నేను మహానేత వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్.ఎస్.యు.ఐ.లో జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేశాను. మహానేత మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీ కుటిల రాజకీయాలు చూసి ఆ పార్టీకి దూరంగా ఉన్నాను. జగనన్నను ఈ రోజు కాంగ్రెస్‌వాళ్లు తెలుగుదేశం పార్టీతో కలిసి అక్రమంగా కేసులు పెట్టి ఈ రాష్ట్రంలో ఎంతోమంది తల్లులకు బిడ్డలాంటి, అక్కలకు తమ్ముడులాంటి, తమ్ముళ్లకు అన్నలాంటి జగనన్నను దూరం చేసి నేరుగా ఎదుర్కోలేక కుట్ర చేస్తున్నారు.
రాజన్న సీఎంగా ఉన్నప్పుడు ఇలా చేశారా? ప్రత్యర్థుల మీద కక్ష కట్టారా? రాజకీయ విలువలు, విశ్వసనీయత ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాజకీయంతోనే ప్రతిపక్షాలను ఎదుర్కొన్నారు. ప్రభుత్వాన్ని ప్రజాసంక్షేమం కోసమే నడిపారు కాని, ఈ కాంగ్రెస్, తెలుగుదేశంలాగ అధికారాన్ని అడ్డుపెట్టుకుని కక్ష్య సాధించి ఉంటే చంద్రబాబు ఈపాటికి చర్లపల్లి జైలులో ఉండేవాడు. కానీ రాజన్న కుటుంబం విలువలకు కట్టుబడి ఉండే కుటుంబం. రాజన్న ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో రాష్ట్రం సస్యశ్యామలంగా ఉన్న రోజుల్లో ప్రతిపక్ష పార్టీలు నానా రాద్ధాంతం చేశాయి. అప్పుడు నాకు అనిపించింది కాయలు కాసే చెట్టుకే రాళ్ల దెబ్బలు అని! 2004లో రాజన్న మహా ప్రజాప్రస్థానం చేపట్టి రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తానని చెపితే అప్పటి అధికార పార్టీ కరెంటు తీగలపైన బట్టలు ఆరబెట్టుకోవాలని ఎద్దేవా చేశాయి. కాని రాజన్న ప్రభుత్వం రైతులకు నిరంతరంగా 7 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చి దమ్ము ఉంటే బట్టలు ఆరబెట్టుకోమని సవాలు విసిరి చంద్రబాబు నోరు మూయించారు. ఈ కిరణ్ ప్రభుత్వం దారుణంగా 3 గంటలు విద్యుత్ ఇస్తున్నా ఇప్పుడు చంద్రబాబు ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదు. కాని జగనన్న ఆ బాధ్యతను తనమీద వేసుకుని విద్యుత్ దీక్ష, ఫీజు పోరు, లక్ష దీక్ష, జల దీక్ష లాంటి వాటి ద్వారా ప్రజల కోసం పోరాడారు. వాటికి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక అక్రమంగా జగన్ అన్నను జైలులో పెట్టారు కానీ జగన్ అన్న ప్రభంజనాన్ని ఎవరూ ఆపలేరు. చంద్రబాబు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని రాజకీయాల నుంచి తప్పించుకోవాలి. లేకపోతే ప్రజలే ఆ పని చేస్తారు. - కోటమీద సురేష్‌రెడ్డి, చిలమత్తూరు, అనంతపురం | ||
Monday, December 10, 2012
వైఎస్ కుటుంబ సంస్కారం...
Labels:
jagankosam
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment