జగన్... వ్యక్తి కాదు, శక్తి..
మరీ ఇంత అన్యాయమా? చాలా బాధగా ఉంది. ఎంతోమందికి ఆరోగ్యశ్రీతో ప్రాణభిక్ష పెట్టి, మరెంతో మంది విద్యార్థులను ఉచితంగా చదివించి, రైతాంగానికి ఏ కష్టమూ రాకుండా ఆలంబనగా నిలచి; కుల, మత, వర్గ ప్రాంతీయ విభేదాలు లేకుండా రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఏదో ఒక సహాయం అందించి, ధరలు పెరగకుండా చేసి, ఒకవేళ పెంచవలసిన అత్యవసర స్థితి వచ్చినా, సామాన్య ప్రజానీకంపై ఆ భారం పడకుండా చేసి, అంతా బాగుంది అనుకున్న సమయంలో మన ప్రియతమ నాయకుడు, ముఖ్యమంత్రి వై.యస్.రాజశేఖర్‌రెడ్డి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఆ సంఘటన గుర్తుకు వస్తుంటే నేటికీ గుండె పిండేసిన ట్లే ఉంటుంది. ఇంతలో ఒక సమ్మోహన శక్తి.. ఆ రాజశేఖరుని తనయుడు జగన్మోహనరెడ్డి రూపంలో భరోసా ఇస్తూ ముందుకు కదిలింది. అది చూసి చాలా సంతోషించాం. నిజం చెప్పొద్దూ! ప్రతిరోజు దేవునికి మొక్కుకుంటున్నాం. జగనన్న త్వరగా ముఖ్యమంత్రి కావాలి అని.

ఎందుకు జగనన్న మనందరికీ అంతలా నచ్చారు? తను కష్టాలలో ఉన్నా, ఎదుటివారిని ఓదార్చి, ధైర్యం చెప్పడం తెలుసు కనుక. తను అనుకున్న పని చేయడానికి, ప్రజల అవసరాలు తీర్చడానికి.. ధనబలం, అధికార బలంతో విర్రవీగుతున్న శక్తులను ఎదిరించడం తెలుసు కనుక. ప్రజానాడి తెలుసు కనుక. రాష్ట్ర పరిస్థితులు తెలుసు కనుక. ఎంతగా అణగదొక్కాలని చూసినా, అంతకంటే ఎత్తుకు ఎదగడం తెలుసు కనుక!
కుంభకోణాలలో కూరుకుపోయిన ప్రజాద్రోహులు అధికారంతో ఉంటూ బయట తిరుగుతున్నారు. ప్రజాసేవ చేసి, రైతుకి పట్టెడన్నం పెట్టి, వారి బాగోగులు గురించి ఆలోచించిన రాజన్న కొడుకు మాత్రం ఏ తప్పూ చేయకుండానే జైలు గోడల మధ్య బందీగా ఉన్నాడు. బహుశా కలికాలం అంటే ఇదేనేమో?
కానీ జగన్ ఒక వ్యక్తి స్థాయి నుండి ఎప్పుడో ప్రజాశక్తిగా మారిపోయారు. ఇప్పుడు జగనన్నకు ఉన్న కష్టాలన్నీ తాత్కాలికమే. ప్రజలందరూ ఎప్పుడో నిర్ణయించుకున్నారు.. వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని. ప్రస్తుత చరిత్రను నిస్సహాయ సాక్షులుగా చూస్తున్న మనకూ ఒక రోజు వస్తుంది. ఆ రోజు మనమే చరిత్రను మలుపుతిప్పే శక్తులం. మన ఓటు హక్కు వినియోగించుకుని, మళ్లీ జగనన్న సారధ్యంలో ఆ రాజశేఖరుని సువర్ణ యుగంలోకి తప్పక సాగిపోతాం. ఇది ఒక వ్యక్తి సంఘర్షణ మాత్రమే కాదు. రాష్ట్ర ప్రజల అభీష్టం.
- ఎమ్.పవన్ వేణు ప్రకాష్, హైదరాబాద్
No comments:
Post a Comment