈడీ కాంగ్రెస్ పార్టీ చేతిలో కీలుబొమ్మలు
బొత్స ఒక డాన్ అని వాళ్ల పార్టీ కేంద్ర మంత్రే లేఖ రాసినా ప్రభుత్వం విచారణ చేయదు
ప్రజల్ని గాలికొదిలేసిన ఈ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టమంటే చంద్రబాబు సాకులు చెప్తున్నారు
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ బుధవారం యాత్ర ముగిసేనాటికి.. రోజులు: 42, కిలోమీటర్లు: 571.50


‘‘ఈ ప్రభుత్వం ఏ క్షణంలో ఉచిత విద్యుత్తును ఎత్తి వేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి నిర్లక్ష్యం వల్లేరాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం ఏర్పడింది. పక్క రాష్ట్రాల్లో కూడా విద్యుత్ సంక్షోభం ఉన్నప్పటికీ వాళ్లు ముందస్తు ప్రణాళికతో విద్యుత్తు కొనుగోలు చేసి సమస్యను అధిగమించారు. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ముఖ్యమంత్రి తన సీటును పదిలపరతచుకునే పనిలో పడి ప్రజా సమస్యలను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ ప్రభుత్వం ఉండి కూడా ప్రజలకు ఉపయోగపడటం లేదు. ‘కరెంటు రెండు మూడు గంటలైనా ఉండడం లేదు’ అని రైతులు, ప్రజలు కన్నీళ్లు పెట్టుకుంటుంటే.. ‘కరెంటు లేకపోతే ఏం? కిటికీలు, తలుపులు తీసి పడుకోండి’’ అని మన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి అంటారు. ఆయన మాత్రం ఏసీలో ఉంటారుకానీ ప్రజలకు మాత్రం ఉచిత సలహాలు పడేస్తారు.’’ 
- ధరూర్ సభలో షర్మిల

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘న్యూస్‌లైన్’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘చంద్రబాబు నాయుడుగారూ.. మీ హ యాంలో కేంద్రంలో చక్రం తిప్పానని గొప్పలు చెప్తున్నారు. మరి మీ హయాంలోనే కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచి కడుతుంటే ఏమీ చేయలేక అసమర్థుడిగా మిలిగిపోయారు. ఇవాళ ఈ పాలమూరు జిల్లాలో నువ్వు తిరుగుతున్నప్పుడు నీళ్లు లేక ఎండిపోయిన పండ్ల తోటలను, పంట పొలాలను చూస్తున్నప్పుడైనా.. ‘అయ్యో! ఈ పాపం నాదే.. ఆ వేళ నేను ఆల్మట్టికి అడ్డంపడి ఉంటే నేను దత్తత తీసుకున్న పాలమూరు జిల్లాకు ఇవాళ నీటి సమస్య ఉండేది కాదే అని ఒక్కసారైనా మీ మనసుకు అనిపించడం లేదా?’’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ప్రశ్నించారు. ప్రజలను గాలికొదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికీ, దానితో కుమ్మక్కయిన టీడీపీ అధినేత చంద్రబాబు వైఖరికి నిరసనగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తరఫున షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర 42వ రోజు బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల నియోజకవర్గంలో సాగింది. ధరూర్ మండల కేంద్రంలో తనతో పాటు కదం తొక్కుతూ వచ్చిన భారీ జనసందోహాన్ని ఉద్దేశించి ఆమె ప్రసంగిస్తూ పై వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఈ ప్రభుత్వం ఉండకూడదంటూ చంద్రబాబు నాయుడు విమర్శలు చేస్తున్నారని, అలాంటపుడు అవిశ్వాసం పెట్టొచ్చు కదా అంటే.. సాకులు చెప్తున్నారని దుయ్యబట్టారు.

ఏసీబీ, సీబీఐ, ఈడీ కాంగ్రెస్ చేతిలో కీలు బొమ్మలు..

