‘‘ తాగునీళ్లు లేక తల్లడిల్లుతున్నం.. ధరలు పెరిగాయ్.. కూలికెళ్తే పూటగడవడం లేదు.. ఆ మహానుభావుడు రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు ఉచితంగా కరెంట్ ఇవ్వడమే కాకుండా వ్యవసాయానికి ఏడుగంటలు ఇచ్చేవారు.
ప్రస్తుతం రెండు గంటలకు మించి రావడం లేదు. పత్తి క్వింటాలుకు ప్రస్తుతం రెండు నుంచి మూడువేల ధర మాత్రమే పలికింది. వైఎస్ ఉన్నప్పుడు ఏడువేలు వచ్చింది. ఈ పరిస్థితుల్లో ఎట్టా బతకాలమ్మా’’ షర్మిల ఎదుట పలువురు మహిళలు సమస్యలను ఏకరువు పెట్టారు. మంచిరోజులు వస్తాయని.. జగన్న సీఎం అవుతారని..కష్టాలు తీరుతాయని భరోసా ఇస్తూ షర్మిల ముందుకు సాగారు.
మహబూబ్‌నగర్, న్యూస్‌లైన్ ప్రతినిధి: వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధినేత వైఎస్ జ గన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం యాత్ర శనివారం కేశంపేట మండలం అల్వాల నుంచి కలోనితండా వరకు కొనసాగింది. ఈ సందర్భంగా అల్వాల గ్రా మంలో ఏర్పాటుచేసిన రచ్చబండ కార్యక్రమం లో పలువురు మహిళలు తాగునీరు, కరెంట్, పింఛన్ తదితర సమస్యలు విన్నవించారు.
ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ రాష్ట్రం బాగు పడాలంటే జగన్ సీఎం అయితేనే సమస్యలన్నీ తీరిపోయతాయన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి అ మలుచేసిన ఏ ఒక్క పథకం కూడా ప్రస్తుతం ల బ్దిదారులకు సరిగా అందడం లేదని ఆ పథకాల న్నీ తిరిగి కొనసాగాలంటే మీరందరూ జగనన్న ను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. ‘నేను జి ల్లాలో తిరుగుతున్నప్పుడు రైతులు, కూలీలు, వృద్ధులు, వికలాంగులు, పేదలు ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని వర్గాల వారు పడుతున్న క ష్టాలు చెబుతుంటే నాకెంతో ఆవేదన కలుగుతోంది. ఇబ్బందుల్లో ఉన్న వారెవ్వరూ అధైర్యపడొద్దు.. త్వరలోనే మనకు మంచిరోజులు వ స్తాయి’ అంటూ షర్మిల వారికి భరోసా ఇచ్చారు.
రైతన్నలను ఆదుకునేందుకు స్థిరీకరణ నిధి
అనంతరం ఎక్లాస్‌పేట గ్రామంలో నిర్వహించిన రచ్చబండలో మహిళలు మాట్లాడుతూ.. ఎరువుల ధరలు విపరీతంగా పెరిగిపోయినా పంటలకు మాత్రం ధర రావడం లేదు. కూలి పనులకు వెళ్లినా రూ.50కు మించి రావడం లేదు. మాలాంటి వారి గురించి ఈ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదమ్మా అంటూ ఓ వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం షర్మిల మాట్లాడుతూ.. రైతన్నలు ఎలాంటి నష్టాలను చవి చూడకుండా నిరోధించేందుకు జగనన్న ముఖ్యమంత్రి అయితే రూ. 3 వేల కోట్లతో స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులకు ఖర్చులు పెరగకుండా చూశాడని అదేవిదంగా మద్దతుధర కూడా కల్పిస్తూ రెండు రకాలుగా మేలు చేశాడని అయితే ఈ ప్రభుత్వం ఎరువులు, విత్తనాల ధరలు విపరీతంగా పెంచేసి ఆ తర్వాత మద్దతు ధర లేకుండా రెండువైపులా కలిగించి రైతులను నట్టేట ముంచుతున్నారని ఆరోపించారు. కనీసం రైతులు పండించిన పంటకు మద్దతుధర ఇవ్వకపోతే వారిని ఏవిధంగా గౌరవించినట్లు అవుతుందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
సరుకులు రాలేదంటే కార్డు ఇవ్వమన్నరు!
అనంతరం సంగంలో ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంలో ఓ మహిళ మాట్లాడుతూ.. గ్రామంలో చాలామందికి ఇళ్లు మంజూరు కాలేదని ఇళ్లు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అదేవిధంగా మరో వ్యక్తి మాట్లాడుతూ బాబు హయాంలో తనకు రేషన్ కార్డును రద్దు చేశారని వైఎస్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రేషన్ కార్డు వచ్చిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం సరిగా రేషన్ ఇవ్వడం లేదని ముఖ్యమంత్రి జిల్లాకు వచ్చినప్పుడు ప్రశ్నిస్తే సరుకులు అందకపోతే నా రేషన్‌కార్డు తనకు ఇచ్చేయమని కిరణ్‌కుమార్‌రెడ్డి అడిగారని ఆవేదన వ్యక్తం చేశారు.
వైఎస్ హయాంలో రైతులకు రుణ మాఫీతో పాటు పంటబీమా, ఇన్‌పుట్ సబ్సిడీ వంటి పథకాలన్నీ అందడంతో అప్పుల్లో ఉన్న వారంతా అప్పట్లో గట్టెక్కారని ప్రస్తుతం అందరూ అప్పులఊబిలో కూరుకుపోయారని షర్మిల వద్ద ఆవేదన వ్యక్తంచేశారు. అందుకే మీరు చూపుతున్న అభిమానాన్ని గుండెల్లో పెట్టుకొని చెబుతున్నా ఏ ఒక్కరూ కూడా అధైర్యపడొద్దు.. చేసిన అప్పులు తీర్చడానికి ఎవ్వరూ తమ పొలాలను అమ్ముకోవద్దు. ఆరు నెలలు ఆగితే జగనన్న ముఖ్యమంత్రి అవుతాడు. అప్పుడు మీరు చెప్పినట్లే పాలన ఉంటుంది. అందరికీ మేలు జరుగుతుందని షర్మిల భరోసా ఇచ్చారు.
No comments:
Post a Comment