Monday, October 29, 2012

ఎందుకు అడుగుతారు నన్ను జగన్ అంటే నీకు ఇష్టం అని?

తండ్రి దుర్మరణంతో పుట్టెడు దుఃఖంలో ఉన్నప్పటికీ తండ్రిని ప్రేమించి ప్రాణమిచ్చే ప్రజల కన్నీటిని తుడవడానికి, దుఃఖాన్ని తనలో దిగమింగుకుని లాల్‌బహదూర్ స్టేడియంలో ప్రజలకు అభివాదం చేస్తూ తరలివెళ్లిపోతున్న జగన్‌లో నాడే ఒక నాయకుడు కనబడలేదా? 

తండ్రి చనిపోయిన వారంలోనే తన తండ్రితోపాటు చనిపోయిన వ్యక్తుల కుటుంబ సభ్యులను పలకరించిన జగన్‌లో ఒక కుటుంబ పెద్ద కనపడలేదా?

తన తండ్రి మరణవార్త విని చనిపోయిన వందలమందిని నేను స్వయంగా కలుస్తాను అని చెప్పి, వద్దని వారించినా సోనియాను ఎదిరించిన నాడు జగన్‌లో తనవారికోసం తెగించి పోరాడే వీరుడు కనపడలేదా? తన తల్లితోపాటు సోనియాను కలిసి, తాము ఎందుకు ఓదార్పుయాత్ర చేస్తున్నామో చెపుతుంటే, తన తల్లి ఏడుస్తూ అభ్యర్థిస్తుంటే, చీత్కారంగా చూసిన దేశ అత్యున్నత మహారాణి సోనియాపై తిరగబడాలని నిర్ణయించుకున్నప్పుడు నా తెలుగు గడ్డ రాయలసీమ పౌరుషం కనపడలేదా?

ఇంకా ఎందుకు అడుగుతారు నువ్వెందుకు జగన్‌ని పిచ్చిగా ప్రేమిస్తావని? రెండున్నరేళ్లు రాత్రీ, పగలూ కాలికి చక్రాలు ఉన్నట్టు ఆంధ్రదేశాన్ని చుట్టి, ప్రతి గాయపడ్డ గుండెకూ ధైర్యం చెప్పిన జగన్‌లో మీకు మనసున్న మారాజు కనపడలేదా? ప్రతి పేదవాడి చెవికీ జగన్ అనే మాట వినపడగానే గుండెలో భావోద్రేకం, కళ్లలో మెరుపు పెల్లుబుకుతుంటే తెలియడం లేదా? నేనెందుకు జగన్‌ని శ్వాసిస్తూ ఉన్నానో?

ఇంకా అడుగుతారా నేనెందుకు జగన్‌ని ఇష్ట పడుతున్నానో..? కులాల కట్టుబాట్లు చీల్చుకుని, గుండెలో పేరుకుపోయిన ద్వేషాన్ని కడిగేసుకుని ముందుకు చూడు, స్వచ్ఛమైన పేదవాడి కళ్లలో చూడు జగన్ అంటే అతనికి ఎందుకు ఇష్టమో? అప్పుడు అర్థమవుతుంది నేను ఎందుకు జగన్‌ని ఇష్టపడుతున్నానో!!!

- గోపాల్ గోరంట్ల, సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్,
మోఫస్ట్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...