Friday, December 7, 2012

రాజన్న రాజ్యం జగనన్నతో సాధ్యం


దివంగతనేత డా.వైయస్ రాజశేఖరరెడ్డి ఎప్పుడైతే చనిపోయారో అప్పటినుండి ఈ రాష్ట్రానికి శని పట్టింది. ఎందుకంటే ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ఆశయాలను ఈ ప్రభుత్వం తుంగలో తొక్కింది. తన రెక్కల కష్టంతో అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో రెండుసార్లు అధికారంలోకి తీసుకువచ్చిన వ్యక్తి వైయస్‌ఆర్. అటువంటి నేతను అక్రమంగా సంపాదించాడు అంటూ కొందరు కాంగ్రెస్ పెద్దలు, ప్రతిపక్షాలు కుమ్మక్కై ఆయన పేరును ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేశాయి. 

తన తండ్రి కోసం చనిపోయిన కుటుంబాలను ఓదార్చాలని, ఇచ్చిన మాటకు కట్టుబడి పల్లెపల్లె తిరుగుతూ ‘నేను ఉన్నాను’ అంటూ చనిపోయిన కుటుంబాలను ఓదార్చాడు. అలాగే ప్రజా సమస్యలపై పోరాటాలు, దీక్షలు చేస్తూ ఉన్న జగన్ ప్రజలకు మరింత చేరువయ్యాడు. ఇది తట్టుకోలేని పాలకపక్షం, ప్రతిపక్షం, కొన్ని మీడియా సంస్థలు కుమ్మక్కై సీబీఐ అనే ఒక మంత్ర దండాన్ని చేతిలోకి తీసుకుని జగన్‌ను అక్రమంగా అరెస్టు చేశారు. ఒక పక్కన కరెంటు మోతతో, మరోపక్క వంట గ్యాస్ మంట, దానికి తోడు పెట్రోలు వాత ఇంకా నీలం తుఫాను దాటికి గురైన వరి పంట నష్టం వంటి బాధలతో ప్రజలు, రైతులు సతమతమవుతున్నారు. మంత్రి కాని మంత్రి కిరణ్ ముఖ్యమంత్రి అయ్యాడు. 

రాష్ట్రానికి సేవ చెయ్యవలసిన వ్యక్తి ‘ముందుంది మంచికాలం’ అంటూ ఢిల్లీ పెద్దలకు సేవలు చేస్తున్నాడు. ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని నిలదియ్యవలసిన వ్యక్తి అదే ప్రభుత్వంతో కుమ్మక్కై మీడియాను అడ్డం పెట్టుకుని ‘వస్తున్నా మీకోసం’ అంటూ పాదయాత్ర చేస్తున్నాడు. కాని ప్రజలకు కష్టాలు తీరే రోజు త్వరలో రానుంది. దేవుడు మావైపే ఉన్నాడు. రాజన్న రాజ్యం జగనన్నతో సాధ్యం. ఇది జగమెరిగిన సత్యం. జగనన్న అతి త్వరలో బయటకు వస్తాడు. వైయస్‌ఆర్ కుటుంబానికి అండగా మేము ఉంటాం. ‘‘జనం కోసం జగన్, జగన్ కోసం జనం’’ అంటూ జననేత కోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నాం. 

- వైయస్‌ఆర్ అభిమాన సంఘం, జగన్ యువత సంఘం, 
గంపవానిపాలెం, రావికమతం మండలం, విశాఖపట్నం

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...