‘‘కాంగ్రెస్ పార్టీ తనకు అనుకూలంగా లేని వారిపై అక్రమంగా కేసులు పెట్టి హింసిస్తోంది. ఇవాళ ఏసీబీ, సీబీఐ, ఈడీ కాంగ్రెస్ పార్టీ చేతిలో కీలు బొమ్మలుగా మారిపోయాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ వాళ్లు ఇష్టం వచ్చినట్లుగా ఆడుతున్నారు’’ అని షర్మిల కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిపై నిప్పులు చెరిగారు. ‘‘మంత్రి ధర్మాన ప్రసాదరావును ప్రాసిక్యూషన్ చేయాల్సిన అవసరమే లేదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి చెప్తారు. ఆయన ఏ తప్పూ చేయలేదంటారు. ఆయన మంత్రివర్గంలోనే అమాయకుడైన ఓ బీసీ మంత్రిని మాత్రం జైల్లో పెట్టించారు. అంటే.. ఏది తప్పో.. ఏది ఒప్పో ఈ కాంగ్రెస్ వాళ్లే నిర్ణయిస్తారట. ఎవరిని బయట ఉంచాలో.. ఎవరిని జైల్లో పెట్టాలో వాళ్లే తేలుస్తారట. చిరంజీవి ఆయన పార్టీని గంపగుత్తగా అమ్ముకొని కోట్ల రూపాయలు మంచం కింద దాచుకొని దొరికిపోతే ఆయన మీద ఎలాంటి కేసులూ ఉండవు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ లిక్కర్ మాఫియాకు నాయకుడని, రాష్ట్ర వ్యాప్తంగా ఆయన బినామీ పేరుతో లిక్కర్ దుకాణాలు తెరిచాడని, ఆయన ఒక డాన్ అని కాంగ్రెస్ పార్టీకే చెందిన కేంద్ర మంత్రి లేఖ రాస్తే పట్టించుకోరు. ఐఎంజీ భారత కేసులో చంద్రబాబు మీద నెల రోజులలోపు విచారణ చేయాలని కోర్టు.. సీబీఐని ఆదేశిస్తే తమ దగ్గర సిబ్బంది లేరని చెప్పింది. అదే జగనన్న మీద విచారణకు ఆదేశించిన 24 గంటల్లో అదే సీబీఐ 28 బృందాలను పెట్టి జగనన్న, ఆయన బంధువుల ఇళ్లలో సోదాలు చేసింది’’ అని షర్మిల విమర్శించారు.

ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేదు: ‘‘నెట్టెంపాడు ప్రాజెక్టును చంద్రబాబు నాయుడు ఎన్నికల కోసం ఉపయోగించుకున్నారు. 2004లో 25 వేల ఎకరాల ఆయకట్టుతో నెట్టెంపాడుకు శంకుస్థాపన చేశారు. వైఎస్సార్ అధికారంలోకి రాగానే 25 వేల ఎకరాలకు కాదు ఏకంగా రెండు లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని, ఇందుకోసం రూ.1,400 కోట్లు కేటాయించారు. రూ.1,200 కోట్లు ఖర్చు చేసి 75 శాతం పనులు పూర్తి చేశారు. ఇక మిగిలింది 25 శాతం పనులే.. మూడు సంవత్సరాలు గడిచినా ఈ ప్రభుత్వానికి ఆ పనులు చేసే చిత్తశుద్ధి లేక ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. ప్రాజెక్టు నుంచి కనీసం 1,000 ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేమని అధికారులు చెప్తున్నా వినకుండా మన ముఖ్యమంత్రి గొప్పలకుపోయి ఈ ప్రాజెక్టుకు ప్రారంభోత్సవం చేసి వెళ్లారు. కానీ ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టు నుంచి ఒక్క ఎకరం కూడా నీళ్లు పారడం లేదు’’ అని షర్మిల ప్రాజెక్టులపై ప్రభుత్వ వైఖరిని తప్పబట్టారు.

