మేడమ్ సోనియాగారూ! అధికారం హాలాహలమని తెలిసి కూడా తమ ఒక్కగానొక్క కుమారుడిని దేశంలోని అత్యున్నత అధికార స్థానంలో ఎందుకు కూర్చోబెట్టాలని తాపత్రయపడుతున్నారు? నూట పదికోట్ల జనాభాలో యోగ్యత కలిగిన ఎవరూ లేరనా? తమరి తనయుడు భావి భారత ప్రధాని అని ఊహకు రాగానే మనసు ఉప్పొంగి ఆనందబాష్పాలను అణచుకోలేకపోయారు. మీ భర్తగారి హఠాన్మరణం తర్వాత మీకు అసలు రాజకీయాలు అక్కర్లేదని ఇంట్లో కూర్చున్నారు. ఎప్పుడైతే అధికారపు కుర్చీలో కూర్చున్నారో ఆ అధికార దాహం ఎక్కువై, దాని దరిదాపునకు కూడా ఎవరినీ రానివ్వడం లేదు. అర్హత కలిగినవారిని అడ్డు తొలగించుకోవడం, వంగి వంగి దండాలు పెట్టేవారిని అందలమెక్కించటం, ఆ వెనకాల నుండి అధికారం చెలాయించడం మొదలుపెట్టారు. ఇది అప్రజాస్వామికం కాదా?

రాజకీయాల్లో యువతకు సముచిత పాత్రనివ్వాలని రాహుల్‌గాంధీ అన్నారు. మంచిదే. అయితే యువత అంటే ఆయన ఒక్కరేనా? జగన్ కాదా? యువతను అకారణంగా జైల్లో పెట్టించి, రాహుల్ ప్రధానమంత్రి ఎలా అవుతారు? ఒక మాజీ ప్రధానమంత్రి కొడుకు ప్రధానమంత్రి అయితే, ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకు ముఖ్యమంత్రి కాకూడదా? ముఖ్యమంత్రిని చేయటానికి 156 మంది ఎమ్మెల్యేలు సరిపోరా? ఇదేమి ప్రజాస్వామ్యం? దేశానికి రాజీవ్‌గాంధీగారెంతో, రాష్ట్రానికి వైఎస్సార్ కూడా అంతే కదా! అసలు జగన్ చేసిన ఆర్థిక నేరాలేమైనా రుజువు చేశారా? అధికారం ఉన్నదని అన్యాయంగా జైల్లో పెట్టించడమేనా? జగన్‌కు జరిగిన అన్యాయాన్ని ప్రతి ఒక్కరూ గమనిస్తూనే ఉన్నారు. 2014 ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నారు.
No comments:
Post a Comment