వైఎస్సార్‌గారు పాదయాత్రలు చేసి, ప్రజలతో మమేకమై అటు కేంద్రంలోను, ఇటు రాష్ట్రంలోను రెండుసార్లు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారు. ఆయన బతికున్నప్పుడు ఇంద్రుడు చంద్రుడు అని పొగిడిన రాజకీయాధినేతలు... మరణించాక ఆయనను, ఆయన కుటుంబాన్ని విమర్శించటమే పనిగా పెట్టుకున్నారు. క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం కీడుకు ప్రతిగా మేలు, దయ, క్షమాగుణాలు కలిగి ఉన్న కుటుంబం అది. అందుకే తమపై అన్యాయంగా నిందలు వేస్తూ, వేధిస్తున్న వారిని కూడా క్షమించి వదిలేశారు.

వైఎస్సార్ పేద బడుగు బలహీన వర్గాలవారికి ఎన్నో సంక్షేమ పథకాలను అమలుపరిచి, ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఎందరికో గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, కిడ్నీల వంటి వ్యాధులకు ఉచితంగా వైద్యం చేయించారు. పేదల పాలిటి పెన్నిధిగా నిలిచిన తండ్రిని స్ఫూర్తిగా తీసుకుని, ఆయన మరణంతో వ్యధ చెంది ఆత్మహత్యలు చేసుకున్న బడుగు జీవులను పరామర్శించి, ఓదార్పుయాత్రను రాష్ట్రమంతటా జరిపించి, ప్రజలకు చేరువవుతున్న జగన్‌ని, విజయమ్మని రాజకీయంగా, మానసికంగా ఈ ప్రభుత్వాధినేతలు వేధించటం క్షమించరాని నేరం. ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న యువనేతను నిర్బంధించడం అక్రమం. ప్రభుత్వాధినేతలు, న్యాయాన్ని రక్షించే న్యాయ కోవిదులు, నేర పరిశోధక విభాగంవారు చిత్తశుద్ధితో వ్యవహరించి జగన్‌కు న్యాయం చేకూర్చాలి.
- బలిజేపల్లి లక్ష్మీపద్మావతి
మర్రివేముల, ప్రకాశం
No comments:
Post a Comment