Monday, December 17, 2012

జగన్‌ని వేధిస్తే ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంటుంది


తెలుగు నాట కాంగ్రెస్ అనగానే ఠక్కున గుర్తొచ్చేది రాజశేఖరరెడ్డి పేరు మాత్రమే. ఆబాలగోపాలానికి ఆయన సుపరిచితం. అలాంటి ప్రజానాయకుని అంతిమ ఘడియలు ఇరవై నాలుగు గంటలపాటు నరాలు తెగే ఉత్కంఠభరితంగా నిలిచాయి. ఆయన మరణం కూడా అనుమానాస్పదంగా మిగిలిపోయింది. అలాంటి ప్రజాసేవకుని రక్తం పంచుకున్న జగన్‌ను ఎదగనివ్వకూడదనీ, తన చెప్పుచేతల్లోనే వుంచుకోవాలనీ, మర్రి నీడన మల్లె తీగను సాగనివ్వకూడదనీ అధిష్ఠానం కుట్రపన్నింది. కానీ, ఆంధ్ర ప్రజానీకం ఈ దుర్బుద్ధిని, దుష్ట ఆలోచనలను ఎండగడుతూ కోవూరు ఉపఎన్నికలో స్పష్టమైన తీర్పునిచ్చింది. 

అంతటితోనైనా మనసు మార్చుకోక వింత నెపాలతో మోసపూరిత కారణాలతో జగన్‌ని కారాగారంపాలు చేశారు హస్తిన నేతలు. దీంతో ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంది. తదుపరి పదిహేను ఉపఎన్నికల్లో జగన్ పార్టీ విజయ బావుటా ఎగురవేసింది. నెల్లూరు లోక్‌సభ ఉపఎన్నికలో చరిత్రాత్మక తీర్పునిచ్చింది. పరకాలలో సైతం ప్రజాభిమానం పంకాకు దగ్గరగా వచ్చినట్లు తేటతెల్లమయింది. అప్పటికీ మత్తు వదిలించుకోని ఢిల్లీ రకరకాల ఆరోపణలతో చెరసాలలోనే జగన్‌ని మగ్గబెడుతూ సిబిఐ ద్వారా కక్ష సాధిస్తోంది. కానీ, ప్రజానాడిని పసిగట్టలేక తన పతనానికి తనే గొయ్యి తీసుకుంటున్నది. వైయస్‌ఆర్ కుటుంబానికి అనూహ్యమైన సానుభూతి, ప్రజాదరణ ఉంది. ఏదేమైనా 2014లో జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తీరతారు.

- కుమారి మన్నెముత్తుల మండోదరి, లేబూరు, ఇందుకూరుపేట (మం), నెల్లూరు జిల్లా

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...