రాజన్న ఆశయాల సాధన కోసం ఎంతో కృషిచేస్తున్న మన వై.యస్.జగనన్నను చూశారు ప్రత్యర్థులు. అంతే వారిలో దడ పుట్టింది. అతడు ఇలాగే ఉంటే, తన సేవలను ఇలాగే కొనసాగిస్తూ పోతే ప్రజలకు మరింత చేరువ అవుతాడు. గొప్ప నాయకుడవుతాడు. టీడీపీ, కాంగ్రెస్‌లకు పుట్టగతులు లేకుండా చేస్తాడని భావించారు ఆ పార్టీల్లోని కొందరు కౌటిల్యులు. అంతే... ఆ రెండు పార్టీలు కలిసి కుమ్మక్కై జగనన్న రాజకీయ ఎదుగుదలకు అరచేయి అడ్డుతున్నాయి. ఎందుకంటే జగనన్న అధికారంలోకి వస్తే వాళ్లకిక మళ్లీ అధికారం దక్కే సమస్యే లేదు. అంతా ఇక చేతులు ముడుచుకు కూర్చోవాల్సిందే. ప్రజానురంజకంగా పాలించే జగనన్న పాలన చూశాక మరో పార్టీకి ఇక మనుగడే ఉండదని వాళ్లకు అర్థమైంది. అందువల్ల జగనన్నను ఏదో ఒక విధంగా ప్రజలకు దూరంగా ఉండాలని, అక్రమాస్తులనీ, ఏవో నెపాలు మోపి కేసులు పెడుతూ జగనన్నను బయటకు రాకుండా చేస్తున్నారు.
ఆరోపణలు రావడం అన్న మాటే నిజమైతే అప్పటి టీడీపీ హయాంలో ఎన్నో ఆరోపణలు వచ్చాయి కదా. వాటిపై ఎందుకు దర్యాప్తులు జరగలేదు. కేవలం వై.ఎస్.ఆర్. పాలనలో వచ్చిన కొన్ని అంశాలపైనే దర్యాప్తులు జరుగుతున్నాయి. అంటే... ఇది కుట్ర అని స్పష్టంగా అర్థం కావడం లేదా?
యెడుగూరి సందింటి వారి రక్తంలోనే నిజాయితీ, నమ్మినవారి కోసం ప్రాణాలైనా ఇవ్వడం, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అనే సుగుణాలు ఉన్నాయి. ఆ పెద్దాయన మాట తప్పలేదు. మడమ తిప్పలేదు. ఆయన కుమారుడే అయినందున అవే లక్షణాలు పుణికిపుచ్చుకున్న జగనన్న కూడా తండ్రి బాటనే అనుసరించాడు. నల్లకాలువ దగ్గర తాను ఇచ్చిన మాటకు కట్టుబడ్డాడు. అందుకే ఈ దుస్థితిని ఎదుర్కొంటున్నాడు. అయినా ధైర్యం విడనాడలేదు.
వై.యస్.ఆర్. అంటే ఎవరు? ప్రాణం పోతున్న కాంగ్రెస్‌కు జీవం పోసి ప్రాణభిక్ష పెట్టిన దేవుడు. ఇప్పుడు అలాంటి వ్యక్తిపై ఆరోపణలు చేయడానికి నోరెలా వచ్చిందో అర్థం కావడం లేదు. వై.యస్.ఆర్. గారి స్వర్ణయుగ పాలన మళ్లీ జగనన్న తీసుకొస్తాడు.
జై జగన్... జోహార్ వైయస్సార్

No comments:
Post a Comment