రాష్ట్రాన్ని జనరంజకంగా పరిపాలించి రామరాజ్యానికి కృషి చేస్తూ అకాల మృతి చెందిన దివంగత నేత రాజశేఖరరెడ్డి లేనిలోటు తీర్చలేనప్పటికీ, తండ్రి ఆశయాలు కొనసాగించాలని ప్రజలంతా ఆకాంక్షిస్తున్న ఆయన తనయుడు జగన్‌పై అపవాదులు వేసి అణచి వేసే కుట్రను కాంగ్రెస్ నాయకులు పన్నడం అందరికీ తెలిసిందే! సీబీఐ మోపిన అభియోగాలనుంచి అపవాదులనే కష్టాల కొలిమిలో కాలి మేలిమి బంగారంలా జగన్ బయటపడే రోజు రాక మానదు. ఇక అడ్డదారిలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబుకు, ప్రస్తుత సి.ఎం. కిరణ్ కుమార్‌కు పెద్ద తేడా కనిపించడం లేదనిపిస్తోంది.
జనంలోకి చొచ్చుకు వెళ్లి కనీసం ఒక లక్షమందిని స్వప్రయోజకత్వంతో సమీకరించగల సత్తా పాలించే నాయకుడికి గానీ, ప్రధాన ప్రతిపక్షనేతకు లేదన్నది చేదునిజం. ఒళ్లు అలవకుండా అధికారం ఒళ్లో పడాలన్న పేరాశ పడితే కూడా మిగిలేది భంగపాటే. పతన మార్గంలో ప్రయాణిస్తున్న కాంగ్రెస్ సర్కారును వచ్చే ఎన్నికల్లో ప్రజలు రాజకీయ గాఢాంధకారంలోనెట్టి వేయక మునుపే వై.ఎస్. ఆశయాలను కొంతమేర సాఫల్యం చేయడానికి ప్రయత్నిస్తే చరిత్ర హీనులుగా కాకుండా ఉంటారు. చివరికి చెప్పేదేమిటంటే జగన్‌ని అడ్డుకోవడానికి కుట్రలు, కుతంత్రాలు జరుగుతున్న కొద్దీ జగన్ వెంట నడిచే ప్రజల సంఖ్య లక్షలు, కోట్లగా పెరుగుతూనే ఉంటుంది.
- భూపతిరాజు అచ్యుతరామరాజు, భీమిలి
No comments:
Post a Comment