యాత్రకు నేతల సంఘీభావం

బుధవారం షర్మిల పాదయాత్రలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీజీసీ సభ్యులు మైసూరా రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, బాల మణెమ్మ, అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ, పార్టీ ప్రోగ్రామ్స్ కమిటీ కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, జిల్లా కన్వీనర్ ఎడ్మ కిష్టారెడ్డి, పార్టీ నాయకులు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, కోట్ల హరిచక్రపాణిరెడ్డి, దేవనాథ్‌రెడ్డి దంపతులు, కాపు భారతి, బండ్ల చంద్రశేఖర్‌రెడ్డి, తిరుమలరెడ్డి, నాగర్‌దొడ్డి వెంకటరాముడు, మహేశ్వరమ్మ, మధుమిత, రఘునాథరెడ్డి, మానికేశ్వరరావు, రాంభూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

గుక్కెడు నీళ్ల కోసం 5 కి.మీ.


‘‘మాకు తాగడానికినీళ్లు లేవమ్మా. ఓ బోరులేదు.. ఓ బాయి లేదు.. మంచి నీళ్లు తెచ్చుకోవాలంటే 5 కిలోమీటర్లు పోవాలే. ఇంట్లో మొగొళ్లు పోయి నీళ్లు తెస్తే తెచ్చినట్లు లేకుంటే ఉప్పు నీళ్లే గతి. జేజమ్మ(మంత్రి డీకే అరుణ)ను రచ్చబండకు వచ్చినపుడు మాకు నీళ్లు గావాలే అని అడిగితే తెస్తా అన్నది కాని ఇంత వరకు నీళ్లు లేవు’’ అని సంగాల గ్రామానికి చెందిన జయమ్మ, తిమ్మక్క, సుజాతమ్మ, మహేశ్వరమ్మ అనే మహిళలు షర్మిలకు తమ గోడు వెళ్లబోసుకున్నారు. షర్మిల స్పందిస్తూ.. ‘‘నేను యాత్రలో నడిచిన ప్రతి గ్రామంలో ‘మా గ్రామంలో నీళ్లు లేవమ్మా.. మాకు నీళ్లు లేవక్కా’ అని చాలా మంది అక్కా చెల్లెమ్మలు చెప్తూ బాధపడుతున్నారు. నాకు చాలా బాధనిపించింది. ఇక్కడ ఉన్న మంత్రి ఒక మహిళ.. ఆడవాళ్ల బాధలు ఏమిటో ఒక మహిళగా ఆమెకు తెలిసి ఉండాలి. 

డీకే అరుణకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా తాగు నీటి సమస్యను వెంటనే పరిష్కరించేది. ఆమెకు పదవి మీద ఉన్న శ్రద్ధ ప్రజల మీద లేదు. కనీసం ప్రజలకు తాగు నీళ్లు ఇవ్వలేని ఆమెకు ఒక్క క్షణం కూడా ఆ పదవిలో కొనసాగే అర్హత లేదు. త్వరలోనే జగనన్న వస్తారు. మీ అందరి సమస్యా తీరుస్తారు’’ అని భరోసా ఇచ్చారు. ‘మరో ప్రజా ప్రస్థానం’ పాదయాత్ర 42వ రోజు బుధవారం ఉదయం సంగాల చెర్వు నుంచి మొదలై గనుపాడు మీదుగా ధరూర్ మండల కేంద్రానికి చేరింది. ధరూర్‌లో నిర్వహించిన సభకు భారీ ఎత్తున జనం తరలి వచ్చారు. షర్మిల అక్కడి నుంచి మన్నపాడు మీదుగా నెట్టెంపాడు వద్ద ఏర్పాటు చేసిన బసకు రాత్రి 8 గంటలకు చేరుకున్నారు. బుధవారం 17.50 కిలోమీటర్ల మేర ఆమె నడిచారు. ఇప్పటివరకు మొత్తంగా 571.50 కి.మీ. పాదయాత్ర పూర్తయింది.

