రాజకీయ నాయకుడంటే ప్రజా సమస్యలని తన సమస్యలుగా భావించి, వాటికి పరిష్కారం చూపేవాడు. కానీ ప్రస్తుతం ఉన్న నాయకులంతా అసలు ప్రజలు ఏం ఇబ్బందులు పడుతున్నారో తెలుసుకోకుండా సమయాన్నంతా తమ పైరవీలకే వృథా చేస్తున్నారు. రాజశేఖరరెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అసలైన నాయకుడు అనిపించుకున్నారు. రాష్ట్రం రకరకాల సమస్యలతో ఉన్నప్పుడు, తమ గోడు ఎవరికి చెప్పాలో అర్థంకాక ప్రజలంతా దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు వైయస్సార్ గారు నేనున్నానంటూ ఎవరూ ధైర్యం చేయలేని విధంగా మండుటెండల్లో పాదయాత్రను చేపట్టి రాష్ట్రం నలుమూలలా ప్రజల సమస్యలు విన్నారు. ముఖ్యమంత్రి అయ్యాక - పాదయాత్రలో తను ఇచ్చిన ప్రతి వాగ్దానం నెరవేరుస్తూ ప్రజల మనసులను గెలుచుకున్నారు. ఆరోగ్యశ్రీ పేదల సంజీవని అయింది. దేశంలోనే ఈ సేవలను మొదలుపెట్టిన ముఖ్యమంత్రి వైయస్ గారే.
ఆయన తపనంతా మనరాష్ర్టం సస్యశ్యామలంగా, ప్రతి ఒక్కరు ఆనందంగా ఉండాలని! దురదృష్టవశాత్తూ ఆయన చనిపోయారు. అంతవరకూ వైయస్ గారిని ఆకాశానికెత్తినవారే, లబ్దిపొందిన నాయకులే తర్వాత మొహం చాటేశారు. ఇప్పుడు వారి కుటుంబంపై విమర్శలు చేయడమే ఆ నాయకులకు ప్రధమ కర్తవ్యం అయింది. అయితే వీళ్లు ఒక వాస్తవం తెలుసుకోవాలి. వైయస్ గారంటే గౌరవం ఉన్న ప్రతిఒక్కరు జగన్‌కు అండగా వుంటారు. అసలు ప్రజలలోకి వెళ్లగలిగే ధైర్యం మన రాష్ట్రంలో ఏ నాయకుడికైనా ఉందా? జగన్‌కు ప్రజల నుంచి వస్తున్న అపూర్వ స్పందన చూసి ఓర్వలేకే ఆయన్ను జైల్లో ఉంచారు. జగన్ బయటకు వస్తారు. ప్రజలకు తప్పకుండా మేలు చేస్తారు.
No comments:
Post a Comment