సోనియా రాజకీయ కుట్రల వల్లే జగన్ ఇన్ని ఇబ్బందులకు గురవుతున్నారని మేము బలంగా నమ్ముతున్నాం. నేను అభిమానించే నాయకుల్లో మొట్టమొదటివ్యక్తి డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్, రెండోవ్యక్తి రాజీవ్‌గాంధి. మూడోవ్యక్తి వైఎస్సార్. ఇందిరాగాంధీ కుటుంబం అన్నా కూడా మాకు చాలా అభిమానం. అటువంటిది సోనియాని చూసి గాంధీ కుటుంబం అంటేనే చిరాకు పుడుతోంది. గుంటనక్కల్లాంటి నాయకుల మాటలు విని ఆమె వై.ఎస్. కుటుంబాన్ని దూరం చేసుకున్నారు. అంతేకాకుండా ఆ కుటుంబాన్ని ఎన్నో కష్టాలపాలు చేశారు.

మాకు అర్థం కాని సంగతి ఒక్కటే. జగన్ కాంగ్రెస్‌లో ఉంటే నీతిపరుడు. బయటకు వస్తే అవినీతిపరుడా? ఎంత అన్యాయం?! జగన్ సహనం, దయ కలవాడు కాబట్టి అన్నీ తట్టుకుంటున్నారు. మిగతా రాజకీయ నాయకుల మాదిరిగా ఆయనకు ప్రజల పట్ల అమర్యాద కాని, కోప స్వభావం కాని లేవు. వైఎస్సార్‌ని ప్రేమించే ప్రతి హృదయం వైఎస్సార్ పార్టీ వెంట తప్పక ఉంటుంది. ఆయన ఆశీస్సులు, ప్రజల ఆశీస్సులు, దేవుని ఆశీస్సులు జగన్‌కు ఉంటాయి. త్వరలోనే ఆయన ప్రజల మధ్యకు వస్తారు.
- పోతుల వీరవెంకట సత్యనారాయణ, తోటపేట, ద్రాక్షారామం, తూ.గో.
No comments:
Post a Comment