Tuesday, November 27, 2012

రియల్ హీరో వైఎస్ జగన్

‘బోనులో ఉన్నా బయట ఉన్నా పులి పులే’. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీలు డిపాజిట్లు గల్లంతయ్యి జగన్ సార్ సీఎం అవ్వడం ఖాయం. ఒక నాయకుడిని టార్గెట్ చేస్తూ ప్రభుత్వ, ప్రతిపక్షనేతలు, ఎల్లో మీడియా, దాని తోక పత్రికలూ చేస్తున్న కక్ష సాధింపు చర్యలు బహుశా మన దేశ చరిత్రలోనే ఎన్నడూ జరగలేదు. ఒక మనిషిని ఇంతగా హింసించడం వారి దిగజారుడుతనానికి నిదర్శనం. 

జగన్ నేరస్తుడు అని చెప్పే చంద్రబాబు తనకున్న ఆస్తిని రాజకీయాల్లో కాస్త కష్టపడి సంపాదించాడా, కూలిపని చేశాడా, అదే జగన్ తన తెలివితేటలతో వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తే అది నేరమా? ఇప్పుడు రాష్ట్రంలో 90శాతం మంది ప్రజలు, యువకులు, వృద్ధులు, అందరూ జగనే సీఎం కావాలని కోరుకుంటున్నారు. ఇది నిజం. ఆపైనున్న మహానేత ఆశీస్సులు, మనందరి ఆకాంక్షలతో జగన్ త్వరలోనే బయటకు వస్తాడని ఆశిస్తున్నాను. 
- ఎన్.సుబ్బారావు, పామర్రు

వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నాం...

దివంగతనేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఎప్పుడైతే చనిపోయారో అప్పటి నుండి ఈ రాష్ట్రానికి దురదృష్టం పట్టుకుంది. ఎందుకంటే ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ఆశయాలను ఈ ప్రభుత్వం తుంగలో తొక్కింది. తన రెక్కలు కష్టంతో అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో రెండుసార్లు అధికారంలోకి తీసుకువచ్చిన వ్యక్తి వైయస్‌ఆర్. అలాంటి నేతను అక్రమంగా సంపాదించారంటూ కొందరు కాంగ్రెస్ ఆరోపణలు చేశారు. ఆ పెద్దలు ప్రతి పక్షాలతో కుమ్మక్కై ఆయన పేరును ఎఫ్‌ఐఆర్‌లో నమోదయ్యేలా చేశారు. తన తండ్రి చనిపోయినప్పుడు మనస్తాపం చెంది మరణించినవారి కుటుంబాలను ఓదార్చాలని ఇచ్చిన మాటకు కట్టుబడి పల్లెపల్లె తిరుగుతూ ‘‘నేను ఉన్నాను’’ అంటూ చనిపోయిన కుటుంబాలు ఓదార్చాడు జగన్. ప్రజాసమస్యలపై పోరాటాలు, దీక్షలు చేస్తూ ఉంటే జగన్ మరింత ప్రజలకు చేరువయ్యాడు. 

ఇది తట్టుకోలేని పాలకపక్షం, ప్రతిపక్షం, కొన్ని మీడియా సంస్థలు కుమ్మక్కై సీబీఐ అనే ఒక మంత్రదండాన్ని చేతిలోకి తీసుకుని జగన్‌ను అక్రమంగా అరెస్టు చేశారు. ఒక పక్కన కరెంటు మోతలు, మరోపక్కన వంటగ్యాస్ మంట దానికి తోడు పెట్రోలు వాత ఇంకా నీలం తుఫాను దాటికి గురైన వరి పంట నష్టం వంటి బాధలతో ప్రజలు, రైతులు సతమతమవుతున్నారు. రాష్ట్రానికి సేవ చెయ్యవలసిన సీఎం ‘ముందుంది మంచికాలం’ అంటూ ఢిల్లీ పెద్దలకు సేవలు చేస్తున్నాడు. 

ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని నిలదియ్యవలసిన వ్యక్తి అదే ప్రభుత్వంతో కుమ్మక్కై మీడియాను అడ్డం పెట్టుకుని ‘వస్తున్నా మీకోసం’ అంటూ పాదయాత్ర చేస్తున్నాడు. కాని ప్రజలకు కష్టాలు తీరేరోజు త్వరలో రానుంది. దేవుడు జగన్‌వైపే ఉన్నాడు. రాజన్న రాజ్యం జగనన్నతో సాధ్యం. ఇది జగమెరిగిన సత్యం. జగన్ అన్న అతి త్వరలో బయటకు వస్తాడు. వైయస్‌ఆర్ కుటుంబానికి అండగా మేము ఉంటాం. జనం కోసం జగన్. జగన్ కోసం జనం అంటూ జన నేత కోసం వెయ్యికళ్ళతో ఎదురుచూస్తున్నాం.
జననేత కోసం వెయ్యికళ్ళతో.....
- జి.కృష్ణంనాయుడు, గంపవానిపాలెం(గ్రా), విశాఖజిల్లా

అక్కా.. జగనన్న ఎప్పుడొస్తాడు..


 ‘అక్కా జగనన్న ఎప్పుడొస్తాడు.. అన్న రాకుంటే నేను బతకనక్కా’ అంటూ లక్ష్మి అనే అమ్మాయి షర్మిల వద్ద కన్నీటి పర్యంతమైంది. మంగళవారం గద్వాలలోని వేదనగర్‌లో నేతన్నల సమస్యలు తెసుకునేందుకు షర్మిల వెళ్తుండగా.. లక్ష్మి విలపిస్తూ ఆమె వద్దకు వచ్చింది. ‘అక్కా జగనన్న ఎప్పుడొస్తాడు’ అంటూ ప్రశ్నించింది. జగనన్న బయటకు రాకుంటే తాను బతకనంటూ విలపించింది. దీంతో షర్మిల ఆమెను ఓదారుస్తూ అధైర్యపడొద్దని, త్వరలోనే జగనన్న వస్తాడమ్మా అని ధైర్యం చెప్పారు.

పాదయాత్రకు.. పథకాలకూ...తెలంగాణలోనే శ్రీకారం

మహానేత ఏం చేసినా ఈ ప్రాంతంలోనే మొదలుపెట్టేవారు: షర్మిల

తెలంగాణపై ప్రేమ లేకపోతే వైఎస్ ఇవన్నీ ఎందుకు చేస్తారు కేసీఆర్ గారూ?
అందరూ సాధ్యం కాదన్న ‘ప్రాణహిత-చేవెళ్ల’ను కట్టాలని వైఎస్ సంకల్పించారు
ప్రాజెక్టు పూర్తయితే తెలంగాణలోని 7 జిల్లాల్లో 16లక్షల ఎకరాలకు నీరొస్తుంది..
డీకే అరుణ ఈ ప్రాంత ప్రజలకు మంచి నీరు కూడా అందించలేకున్నారు
కేసీఆర్, టీఆర్‌ఎస్‌కు ప్రజా సమస్యలు పట్టడం లేదు
వైఎస్ పేరును ఉచ్చరించే అర్హత కాంగ్రెస్ వాళ్లకు లేదు
అవిశ్వాసం పెట్టమంటే చంద్రబాబు విమర్శలతో సరిపెడుతున్నారు
గద్వాల బహిరంగ సభకు జన ప్రభంజనం
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ మంగళవారం యాత్ర ముగిసేనాటికి.. రోజులు: 41, కిలోమీటర్లు: 554

