వైయస్సార్ అంటే ఓ యస్ సార్ అనే వాళ్లలో మొదటి వరుసలో నేనుంటాను. ఎన్నో సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టి అమలు చేసి ఆంధ్ర రాష్ట్రాభివృద్ధికి ఎనలేని కృషి సల్పి దురదృష్టవశాత్తు ఆకస్మిక మరణం పొందిన పిమ్మట రాష్ట్రంలో రాజకీయ కాలుష్యం ఏర్పడింది. ఆంధ్రరాష్ట్రంలో నూకలు చెల్లిన కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన ఏకైక నాయకుడు రాజశేఖరుడు కాదా? ‘‘రాజశేఖరానీపై మోజు తీరలేదురా’’ అని ప్రతి ఓటరు తమ హృదయాలలో ఆయనను దాచుకున్నారు. కారణం సాధారణ ప్రజల బాగోగుల గురించి ఆయన పడిన ఆరాటం, ఆలోచనా విధానం. అన్నదాతను అభివృద్ధి చేయాలనే తపన కలిగిన నిరంతర కృషీవలుడు ఆయన.
అదే స్ఫూర్తితో తండ్రి అడుగుజాడలలో నడచుటే పరమావధిగా ప్రతి బాధిత కుటుంబాన్ని ఓదార్చుతూ, ప్రజల నుంచి తను కూడా ఓదార్పు పొందుతూ ఎదురులేని ప్రజానాయకుడుగా అతి పిన్న వయసులోనే ప్రజాదరణను పొందుతున్న జగన్‌ను కాంగ్రెస్ అధిష్ఠానం విశ్వాసం లేకుండా విచక్షణారహితంగా జైలు పాలు చేయడం జనం తట్టుకోలేకపోతున్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎన్నో కలలుకంటున్న ఈ విశ్వాస ఘాతకులకు, ఇతర పార్టీ నాయకులకు కలకలం సృష్టించేలా కలకాలం జగనే మా నాయకుడని ‘తీర్పు’ ఇవ్వడానికి ప్రతిఓటరు సిద్ధంగా ఉన్నాడు.
ప్రతి వనిత తానేంటో అని నిరూపించడానికి సిద్ధంగా ఉంది. రాజశేఖరుని పుణ్యమా అంటూ అతని అనుగ్రహం వల్ల ఎదిగిన నాయకులకు, జగన్ పట్ల గ్రహాల్లా తయారైన వాళ్లకు ప్రజల ఆగ్రహం తెలిసే రోజు దగ్గర్లోనే ఉంది. అంతవరకు జగన్ నిగ్రహంతో ఉండాలి. విశ్వాసం, విలువలు లేని నాయకులకు వలువలూడదీసేరోజు వస్తుంది. జగన్ నాదంతో జగన్ నినాదంతో ఆ జగన్నాధుడే శిష్టరక్షకుడుగా వచ్చి ప్రజాభీష్టం మేరకు జగన్‌ను విడిపించి జనంలోకి పంపిస్తాడని ప్రజలంతా ఆశతో ఉన్నారు.
- డి. నాగేశ్వరరావు, మెహెర్‌కాలనీ, బొబ్బిలి
No comments:
Post a Comment