జగనన్నను అరెస్ట్ చేసి ఇన్ని నెలలు కావస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి అవ్వ, తాత, అన్న- తమ్ముడు, అక్క-చెల్లి అందరూ జగనన్న కోసం ఎదురుచూస్తున్నారు. సింహాన్ని నాలుగు గోడల మధ్య బందీ చేసి కిరణ్‌గారు, బాబుగారు ప్రజలలో తిరుగుతున్నారు. వారు ఎంత తిరిగినా ప్రజల చూపు బోనులో ఉన్న సింహం పైనే. ఎందుకంటే బయట ఉన్నా బోనులో ఉన్నా సింహం పంజా పవర్ తగ్గదు. జగనన్న త్వరలోనే బయటకు వస్తాడు. రాజన్న రాజ్యం అందిస్తాడు అని అందరూ ఎదురుచూస్తున్నారు. వారి ఎదురుచూపులు ఫలిస్తాయి. జగనన్న అందరి ఆశలు నెరవేరుస్తాడు. అందుకే మనందరి ఆశాకిరణం జగనన్న. మార్పుకు నాంది వేసేది మార్పు తెచ్చేది జగనన్నే.
జైల్లో ఉన్నా కూడా జగనన్న కల్మషం కాని మనసుతో హృదయం నిండా ప్రేమ, ఆప్యాయతలు మరిచిపోకుండా ప్రశాంతంగా జీవిస్తున్నారు. కాని బయట ఉన్నా ఈ కుట్రదారులందరూ ప్రజల గురించి ఆలోచించకుండా జగన్‌ను ఎలా అణిచివేయాలా అని ఆలోచిస్తూ అసూయ, ద్వేషం, కుట్ర, కుళ్లు అనే నాలుగు గోడల మధ్య బందీ అయినారు. జగనన్నకు సౌకర్యాలు అని ఒకసారి, ఆస్తులు పోగేశారని ఒకసారి ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. వీళ్లు ఇన్ని చేస్తున్నా జగనన్న ప్రజల మంచి కోసం ఆలోచిస్తూ ప్రశాంతంగా చిరునవ్వుతో పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. అందుకే జై జగనన్న జైజై జగనన్న.
- ఎన్.సువర్ణ, ఎన్.గంగాభవాని, ప్రొద్దుటూరు, వైఎస్‌ఆర్ జిల్లా
No comments:
Post a Comment