
సూర్యుడై వస్తున్నాడు..
పోరాడే ధీరుడు ఎపుడూ.
పేదోళ్ల పెన్నిధి చూడు..
వైయస్‌ఆర్ వారసుడతడు.
నమ్మకానికతడే సుతుడు
నమ్ముకున్న వారికి హితుడు
విశ్వాసం అనే మాటకు
అక్షరాల కూర్పే అతడు
ప్రజలే తన ఐదో ప్రాణం
సహనమతని పంచమ వేదం
నియంతల మెడలను వంచే
దిగంతాల నాయకుడతడు
మాట తప్పని యోధుడు రేడు
మడమ తిప్పేవాడే కాడు
అవధులెన్ని ఏకం అయినా
వెన్ను చూపి పారే పోడు
విలువలకు వలువలు తొడిగి
శీలమన్న వెలుగులు పొదిగి
మాటకోసం మళ్లీ మళ్లీ
జన్మలెత్తి నిలుచుతాడు
ఇంటి ఇంటి గళమైనాడు
రైతు ఇంటి హలమైనాడు
పరుగులెత్తు జలమై పొంగి
పొలాలన్ని తడుపుతాడు
కష్టజీవి తోడైనాడు
నష్ట జీవి నీడైనాడు
లక్ష్యసాధనలో నేడు
లక్షలాది స్వరమైనాడు
అతని పలుకు మంగళవాద్యం
అతని పిలుపు ఆశల తీరం
అవని అంత హరితగ మారే
అతని దారి పుణ్యక్షేత్రం.
- వై.హెచ్.కె. మోహన్‌రావు,
అధ్యక్షుడు, పల్నాడు రచయితల సంఘం, పిడుగురాళ్ల, గుంటూరు జిల్లా
అవధులెన్ని ఏకం అయినా
వెన్ను చూపి పారే పోడు
విలువలకు వలువలు తొడిగి
శీలమన్న వెలుగులు పొదిగి
మాటకోసం మళ్లీ మళ్లీ
జన్మలెత్తి నిలుచుతాడు
ఇంటి ఇంటి గళమైనాడు
రైతు ఇంటి హలమైనాడు
పరుగులెత్తు జలమై పొంగి
పొలాలన్ని తడుపుతాడు
కష్టజీవి తోడైనాడు
నష్ట జీవి నీడైనాడు
లక్ష్యసాధనలో నేడు
లక్షలాది స్వరమైనాడు
అతని పలుకు మంగళవాద్యం
అతని పిలుపు ఆశల తీరం
అవని అంత హరితగ మారే
అతని దారి పుణ్యక్షేత్రం.
- వై.హెచ్.కె. మోహన్‌రావు,
అధ్యక్షుడు, పల్నాడు రచయితల సంఘం, పిడుగురాళ్ల, గుంటూరు జిల్లా
No comments:
Post a Comment