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘న్యూస్‌లైన్’ ప్రత్యేక ప్రతినిధి: దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డికి తెలంగాణ అంటే ప్రేమ లేదని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు చేసిన వ్యాఖ్యలపై వైఎస్ కుమార్తె షర్మిల అభ్యంతరం వ్యక్తంచేశారు. ‘‘వైఎస్సార్‌తన పాదయాత్రను సైతం తెలంగాణ నుంచే మొదలుపెట్టారు. రూ.2 కిలో బియ్యం, ఆరోగ్యశ్రీ, పావలా వ డ్డీ ఇలా నాన్న ఏ పథకమైనా తెలంగాణ నుంచే మొదలు పెట్టారు. ఈ ప్రాంతంపై ప్రేమే లేకపోతే ఇవంతా ఎందుకు చేస్తారు?’’ అని ప్రశ్నించారు. ‘‘అంతెందుకు ఈ ప్రాంతానికి చెందిన వాళ్లు ఎంతో మంది ముఖ్యమంత్రులయ్యారు కదా.. వారిలో ఒక్కరంటే ఒక్కరైనా ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును కట్టే సాహసం చేశారా? కొంతమంది సీఎంలు ఇది అసాధ్యం అని పక్కనపెడితే, ఇంకొంత మంది సీఎంలు ఇది చాలా కష్టమైన పని అని వదిలేశారు. కానీ తెలంగాణ కోసం దాన్ని కట్టి తీరాలని వైఎస్ సంకల్పించారు. 

అధికారుల్లో ఉత్సాహం నింపేందుకు వాళ్లను చైనాకు తీసుకొని వెళ్లారు. అక్కడ నిర్మించిన త్రీగోర్జెస్ ప్రాజెక్టును వాళ్లకు చూపించి చైనా వాళ్లు కట్టగా లేనిది మనం ప్రాణహిత- చేవెళ్లను ఎందుకు కట్టలేమని చెప్పి దేశంలోనే పెద్ద ఎత్తిపోతల పథకానికి వైఎస్ శ్రీకారం చుట్టారు. ఆ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని ఎంతగానో ప్రయత్నించారు. వైఎస్సార్‌కు తెలంగాణ మీద ప్రేమే లేకుంటే ఏడు తెలంగాణ జిల్లాల్లో 16 లక్షల ఎకరాలకు సాగు నీరందించే ఈ ప్రాజెక్టును కట్టాలనుకునేవారా?’’ అని ఆమె.. కేసీఆర్‌ను నిలదీశారు. ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, దానితో అంటకాగుతున్న ప్రతిపక్ష నేత చంద్రబాబు వైఖరికి నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తరఫున షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర 41వ రోజు మంగళవారం మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల నియోజకవర్గంలో సాగింది. గద్వాలలో నిర్వహించిన బహిరంగ సభకు వేలాదిగా తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి షర్మిల ప్రసంగిస్తూ పై వ్యాఖ్యలు చేశారు. 

చంద్రబాబు వల్ల నేతన్నల ఆత్మహత్యలు

చంద్రబాబు హయాంలో వందలాది మంది నేతన్నలు ఆత్మహత్యలు చేసుకున్నారని.. వైఎస్సార్ అధికారంలోకి వచ్చిన తర్వాత వారి కుటుంబాలకు రూ.లక్షన్నర పరిహారం ఇచ్చారని, సబ్సిడీలతో ఆదుకున్నారని షర్మిల చెప్పారు. చేనేత సొసైటీల రుణాలు మాఫీ చేయడం కోసం వైఎస్సార్ రూ.312 కోట్లు కేటాయిస్తే ఈ ప్రభుత్వం ఆ నిధులను విడుదల చేయలేదని విమర్శించారు. వైఎస్ మరణించాక బతుకే భారంగా ప్రజలు బతుకుతున్నారని షర్మిల అన్నారు. ఇలాంటి ప్రభుత్వాన్ని అవిశ్వాసం పెట్టే బలం చంద్రబాబుకు ఉన్నా.. ఆయన ఆ పని చేయకుండా విమర్శలతో సరిపెడుతున్నారన్నారు. 

