జగన్‌బాబు సువర్ణ పాలన
దగ్గర్లోనే ఉంది
యు.పి.ఎ ప్రభుత్వాన్ని, సోనియాను ఎదిరించినందుకే యువనేత జగన్‌బాబుపై అక్రమకేసులు బనాయించి ఆయన్ని జైలులో పెట్టారు. ప్రజాసమస్యలపై పోరాడే సత్తా ఉన్న ఏకైక అధినేత మా జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమే. దివంగత నేత వై.ఎస్.ఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కొనసాగేందుకు, ఆయన ఆశయ సాధన కోసం జగన్ ముఖ్యమంత్రి కావలసిందే. జగన్‌బాబు ప్రజల మధ్య తిరిగితే తమ మనుగడకు ఎక్కడ ముప్పు వస్తుందోనన్న భయంతో ఆయన్ని జైల్లో పెట్టించడం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేతకానితనానికి, అసమర్థతకు నిదర్శనం. అందుకే రాష్ట్రప్రజలు జగన్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. ఆయన పట్టుదల, అంకితభావాన్ని చూసిన ప్రజలు ఆయనకు అండగా ఉంటున్నారు.
ఈ క్రమంలో నిత్యం ప్రజల మధ్య ఉంటూ వారి కష్టాలు తీరుస్తూ తిరుగులేని ప్రజానాయకుడిగా ఎదుగుతున్న జగన్‌ను ఎలా ఎదుర్కోవాలో తెలియక, అధికార, ప్రతిపక్షాలు పార్టీలు ఏకమయ్యాయి. సీబీఐతో చేతులు కలిపి అవినీతి ఆరోపణలు చేసి జైలులు పంపాయి. ఎవరెన్ని కుట్రలు పన్నినా జగన్‌మోహన్‌రెడ్డి విడుదలను ఎవ్వరూ ఆపలేరు. జగన్ కడిగిన ముత్యంలా బయటకు వస్తారు. ప్రజాభిమానం, విశ్వసనీయత ఉన్న ఏకైకనేత జగన్‌మోహన్‌రెడ్డి ఒక్కరే. ఆయన నాయకత్వంలో సువర్ణపాలన వచ్చే రోజు దగ్గరలోనే ఉంది. ఆ దేవుడే జగన్‌మోహన్‌రెడ్డిని ప్రజల ముందుకు తీసుకువస్తారు. ఎలాంటి తప్పు చేయని వై.ఎస్. కుటుంబసభ్యులను శ్రమపెడుతున్న కారకులను దేవుడు శిక్షిస్తాడు. దేవుడు వై.ఎస్.ఆర్ కుటుంబం పక్కనే ఉన్నాడు. అందుకే రాష్ట్ర ప్రజలందరి ఆశీస్సులు, ఆదరాభిమానాలు ఆ కుటుంబానికి లభిస్తున్నాయి.
- ధనాల కృపావతి, పామర్రు, కృష్ణాజిల్లా
No comments:
Post a Comment