Wednesday, December 12, 2012

మా గుండెల్ని బంధించలేరు...

మా గుండెల్ని బంధించలేరు...

కోట్లాది గుండెల్లో కొలువై ఉన్నావయ్యా

మొక్కవోని నీ స్థైర్యం ముందు మోకరిల్లుతున్నామయ్యా...
ఎండనక, వాననక చేపట్టిన
ఓర్పు నేర్పుల కూర్పు ఓదార్పును చూసి
అధికారమే ఆక్సిజన్‌గా బతుకీడుస్తున్న
అధికార, విపక్షాలు కుతంత్రాల మంత్రాంగంతో
నిన్ను బందీని చేసినా
ఎన్నాళ్లీ తతంగం నడుస్తుంది?

జగనన్నా...
జనం గుండె చప్పుడే నీవైనప్పుడు
ఈ తాటాకు చప్పుళ్లు నిన్నేమి చేస్తాయి?

నాలుగు గోడల మధ్య నుంచి బయటకు వచ్చి
జనంతో నీవు మమేకమైతే
అప్పుడు తెలుస్తుంది అర్భకులకు
జగన్‌ను బంధించాం కాని
జనం గుండెలు బంధించలేకపోయానని...

నిజంగా చెబుతున్నా...
ఆ రోజు వస్తుంది
నయవంచన చస్తుంది.
- యాబలూరి సాయిబాబు, పొన్నూరు, గుంటూరు

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...