Wednesday, February 6, 2013

జరుగుతున్న అన్యాయాన్ని నిస్సిగ్గుగా చూస్తూ కూర్చున్నారు



నేడున్న రాజకీయాలలో అవినీతిలేని పార్టీ ఏదీలేదు, అలాగే అవినీతిలేని నాయకుడూలేడు. అందుకేనేమో జగనన్న ఒక తారాజువ్వలా పైకి లేచి, అవినీతిలేని పరిపాలన ఏంటో చూపిస్తా అని సవాలు విసిరితే ఎక్కడ తమ అవినీతి ప్రజల కళ్లకు కనిపిస్తుందోనని ఈ కాంగ్రెస్, టీడీపీ నాయకులు నిస్సిగ్గుగా జగనన్న పైకే ఎదురు ఆరోపణలకు దిగారు. ఎందుకంటే అవినీతికి పాల్పడందే వారికి నిద్రపట్టదు. అంతేనా? తాము తిరిగి అధికారంలోకి రావాలంటే జగనన్న అడ్డుతొలగాలి. దీనికోసం ‘తిన్నింటి వాసాలు లెక్కపెట్టే నాయకులు’ పార్టీ అధిష్టానానికి జగన్‌పై లెక్కలేని పితూరీలు చెప్పి ఉదయిస్తున్న సూర్యుణ్ణి చీకటిలో కలపాలని పన్నాగాలు వేసారు. 

దీనికితోడు అనేక కుంభకోణాలతో సంబంధమున్న చంద్రబాబు దరిదాపులకు కూడా పోని సి.బి.ఐ అధికారి జేడీ... చంద్రబాబు నిరపరాధి అని సర్టిఫై చేయాలని చూస్తున్నాడు. ఇది నేనొక్కడినే అంటున్న మాట కాదు. నాలాంటి ప్రతి సామాన్యుడు ఇలాగే భావిస్తున్నాడు.

ఇక మన మహిళా మంత్రులు... వై.ఎస్. ఆనాడు తన తోడబుట్టిన వారిగా భావించి ఆడపడుచులకు మంత్రి పదవులిచ్చి వారికి విలువనిస్తే ఇవాళ ఆ మహానుభావుడు లేకపోయేసరికి ఆయన్ని దోషిగా చూపిస్తున్న ప్రభుత్వానికి వారు 
(సురేఖమ్మ మినహా) అండగా ఉండడం నీతి అనిపించుకుంటుందా? ఎవరికీ తెలియని అనామకులను మంత్రులను చేస్తే, ఎమ్మెల్యేలను, ఎంపీలను చేస్తే ఇప్పుడు వారు అధికార దాహంతో ఆ మహానేతనే నిందిస్తారా? అయితే త్వరలోనే ఈ వేధింపులన్నిటికీ తెర పడుతుంది. జగనన్న విడుదలౌతాడు. ప్రజలు బ్రహ్మరథం పడతారు. 

- బి. వినయ్‌కుమార్, గణపవరం, ప.గో.జిల్లా

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...