మీరు బాగుంటే చాలా?: ‘‘ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే డీకే అరుణ మంత్రి అయ్యారు. మంత్రిని అడుగుతున్నా.. మీరు మాత్రమే చక్కగా ఉంటే సరిపోదండీ.. మీ నియోజకవర్గ ప్రజలు బాగున్నారా? లేరా? అని చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద లేదా?’’ అని షర్మిల ప్రశ్నించారు. తాను దారి వెంట వస్తుంటే ప్రజలంతా తాగు నీళ్లకు ఇబ్బందిగా ఉందమ్మా అని చెప్తున్నారని, తాగు నీళ్లు కూడా ఇవ్వలేకపోతున్నారంటే ఇది మీకు అవమానం కాదా? అని అన్నారు. పదవిని కాపాడుకునేందుకు పెట్టిన శ్రద్ధలో సగం ప్రజల మీద పెడితే ప్రజలకు సమస్యలే ఉండవన్నారు.

కేసీఆర్‌కు, టీఆర్‌ఎస్‌కు ప్రజల సమస్యలు పట్టవు

‘‘మీ సిట్టింగ్ ఎంపీ(కేసీఆర్)కిగాని, టీఆర్‌ఎస్ పార్టీకి గాని ప్రజా సమస్యలు పట్టనే పట్టవు. పైగా వైఎస్‌కు తెలంగాణపై ప్రేమ లేదని కేసీఆర్ అంటున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ ప్రాంత ప్రాజెక్టుల కోసం ఖర్చు పెట్టింది రూ.700 కోట్లు. కానీ వైఎస్సార్ ఖర్చు పెట్టింది రూ.25,000 కోట్లు. ప్రస్తుతప్రభుత్వం ఖర్చు చేసింది రూ.7,000 కోట్లు. ఈ ముగ్గురిలో తెలంగాణ ప్రాంతమంటే ఎవరికి ప్రేమ ఉంది కేసీఆర్ గారూ?’’ అని షర్మిల ప్రశ్నించారు. రాజశేఖరరెడ్డి జగనన్నకు ఓబులాపురం మైన్స్ ఇచ్చారని, తనకేమో ఖమ్మంలోని బయ్యారం మైన్స్ ఇచ్చారని కేసీఆర్ అంటున్నారని, ఓబులాపురం, బయ్యారంలలో తమకు వాటాలు లేవని నిరూపిస్తే.. చిన్నవాళ్లమైనా తమ వద్దకు వచ్చి క్షమాపణ చెప్పే సంస్కారం కేసీఆర్‌కు ఉందా? అని షర్మిల ప్రశ్నించారు. ‘‘మీకో బిడ్డ ఉంది కేసీఆర్ గారు. మీ బిడ్డ మీద ఎవరైనా అభాండాలు, నిందలు వేస్తే మీరు ఊరుకుంటారా? మరి మా మీద ఎందుకు నిందలు వేస్తున్నారు?’’ అని అన్నారు.

వైఎస్ పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేరుస్తుంటే వేడుక చూశారు

‘‘రాజశేఖరరెడ్డి కాంగ్రెస్ పార్టీకి 30 ఏళ్లు సేవ చేశారు. రెండు సార్లు ఆ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. కానీ కనీస కృతజ్ఞత లేకుండా ఇదే కాంగ్రెస్ పార్టీ వారు వైఎస్సార్‌ను దోషిగా చూపేందుకు యత్నిస్తున్నారు. రాజశేఖరరెడ్డి ఇచ్చిన పదవులు అనుభవిస్తున్న రాజ్యసభ ఎంపీలు, ఇప్పుడున్న క్యాబినెట్ మంత్రులు.. వైఎస్సార్ పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేరుస్తుంటే వేడుక చూసినట్లు చూశారే తప్ప ఒక్కరికి అంటే ఒక్కరికైనా చీమ కుట్టినట్టైనా లేదు’’ అని షర్మిల ఘాటుగా విమర్శించారు. పైగా ఇప్పుడు వాళ్లే తాము వైఎస్సార్ అభిమానులమని చెప్పుకొంటున్నారని, అలా చెప్పుకోవడానికి సిగ్గు లేదా అని అన్నారు. ‘‘నిజాయతీ ఉంటే అభిమానం అనేది గుండెల్లోంచి పుట్టాలి. వీళ్లకు కనీసం వైఎస్సార్ పేరు ఉచ్చరించడానికి కూడా అర్హత లేదు’’ అని మండిపడ్డారు. షర్మిల 41వరోజు మంగళవారం పాదయాత్రను ఉదయం బూడిదపాడు నుంచి ప్రారంభించారు. పెద్దపల్లి, పాల్వాయి మీదుగా రాత్రి 6 గంటకు గద్వాల పట్టణానికి చేరారు. గద్వాల సభకు భారీ ఎత్తున జనం తరలి వచ్చారు. అక్కడి నుంచి సంగంబండచెరువు వద్ద ఏర్పాటు చేసిన బసకు రాత్రి 8 గంటలకు చేరుకున్నారు. మంగళవారం 14.90 కి.మీ. మేర యాత్ర సాగింది. ఇప్పటివరకు మొత్తంగా 554 కి.మీ. పాదయాత్ర పూర్తయింది.

బిల్లు రాలేదు.. ఇల్లు పూర్తి కాలేదు

ఇందిరమ్మ ఇల్లు మంజూరైనా ప్రభుత్వం బిల్లులు ఇవ్వకపోవడంతో చేసేది లేక ఓ లబ్ధిదారుడు ఆ ఇంటి నిర్మాణాన్ని మధ్యలోనే వదిలేసుకోవాల్సి వచ్చింది. పెద్దపల్లి గ్రామం మీదుగా మంగళవారం పాదయాత్ర చేసిన షర్మిలకు అక్కడ పలువురు మహిళలు తమ సమస్యలను చెప్పుకున్నారు. ‘‘మా గ్రామానికి చెందిన తెలుగు వెంకటన్నకు ఇందిరమ్మ పథకం కింద ఇల్లు మంజూరైంది. దీంతో అప్పులు చేసి గోడల వరకు ఇల్లు కట్టుకున్నాడు. అయితే అధికారులు ఒక్క రూపాయి బిల్లు కూడా ఇవ్వలేదు. దీంతో ఇంటినిర్మాణం కోసం చేసిన అప్పులు తీర్చలేక ఇబ్బందులు పడుతూ నిర్మాణం మధ్యలోనే ఆపేసి బతుకుదెరువు కోసం వలసపోయాడు’’ అని వారు చెప్పారు. స్పందించిన షర్మిల ఆ ఇంటికి వెళ్లి పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ.. జగనన్న అధికారంలోకి వచ్చిన వెంటనే ఇళ్ల నిర్మాణాలను పూర్తిచేసి ఆదుకుంటాడని హామీ ఇచ్చారు.

నేతల సంఘీభావం: షర్మిలకు సంఘీభావంగా ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, పార్టీ నేతలు మైసూరారెడ్డి, కొండా సురేఖ, కేకే మహేందర్‌రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, వి. బాలమణెమ్మ, వాసిరెడ్డి పద్మ, సంకినేని వెంకటేశ్వరరావు, లక్ష్మీపార్వతి, నల్లా సూర్యప్రకాశ్‌రావు, జిట్టా బాలక్రిష్ణారెడ్డి, ఎడ్మ కిష్టారెడ్డి, గౌరు వెంకట్‌రెడ్డి, తలశిల రఘురాం, కాపు భారతి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, బండ్ల చంద్రశేఖర్‌రెడ్డి, తిరుమలరెడ్డి, నాగర్‌దొడ్డి వెంకటరాముడు మంగళవారం యాత్రలో పాల్గొన్నారు.

Related Posts Plugin for WordPress, Blogger...