Friday, December 7, 2012

ఒకే ఒక్కడు

రాష్ట్ర రాజకీయాల చరిత్రలో అలుపెరగని పోరాట యోధుడుగా చరిత్రను సృష్టించిన వ్యక్తి మా జగనన్న. ఆయనను చూస్తేనే ఒక పాజిటివ్ ఎనర్జీ ప్రవహిస్తుంది అందరిలో. ఇవాళ అలా కనిపించే నాయకులు ఎంతమంది ఉన్నారు? ఎవరి ముఖం చూసినా కుళ్లు, కుత్సితం, కుతంత్రమే కనిపిస్తాయి. వాళ్ల బాడీ లాంగ్వేజే జనాన్ని దూరం పెట్టే విధంగా ఉంటుంది. కాని జగన్... ఆయనను చూస్తే దగ్గరకు వెళ్లి కరచాలనం చేయాలనిపిస్తుంది. ఆయన స్పర్శే ఒక ఎనర్జీ. అందువల్లే ప్రజలకు ఆయనంటే ఇష్టం. ప్రజలు అమాయకులు కారు. మంచి ఏదో, చెడు ఏదో రాష్ట్ర ప్రజలు అందరూ గమనిస్తూనే ఉన్నారు. ‘‘ఆరోగ్యశ్రీ’’ వంటి గొప్ప పథకాలను ప్రవేశపెట్టి పేద ప్రజల కన్నీళ్లు తుడిచిన రాజశేఖరరెడ్డి వారసుడే కాబోయే ముఖ్యమంత్రి అని వాళ్లు భావిస్తున్నారు. జగనే తమ వంటి పేద ప్రజల కన్నీళ్లు తుడవాలి అని జనం కోరుకుంటున్నారు. అతి త్వరలోనే జగన్ నిర్దోషిగా బయటకు రావాలి అని నిరంతరం దేవున్ని ప్రార్థిస్తున్నాం. పేదప్రజల గుండెల్లో కొలువైన వ్యక్తి మా జగనన్న
- సుజాత, భీమవరం


No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...