Sunday, February 17, 2013

ఏ మనిషికైనా ఒకటే న్యాయం జరగాలి



‘జగన్ కోసం... జనం సంతకం’ అంటూ సమాజంలో వైఎస్సార్సీపీ ప్రజాభిమానాన్ని స్వీకరించటం ఎంతైనా అభినందనీయం. ‘అసలు కోర్టులు, చట్టాలు ఎలా పుట్టుకొచ్చాయి?’ అనే ప్రశ్న ఉదయించినప్పుడు ప్రజాస్వామ్య దేశంలో సమ సమాజంలో ప్రజల అవసరాలకు తగ్గట్లుగా చట్టాలు, శాసనాలు రూపొందించి, ఒక న్యాయ సమాజాన్ని ఏర్పాటు చేసింది భారత రాజ్యాంగం! అసలు కేసుకు ఏమాత్రం సంబంధం లేని ‘దార్నబోయే దానయ్య’ను తీసుకొచ్చి, చట్టం ముందు జగన్‌కి అవినీతి కేసు ఆరోపిస్తూ అరెస్టు చేసింది. ఆ సమయంలో ‘అసలు జగన్‌కి అవినీతికి పాల్పడే అధికారం లేద’నే విషయాన్ని కూడా గమనించకుండా, సీబీఐ తరపున బెయిలివ్వకుండా తీర్పులివ్వడం దారుణం. 

ఈ సమయంలో ‘సామాజిక ఉద్యమం’ ఒక్కటే వైఎస్సార్సీపీకి మార్గంగా తోస్తోంది. ఎందుకంటే జగన్ అనే వ్యక్తి ఒక అనామకుడు కాదు, ఒక పార్టీ అధ్యక్షుడు. కోట్లాది జనం ఆయన పక్షాన నిలబడటానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజాభిమానం జగన్ సొంతం. అలాంటప్పుడు సమాజంలోనే జగన్‌కి అండగా ‘కొండంత ఉద్యమం’ రావాలి. ఈ ఉద్యమంలో మేధావులు, జర్నలిస్టులు, ప్రజాసంఘాలు అందరూ భాగస్వామ్యం కావాలి. ఎందుకంటే అన్యాయాన్ని ఎదిరించటమే సామాజిక బాధ్యత. అసలు ఏ అధికారంలో ఉన్నాడని జగన్‌ని నేరస్తుడిగా చిత్రీకరిస్తారు? ఒకవేళ తండ్రి సీఎంగా ఉన్నప్పుడు కొడుకుగా జగన్ లబ్ధి పొందాడనుకున్నా, క్యాబినెట్ సమిష్టి నిర్ణయం లేనిదే ముఖ్యమంత్రి ఒక్కడూ ఏం చెయ్యలేడు కదా! 

వారందర్నీ వదిలేసి నేరంతో సంబంధం లేని జగన్ వెంట సీబీఐ పడటం ఏమిటి? క్యాబినెట్ సమిష్టి నిర్ణయాల్లో జోక్యం చేసుకునే అధికారం సీబీఐకి ఉంటుందా? కొన్ని సంఘటనలను పరిశీలిస్తుంటే అసలు సీబీఐ నిష్పక్షపాతంగా తన పని తాను చేసుకుపోతోందా? అన్న సందేహం వస్తోంది. ఉదాహరణకి ఒక హత్య కేసు తీసుకుంటే... తండ్రి హత్య చేశాడని కొడుకుని తెచ్చి జైల్లో పెట్టరు కదా. హత్య చేసినవాడు నేరస్తుడవుతాడు. అసలు హత్య చేసినవాడు మరణిస్తే కేసే తీసేస్తారు. కానీ ఇక్కడ విచిత్రంగా వైఎస్సార్ మరణానంతరం ఆయనను దోషిగా చూపుతూ సీబీఐ ఎఫ్.ఐ.ఆర్. ఫైల్ చేసింది. అసలు నేరంతో ఎలాంటి ప్రత్యక్ష సంబంధం లేని జగన్‌ని నేరస్తుడిగా చూపిస్తోంది సీబీఐ. ఇటువంటి కేసు సభ్య సమాజానికే అవమానం. ఇలాంటి కేసును ప్రోత్సహిస్తున్న రాజకీయ పార్టీలను వంచకులుగా, మోసగాళ్లుగా చూడాలి. ఆ పార్టీలకు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలి.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...