Saturday, December 1, 2012

ప్రత్యర్థుల్లో దడపుట్టిస్తున్న పాదయాత్ర...

భారతదేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో సుదీర్ఘ పాదయాత్ర చేపడుతున్న ఓ మహిళగా వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కుమార్తె, జగన్ సోదరి షర్మిల నూతన అధ్యాయనం సృష్టించారు. కడప జిల్లా ఇడుపులపాయ నుంచి షర్మిలమ్మ చేస్తున్న పాదయాత్రకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోంది. ఈ స్పందనను చూస్తున్న ప్రత్యర్థి పార్టీల నాయకుల గుండెల్లో దడ ప్రారంభమైంది. విశ్వసనీయతకు మారుపేరైన కుటుంబం నుంచి వచ్చిన ఆడపడుచుగా ఎండనక, వాననక, కాళ్లు నొప్పులు పెట్టినా ఆ బాధను దిగమింగుతూ ప్రజలు పడుతున్న కష్టాలను, బాధలను ప్రత్యక్షంగా తెలుసుకుంటూ వారికి భవిష్యత్‌పై భరోసాను ఇస్తూ షర్మిలమ్మ ముందుకు కదులుతున్నారు. తన అన్న జగన్‌ను అన్యాయంగా జైలులో పెట్టినా పార్టీని ముందుకు తీసుకెళ్లాలని, ప్రజల కష్టాలు తెలుసుకోవాలనే ఉద్దేశ్యంతో ఆమె చేపట్టిన ‘మరో ప్రజా ప్రస్థానం’ అద్భుతంగా కొనసాగుతుంది. 

ఈ యాత్రకు రైతులు, చేనేతన్నలు, వ్యాపారులు, దినసరి కూలీలు, కౌలురైతులు, నిరుద్యోగులు, వికలాంగులు ఆయా వర్గాల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఈ యాత్రకు వస్తున్న స్పందన చూసి కాంగ్రెస్, టీడీపీ, వామపక్ష పార్టీల నాయకులు లేనిపోని బురద జల్లుతున్నారు. ఇదిలా ఉండగా జగన్ బెయిల్ పిటీషన్ వేసిన ప్రతిసారి ఏదో వంకతో సీబీఐ బెయిల్ మంజూరు కాకుండా చేస్తోంది. దీంతో ప్రత్యర్ధి పార్టీల నాయకులు నీచపు ఆనందం అనుభవిస్తున్నారు. కానీ వారికి ఓ విషయం తెలియదు. 

పులి బోనులో ఉన్నంత సేపే అంతా ప్రశాంతంగా ఉంటుంది. అది బయటకొస్తే ఎలా ఉంటుందోననేది మాత్రం వారికి తెలియడం లేదు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబు పాదయాత్రతో ప్రజల్లోకి వస్తున్నారు. అయినా ఆయన చేస్తున్న పాదయాత్రకు స్వపక్ష నేతల నుంచే సరైన ఆదరణ కరువవుతుంది. ఆ పార్టీ నుంచే కాక ఇతర పార్టీల నుంచి రోజుకు వందల సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు వైఎస్సార్‌సిపిలో చేరుతున్నారు. మరోవైపు రాష్ట్రా, కేంద్ర ప్రభుత్వాలు ఎప్పుడు కూలుతాయో తెలియని ధైన్యస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఏదేమైనా టీడీపీ, కాంగ్రెస్‌లు జగన్‌పై, వైఎస్సార్పీపై ఎన్ని కుట్రలు పన్నినా ప్రజలు తగిన సమయంలో తగిన విధంగా బుద్ధి చెప్పేందుకు ఎదురుచూస్తున్నారు. జగన్ త్వరలోనే విడుదలవుతాడు. ప్రజల మధ్యనకొచ్చి వారి కష్టాలను తెలుసుకంటాడని ఆశిస్తూ ఓ వీరాభిమాని...

- జీఎన్‌కే భిక్నూర్ ఎల్లారెడ్డి, నిజామాబాద్

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...