Wednesday, February 6, 2013

ప్రజాభిమానం పొందడమే నేరమయిందా?!


స్వార్థ రాజకీయ నాయకులు ఒక పథకం ప్రకారం వై.ఎస్.జగన్‌ని ఒంటరిని చెయ్యాలని చూసినా ప్రజల ఆదరాభిమానాలు మాత్రం పూర్తిగా ఆయనకే ఉన్నాయి. ఓదార్పుయాత్ర చేపట్టడం, ప్రజల కన్నీటిని తుడవడం జగన్ చేసిన నేరమా? నిజానికి ప్రజానేత వైఎస్సార్ మరణంతో జగన్‌కన్నా ఎక్కువ నష్టపోయింది, బాధతో కుంగి కృశించిపోయిందీ ప్రజలే. ఆ వాస్తవాన్ని గ్రహించిన జగన్, వారి కన్నీటిని తుడిచి సహాయపడిన తీరును అభినందించడం మాని, అవమానాలపాలు చేయటానికి ప్రయత్నిస్తున్న ఈ రాజకీయ నాయకుల కుటిల రాజనీతికి ఏమని పేరు పెట్టాలో తెలియడం లేదు! 

జగన్‌పైన విమర్శలు చేసేవారు ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. మీ రాజకీయ జీవితాలు వెలిగించింది జగన్ తండ్రి వైఎస్సార్ కాదా? ఆ మహానేత వారసత్వాన్ని, సమర్థతను అందిపుచ్చుకున్న ఆయన కుమారుడి వ్యక్తిగత, రాజకీయ జీవితాలకు అవినీతి అనే మసిని పూయాలని ఎందుకు ప్రయత్నిస్తున్నారు? జగనన్న తన దక్షతతో ఆర్థికంగా అభివృద్ధిని సాధించడం తప్పా? అలా సంపాదించిన డబ్బును ప్రజాసేవ కోసం వినియోగించడం నేరమా? రాజకీయ అనిశ్చితి ఏర్పడిన తరుణంలో ప్రజల కష్టాలు తీర్చడం కోసం మరో వైఎస్సార్‌లా ప్రజల అండతో రాజకీయ పార్టీని స్థాపించడం నేరమా? దుఃఖసాగరంలో మునిగిపోయిన ప్రజలకు అండగా ఉండి, వారిని ఆదుకోవడానికి ఓదార్పుయాత్ర చేపట్టడం పాపమా? ఎందుకు ఆయన్ని అక్రమంగా నిర్బంధించారు? జగన్‌కు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు. ఆయన్ని వేధిస్తున్నవారిని ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పేందుకు ఎదురుచూస్తున్నారు.

- కొమ్మూరి చంద్ర, ఆకురాతిపల్లి, కడప జిల్లా

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...