Friday, October 19, 2012

జగనన్న వచ్చిన రోజే నిజమైన పండుగ రోజు

నేను, మానాన్న ఇద్దరమూ వికలాంగులమే. రాజశేఖరరెడ్డిగారు అధికారంలోకి వచ్చినప్పటి నుండి మాకు వికలాంగుల పింఛను వస్తోంది. అందుకే ఆయన చనిపోయిన రోజు అనగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 2వ తేదీన నేను అన్నదాన కార్యక్రమం చేస్తున్నాను. రాజశేఖరరెడ్డిగారు చనిపోయిన తరువాత ఓదార్పుయాత్రలో భాగంగా జగనన్న మా గ్రామానికి వచ్చారు. అప్పటి నుండి నాకు జగనన్న మీద ప్రేమ, ఇష్టం కలిగాయి. జగనన్నను జైలులో వేశారని ఒక రోజు అన్నం కూడా తినలేదు. కండలేరు దగ్గర జగనన్న కళ్లకు ఇన్‌ఫెక్షన్ వచ్చినప్పుడు మానాన్న, ‘జగనన్నకు ఒకవేళ కన్నుపోతే కన్ను ఇస్తావా’ అని అడిగితే, నా ప్రాణమైనా ఇస్తానని చెప్పాను. అంతగా ఇష్టం జగనన్న అంటే నాకు. 

జగనన్నకు ఓదార్పుయాత్రకు పర్మిషన్ ఇవ్వకపోగా, సంబంధంలేని కేసుల్లో ఇరికించారు. నాయకులందరూ కలిసి మన జగనన్నకు బెయిల్ రానీయకుండా చేస్తున్నారు. 2014లో ఇంతకంటే మెజారిటీ సీట్లతో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెస్తానన్న వైఎస్సార్ మాటను నిలబెట్టే నాయకుడు కాంగ్రెస్‌పార్టీలో ఒక్కరూ లేరు. ఆ శక్తి కలిగిన ఏకైక నాయకుడు జగనన్న మాత్రమే. అందుకే కాంగ్రెస్‌లో కొంతమంది కలిసికట్టుగా ఆయన మీద కుట్రపన్నారు. ఎన్ని కుట్రలు పన్నినా జగనన్న మాత్రం ఎంతోమంది తల్లుల ఆశీర్వాదంతో జైలు నుండి నిర్దోషిగా బయటకు వస్తాడు. తప్పకుండా సిఎం అవుతారు. ఇది ప్రజలందరి నమ్మకం. 

- పి.వెంకటేశ్వర్లు రెడ్డి, హసనాపురం,శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...