కాంగ్రెస్, టీడీపీ, సీబీఐ, ఇతర శక్తులు ఎన్నాళ్ళో జగనన్నకు బెయిల్ రాకుండా ఆపలేరు. ఈ శక్తులన్నీ కలిసి కుట్రలు, కుతంత్రాలతో బెయిల్ ఆపగలుగుతున్నాయి గాని, వారి మంచితనమో జగన్ చెడ్డతనమో కాదు. ఏ సంబంధమూలేని, ఏ ప్రొటోకాల్ ప్రాతినిధ్యం లేని జగన్‌ని కేసులలో ఇరికించి దాన్ని సాగదీయడమేంటి? ఆ కేసుకు సంబంధించిన మంత్రులు సబిత, పొన్నాల, ధర్మానలను వదిలిపెట్టడమేంటి?
![]() పేదవాడికి దగ్గరైన ఏ నాయకుడికైనా కష్టాలు తప్పవు. కానీ అవి ఎప్పుడూ శాశ్వతం కాదు. జగనన్న కష్టాలు కూడా అంతే. కష్టాలు తీరే రోజు వస్తుంది. స్వర్ణయుగం తప్పకుండా వస్తుంది. మాట నిలబెట్టుకోవడం, మడమ తిప్పకపోవడం అనే లక్షణాలు నాయకులందరిలో ఉండవు. జగన్‌కి తప్ప మరెవ్వరికీ మాట నిలబెట్టుకునే ధైర్యం లేదని గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పగలను. ఎన్నికల సభల్లో, బహిరంగ సభల్లో మైకు దొరికింది కదా అని, నాలుక ఏది చెబితే అది మాట్లాడుతున్నారు కొందరు నాయకులు. ఎవరే ది చెప్పినా ప్రజలు నమ్మే స్థితిలో లేరు. ఇప్పుడు ప్రజలు వైయస్‌ఆర్ పార్టీని గుండెలో పెట్టుకుంటున్నారు. ఇందులో సందేహం లేదు. - పి.వి.వరప్రసాద్, రాజంపేట్, వైయస్‌ఆర్ జిల్లా మంచిరోజులు వస్తాయి... మంచిపై చెడు కుట్ర చేయడం కొత్త కాదు. తాత్కాలికంగా ఆనందపడడం కూడా కొత్త కాదు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్నది ఇదే. ప్రజల గుండెల్లో కొలువున్న జగన్‌పై కుట్రలు జరుగుతున్నాయి. ప్రజాద్రోహులు సంతోషంగా ఉన్నారు. వారి సంతోషం స్వల్పకాలమే. చరిత్రలో ఎప్పుడూ మంచి మాత్రమే జయించింది. రేపు జరగబోయేది కూడా అదే. పాండవులపై కౌరవులు ఎన్నో కుట్రలు, కుతంత్రాలు చేశారు. అడవులకు పంపించి కష్టాలపాలు చేశారు. ఎన్ని చేసినా వారి ధైర్యాన్ని మాత్రం ఏమీ చేయలేకపోయారు. అంతిమంగా కౌరవులందరూ కురుక్షేత్రంలో ప్రాణాలు కోల్పోయి పాండవులు మాత్రమే చరిత్రలో రాజులుగా వెలుగొందారు. కాంగ్రెస్ వారు కౌరవుల వంటివారు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా అంతిమంగా జగనన్న గెలుపొందుతాడు. చరిత్రలో తన తండ్రిలాగే ఓటమి ఎరుగని ధీరునిగా నిలిచిపోతాడు. అలనాడు సత్యహరిశ్చంద్రుడు తను ఇచ్చిన మాట కోసం తన రాజ్యాన్ని, భార్యను, బిడ్డను అందరినీ పోగొట్టుకున్నా... ఇచ్చిన మాట నిలబెట్టుకుని చరిత్రలో నిలిచిపోయారు. జగనన్న కూడా నల్లకాల్వలో ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి, కేంద్రమంత్రి పదవి ఆశ చూపినా లొంగిపోలేదు. ఆడినమాట తప్పలేదు. తన తండ్రి కోసం మరణించిన వారి కుటుంబాలకు ‘నేనున్నాను’ అంటూ ఇంటి పెద్ద కుమారునిగా భరోసా ఇచ్చి, వారిని ఓదార్చిన ధీశాలి. కోట్లాది ప్రజలు ఎన్నికలు ఎప్పుడు వస్తాయా? ఎప్పుడు ఓటు అనే వజ్రాయుధంతో జగనన్నను శాశ్వత ముఖ్యమంత్రిగా చేసుకోవాలా? అని కోట్ల కళ్లతో ఎదురు చూస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాలతో రాష్ట్రప్రజలందరూ లబ్ధి పొందారు. అది నాయకులు మరచినా ప్రజలు మరవరు. భవిష్యత్తు అంతా జగనన్నదే. జగనన్న రాజ్యం రావడం ఎంతో దూరంలో లేదు. - జె.శకుంతల, కదిరి, అనంతపురం |
Sunday, October 28, 2012
స్వర్ణయుగానికి ముందు ఇవన్నీ పరీక్షలే...
Labels:
jagankosam
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment