జగనన్నను రాజకీయంగా ఎదుర్కొనలేని కొందరు రాజకీయ నిరుద్యోగులు, అసమర్థ పాలకులు దొడ్డిదారిన చట్టాలను తమ చుట్టాలుగా మార్చుకుని, ఆయన కుటుంబాన్ని అణగదొక్కాలని ప్రయత్నిస్తున్నారు. నీచరాజకీయాలు చేస్తూ, వై.ఎస్. కుటుంబంపై బురద చల్లాలని వారు ప్రయత్నిస్తున్నకొద్దీ ఉవ్వెత్తున ఎగసిపడే కెరటంలా జగనన్న పట్ల జనస్పందన, ప్రేమాభిమానాలు అంత గా పెల్లుబుకుతున్నాయి. 1978కి ముందు కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు చిత్తూరు రాజకీయాలలో ఎదిగేందుకు వై.ఎస్.రాజారెడ్డి సహకారాన్ని తీసుకున్న చంద్రబాబు మొదట కాంగ్రెస్‌ను, తర్వాత తోడల్లుడిని, ఆ తర్వాత ఏకంగా పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచి అధికార పీఠాన్ని చేజిక్కించుకున్నాడు. తాను ముఖ్యమంత్రి అయ్యాక ప్రజలను ఎన్ని ఇబ్బందులకు గురి చేశాడో,

ఎందరిని జైలుపాలు చేశాడో, ఎందరు రైతన్నలు, నేతన్నల ఆత్మహత్యలకు పరోక్ష కారకుడయ్యాడో అంత తేలిగ్గా మరచిపోరు ప్రజలు. అలనాడు వై.ఎస్. రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తానంటే ఆ కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవలసిందే అని ఎగతాళి చేసిన బాబుకుఅపారమైన ప్రజాభిమానాన్ని సంపాదించుకుని, కనుమరుగైన మూడేళ్ల తర్వాత కూడా ప్రజల గుండెల్లో గూడుకట్టుకున్న వై.ఎస్. రాజశేఖరరెడ్డి అంతటి మహానేతను, ఆయన కుటుంబాన్ని విమర్శించే నైతిక హక్కు కూడా లేదు. నిష్కళంకమైన జగనన్నను, ఆయన వెన్నంటి వున్న ప్రజాబలాన్ని చూసి స్వచ్ఛందంగా వై.ఎస్.ఆర్.సీ.పీలో చేరుతున్న ఎం.ఎల్.ఎలను గొర్రెలతో పోల్చటం చంద్రబాబు నీచబుద్ధికి తార్కాణం. చంద్రబాబు వంటి వారు ఎన్ని అపవాదులు, అపనిందలు వేసినా జగనన్న జైలు నుంచి కడిగిన ముత్యంలా బయటకి వస్తాడు. తిరుగులేని మెజారిటీతో జనబలంతో 2014లో ముఖ్యమంత్రి అవుతాడు. జనమే జగన్, జగనే జనం. జయహో వైఎస్సార్, జై జగన్! జై జై జగన్!!
- ఖాజామియా షేక్ , జక్కేపల్లి, ఖమ్మం జిల్లా
No comments:
Post a Comment