Thursday, November 1, 2012

ఆ సంహారం కోసం...

అయోధ్య రాముడిదేనన్న సత్యం ప్రజలకు తెలుసు! కానీ ‘రావణ సంహారం’ అనే ఒక మహత్తర కార్యం దేవుడికే తెలుసు! నిజానికి ఈ రాష్ట్రంలో... ఈ దేశంలో... రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత అనేది తుడిచిపెట్టుకుపోతున్న కాలంలో విశ్వసనీయత అనే గొప్ప పదానికి అర్థం కల్పించిన మహనీయుడు డా. వైయస్ రాజశేఖరరెడ్డి. రాజకీయనాయకుల హామీలు, మాటలు జనం నమ్మలేని పరిస్థితికొచ్చారు. ‘ఏరు దాటేవరకు ఏటి మల్లన్న - ఏరు దాటాక బోడిమల్లన్న’ అన్న చందంగా పదవులు లభించాక అయిదు సంవత్సరాల వరకు జనాన్ని పట్టించుకునే వారే కరవైన తరుణంలో జనంకోసం నిరంతరం శ్రమిస్తూ వారి సంక్షేమం కోసం ఆలోచించిన వ్యక్తి వైయస్ రాజశేఖరరెడ్డి. అందుకే జనానికి ఆయనంటే ప్రాణం! వల్లమాలిన అభిమానం! బహుశా ఆ అభిమానంతోనే జనం ఆయన కుమారుడిని ఆదరించి అభిమానించారు.

ఇది రాజకీయ విషనాగులకు రుచించలేదు. ఆయన మరణానంతరం ఆయన కుమారుడిపై తప్పుడు కేసులు బనాయించి ఒక అసత్యాన్ని సత్యం చేయాలని ప్రయత్నిస్తూ ఏ ఆధారం దొరక్క కోర్టుల్లో ‘బెయిల్ దొరకని కేసుగా’ సీబీఐతో ఒక మహానాటకం ఆడిస్తూ రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. ఒక మహాకుట్ర ‘పాతకం’ ఈ రాజకీయ నాయకులకు అంటకపోతుందా? రానున్న కాలంలో దైవతీర్పు ఎలా ఉండబోతోందో ఈ రాష్ట్ర ప్రజలు తప్పక చూస్తారు. జగన్‌ని జైల్లో పెట్టామనే తాత్కాలిక భ్రమ, భ్రాంతి ఈ రాజకీయనాయకుడిని ప్రస్తుతం ఒడ్డున పడేలా అసలు పరీక్షాకాలం ముందే ఉంది. అమాయకుల కొంప కూల్చి తమ కొంప నిలుపుకోవాలంటే దేవుడు హర్షిస్తాడా?

- కె. పద్మావతి, ఉప్పల్, రంగారెడ్డిజిల్లా

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...