Monday, December 3, 2012

జగనన్నకు జైకొడదాం! (Jai Jai Jagananna)



















కదలిరండి... తరలిరండి
చేయిచేయి కలుపుదాం
జగనన్నకు జైకొడదాం
 
ప్రతి చెల్లి షర్మిలై
ప్రతి అమ్మ విజయమ్మై
ప్రతి అన్న రాజన్నై
కదలిరండి జగనన్నకు జైకొడదాం!

మన పొలం పండాలన్నా
మన కలం రాయాలన్నా
మన ఆకలి తీరాలన్నా
మనకు ఆరోగ్యం కావాలన్నా
జగనన్న పాలనే రావాలిరన్న
మనమంత జగనన్నకు జైకొడదాం

ఈ జగతిని కమ్ముకున్న
అవినీతి అమావాస్యను
తొలగించే చంద్రుడై వస్తాడురా మన జగనన్న
ఈ చీకటి రాజకీయ రాజ్యంలో
వెలుగులు నింపేందుకు సూర్యుడై
వస్తాడురా మన జగనన్నా!

రగిలిపోతున్న ఈ రాక్షస
రాజకీయ రావణ కాష్టాన్ని
ఆర్పేందుకు రాముడై
రాజశేఖరుడై
వస్తాడురా మన జగనన్న!

కదలి రండి తరలి రండి
చేయి చేయి కలుపుదాం
జగనన్నకు జైకొడదాం!
- పూసపాటి వేదాద్రి, జగ్గయ్యపేట, కృష్ణా జిల్లా

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...