ఇదేనా ప్రతిఫలం...
ఇదేనా ప్రతిఫలం...
సోనియా గాంధీ అహంకార, అధికార పొగరుకి బలిచేయబడ్డ వ్యక్తి జగన్. ఇది జగమెరిగిన సత్యం. కిరీటం లేని అనధికారిక మహారాణిగా వెలుగొందుతున్న సోనియాగాంధీ, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ తొత్తుగా, ఆ పార్టీ అడుగులకు మడుగులొత్తే సీబీఐని పావుగా ఉపయోగించుకుంటోంది. ఇచ్చిన మాట కోసం నిరంతరం తపిస్తూ... విలువలకు, విశ్వసనీయతకు, గుండెధైర్యానికి నిలువెత్తు నిదర్శనమైన జగన్‌ని కుట్ర, కుతంత్రాలతో అరెస్ట్ చేసి అక్రమంగా జైలులో పెట్టారని సామాన్యుడికి సైతం అర్థమైంది. జవజీవాలు కోల్పోయి, జీవచ్ఛవంలా మారి కనుమరుగైన కాంగ్రెస్ పార్టీకి తిరిగి జీవం తీసుకువచ్చే నాయకత్వం కనుచూపు మేరలో కనిపించని సమయంలో, ‘నేనున్నాను’ అంటూ మండుటెండలను సైతం లెక్కచేయకుండా సుమారు 1600 కి.మీ. పాదయాత్ర చేసి, ప్రాణాలను సైతం పణంగా పెట్టి మరీ కాంగ్రెస్ పార్టీని 2004 అధికారంలోకి తెచ్చిన నాయకుడు వై.ఎస్.రాజశేఖరరెడి. అదే ఒరవడిని కొనసాగిస్తూ తిరిగి 2009లో ‘ఓటమైనా, గెలుపైనా నాదే బాధ్యత’ అని అన్ని బాధ్యతలు తన భుజాలపై వేసుకుని రాష్ట్రంలోను, కేంద్రంలోను ఆరోజు కాంగ్రెస్‌కు అధికారాన్ని కట్టబెట్టిన ధీరోదాత్తుడు వైఎస్‌ఆర్. ఆయనిచ్చిన 32 మంది ఎంపీలతోనే కదా సోనియాగాంధీ అధికారాన్ని అనుభవిస్తోంది. అటువంటి వై.ఎస్.ఆర్ కుటుంబానికి ఇచ్చే ప్రతిఫలం ఇదేనా? మాట తప్పని గుణానికి ఇచ్చే గౌరవం ఇదా? మనది ప్రజాస్వామ్యమా? నియంతృత్వమా? ఒక్కసారి ఈ నాయకులంతా ఆత్మావలోకనం చేసుకోవాలి. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు, వారిని తన చెప్పుచేతల్లో నడిపిస్తున్న సోనియాగాంధీకి గుణపాఠం చెప్పేరోజు ప్రజలు నిర్ణయిస్తారని, తగిన సమయంలో బుద్ధి చెప్తారని గ్రహించండి.ఏనాడూ ఇంటి గుమ్మం దాటని వైఎస్‌ఆర్ కుటుంబంలోని ఆడపడుచులను నడిరోడ్డుపై కన్నీరు పెట్టుకునేలా చేశారు. ఈ నియంతృత్వానికి చరమగీతం పాడటానికి జనం ఎదురుచూస్తున్నారు.అతి చిన్న వయసులోనే జాతీయ రాజకీయాలను ప్రభావితం చేస్తూ, జన హృదయాలను గెలుస్తూ, ఇచ్చిన మాటకు కట్టుబడి ఎంత కష్టాన్ని అయినా భరించే గుండె ధైర్యానికి నిలువెత్తు నిదర్శనమైన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిగారిని ఏ శక్తీ ఆపలేదు. ఆయన వెలుగును ఆపటం ఎవరి తరం కాదు. మనసుకు రాజూ ఆయనే... కాబోయే మహారాజూ ఆయనే.- సొంగా చందన్, గిరిపురం, విజయవాడ
No comments:
Post a Comment