మధ్యాహ్నం 4.38 గంటలకు షర్మిల కోళ్ల పడకల్‌లోకి ప్రవేశించి రంగారెడ్డి జిల్లాలో యాత్ర ప్రారంభించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యనిర్వాహక కమిటీ సభ్యుడు దేప భాస్కర్‌రెడ్డి, సురేఖ దంపతులు షర్మిలకు పుష్ప గుచ్ఛమిచ్చి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రజలు భారీ ఎత్తున తరలిరావడంతో తోపులాట చోటు చేసుకుంది. అక్కడి నుంచి దాదాపు 8 కిలో మీటర్ల మేర జిల్లాలో యాత్ర సాగింది. మన్‌సన్‌పల్లి వద్ద ఏర్పాటు చేసిన రాత్రి బసకు 8 గంటలకు షర్మిల చేరుకున్నారు. మంగళవారం మొత్తం 16.50 కి.మీ మేర యాత్ర సాగింది. ఇప్పటివరకు మొత్తం 772.80 కిలోమీటర్ల యాత్ర పూర్తయ్యింది. మహబూబ్‌నగర్ జిల్లాలో 20 రోజుల పాటు 94 గ్రామాల మీదుగా 290.70 కి.మీ మేర షర్మిల పర్యటించారు. మంగళవారం షర్మిల యాత్రలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి, పార్టీ నాయకులు కేకే మహేందర్‌రెడ్డి, జిట్టా బాలకృష్ణారెడ్డి, ఎడ్మ కిష్టారెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, రాజ్‌ఠాకూర్, బాజిరెడ్డి గోవర్ధన్, జనక్ ప్రసాద్, పుత్తా ప్రతాప్‌రెడ్డి, బెక్కరి జనార్దన్‌రెడ్డి, గట్టు రామచంద్రరావు, సంకినేని వెంకటేశ్వరరావు, గౌరు వెంకట్‌రెడ్డి, వాసిరెడ్డి పద్మ, తలశిల రఘురాం, కోటింరెడ్డి వినయ్‌రెడ్డి, ఆదం విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment