
నీ కోసం కలం పట్టి మా భవిష్యత్ మీద దృష్టిపెట్టి
రాస్తున్నా ఈ అక్షర గాథ!
రాజన్నా!
మా కష్టాల బతుకుల్లో సంతోషం లాగా
ఎడారి బతుకుల్లో ఒయాసిస్‌లాగా కనపడుతున్న
నిన్ను కాలం కాటు వేసింది. విధి వింతగా నవ్వుతోంది.
అయినా, నువ్వు ఉన్నావన్న ఆశతో ఎన్నో ప్రాణుల మొర ఇది.
జగనన్నా!
రైతుల గుండెల్లో సంతోషం చూడాలనుకున్నావు. కార్మికుని
క ళ్లల్లో ఆనందం చూడాలనుకున్నావు.
పేద ప్రజల గుండెలో సంతోషం నింపాలనుకున్నావు.
నేతన్నల ఆత్మహత్యలను ఆపాలనుకున్నావు.
మా రాజన్న పాలనను మాకు అందించాలనుకున్నావు.
కనుక
నువ్వు రావాలి: రాజన్న సువ ర్ణయుగం కావాలి.
ప్రభుత్వంతో పడలేక ప్రతిపక్షంతో ఇమడలేక
మా బతుకులు భారమైనవి
ఆరోగ్యశ్రీ లేక ఆప్తుడు రాక
ప్రాణాలపై ఆశలు సడలుతున్నవి
మగ్గమాడక చేయూత లేక చేనేత బతుకులు భారమైనవి
ఈ రైతు రాజ్యంలో
సాయం లేక పంటలు పండక గిట్టుబాటు ధర రాక
అణగారిన రైతులు ఆశతో చూస్తున్నారు నీకై
ఫీజులు కట్టలేక రీ ఇంబర్స్‌మెంట్ వర్తించక
విద్యార్థి ఎదురు చూస్తున్నాడు నీకై
పెద్దాయన తోనే పోయింది ఓ సువర్ణయుగం
మళ్లీ నీతో వస్తుందనుకున్నాం ఆ సువర్ణ శకం
అణగారిన బతుకుల్లో ఆశల నీరు చల్లుకుని
భవిష్యత్ కోసం ఆరాట పడుతున్న మాకు
నేనున్నానంటూ ధైర్యం చెప్పావు
బహుశా ఆ ధైర్యానికి భయపడిన ప్రభుత్వం
నిను బంధించింది.
బంధించిన నీకోసం ఓ ఉప్పెనలా కదులుతామని
ప్రతిజ్ఞ చేస్తూ...
- బొంత రాజశేఖర్, ఎం.బి.ఎ.
దంతెర పల్లె, గిద్దలూరు
No comments:
Post a Comment