నేను వైఎస్సార్ అభిమానిని మాత్రమే కాదు, జగన్ కోసం ప్రాణాలర్పించే తమ్ముణ్ని కూడా. జగన్ పేరు వినగానే అమ్మమ్మ, తాతయ్యల మొహంలో చిరునవ్వు, తల్లిదండ్రుల్లో ‘మా కొడుకు’ అన్న భావన, అన్నదమ్ములకు మరో తోబుట్టువు అన్న ధైర్యం వెల్లివిరుస్తాయి. అలాంటిది ఏ తప్పూ చేయని జగనన్నను జైలుపాలు చేయడం ఈ దుష్ట, నీచ రాజకీయ పరిపాలనకు నిదర్శనం.

ఈ ప్రభుత్వానికి ఒక విషయం అర్థం కావటం లేదు, మేం ఓట్లేసి గెలిపించింది సోనియాను చూసి కాదు, మా వైఎస్సార్‌ను చూసి అని. ఆ మహానుభావుడు రాష్ట్ర ప్రజలకు చేసిన పనులు చూసి. ఆరోగ్యశ్రీ, పింఛన్లు, ఫీజ్ రీయింబర్స్‌మెంట్, ఇందిరమ్మ ఇళ్లు, 108, ఉచిత విద్యుత్తు... ఇలా ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి ప్రతి పేదవాడికీ నేనున్నాననే ధైర్యాన్ని నూరిపోశాడు. ఆయన చనిపోయాక మమ్మల్ని ఎవరు ఆదుకుంటారో అని కుంగిన సమయంలో ‘నేనున్నాను’ అంటూ మమ్మల్ని ఓదార్చి మాకు అండగా ఉన్న మా జగనన్నను జైల్లో పెట్టారు. ఇంకా ఈ ప్రభుత్వం, ఢిల్లీ పెద్దలు ఏమి చేయాలనుకుంటున్నారు?! వైఎస్సార్‌ని దోషిని చేశారు. జగనన్నని జైల్లో పెట్టారు. బెయిల్ రాకుండా అడ్డుకుంటున్నారు.
అసలు జగనన్న చేసిన తప్పేమిటి? ఇచ్చిన మాటకు కట్టుబడి ఓదార్పుయాత్ర చేయటమా? విద్యార్థుల కోసం ఫీజు దీక్ష చేయటమా? రైతన్నల కోసం రైతు దీక్ష చేయటమా? కాంగ్రెస్ పార్టీని వీడి సొంత పార్టీ పెట్టడమా? చనిపోయినవారి కుటుంబ సభ్యుల కన్నీరు తుడవడమా? ఏం నేరం చేశాడని జైల్లో పెట్టారు? ఇవేవీ కావు. జగనన్న ఓ ప్రజానాయకుడు. ప్రజలు మెచ్చి, కోరుకునే నిజమైన నాయకుడు. జగన్ ‘పేదల పెన్నిధి’. కోర్టు వారికి నా మనవి: అయ్యా! నిస్వార్ధంగా సేవచేసే మా జగనన్నకి వెంటనే బెయిల్ మంజూరు చేయవలసినదిగా కోరుకుంటున్నాం. జగన్‌ను విడుదల చేయండి. మంచిని కాపాడండి.
- దండే మధుకృష్ణ, పెంటపాడు, ప.గో.
No comments:
Post a Comment