తన హెరిటేజ్ డెయిరీ కోసం బాబు చిత్తూరు డెయిరీ గొంతు నులిమారుమళ్లీ అదే హెరిటేజ్ కోసం రైతులు, చిరు వ్యాపారుల పొట్టగొట్టే ఎఫ్‌డీఐకి దొంగచాటుగా మద్దతు పలికారుయూపీఏకు అనుకూలంగా ఎఫ్‌డీఐపై ఓటింగ్‌కు తన పార్టీ ఎంపీలను గైర్హాజరవ్వాలని ఆదేశించారుటీడీపీలో చంద్రబాబు హిట్లర్.. ఆయన మాట కాదని ఎంపీలు ఓటింగ్‌కు దూరమవుతారా?అయ్యారు అని చంద్రబాబు అంటే ప్రజలు నమ్ముతారా?పాదయాత్రలో ప్రజా సమస్యలు విని కూడా చంద్రబాబు అవిశ్వాసం పెట్టనంటున్నారుజగనన్న అధికారంలోకి వచ్చాక పాడి పరిశ్రమకు వడ్డీ లేని రుణాలిచ్చి ప్రోత్సహిస్తారుషర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ మంగళవారం యాత్ర ముగిసేనాటికి.. రోజులు: 54, కిలోమీటర్లు: 772.80
‘‘టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన హెరిటేజ్ డెయిరీ కోసం చిత్తూరు డెయిరీ గొంతు నులిమారు. చిత్తూరు జిల్లా పాల రైతుల పొట్టగొట్టి ఆయన తన హెరిటేజ్ డెయిరీని పెంచుకున్నారు. ఇప్పుడు మళ్లీ అదే హెరిటేజ్ కోసం చంద్రబాబు నాయుడు దేశంలోని రైతులు, చిరు వ్యాపారుల పొట్టగొట్టే ఎఫ్‌డీఐలకు(విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు) దొంగచాటుగా మద్దతు పలికారు.ఎఫ్‌డీఐల వల్ల రైతులకు, చిరు వ్యాపారులకు నష్టమని తెలిసి కూడా చంద్రబాబు నాయుడు తన హెరిటేజ్‌లోకి విదేశీ పెట్టుబడులను ఆకర్షించాలని చూస్తున్నారు. అందులో భాగంగానే, ఎఫ్‌డీఐలపై ఓటింగ్‌లో యూపీఏ ప్రభుత్వం నెగ్గడం కోసం కాంగ్రెస్‌తో కుమ్మక్కై తన పార్టీ ఎంపీలు ఓటింగ్‌కు గైర్హాజరు కావాలని ఆదేశించారు’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల నిప్పులు చెరిగారు.
‘‘నేను ఒక్క మాట అడుగుతున్నా. ఆయన పార్టీలో చంద్రబాబు హిట్లర్. చంద్రబాబు మాట కాదని ఆయన పార్టీకి చెందిన ఎంపీలు ఓటింగ్‌కు దూరం అవుతారా? అయ్యారు అని చంద్రబాబు చెప్తుంటే ప్రజలు నమ్ముతారా?’’ అని షర్మిల సూటిగా ప్రశ్నించారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం మన్‌సన్‌పల్లి చౌరస్తాలో మాట్లాడుతూ ఆమె పై వ్యాఖ్యలు చేశారు. ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, దానితో కుమ్మక్కైన చంద్రబాబు వైఖరికి నిరసనగా జగన్‌మోహన్‌రెడ్డి తరఫున షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర 54వ రోజు మంగళవారం మహబూబ్‌నగర్ జిల్లాలో పూర్తయి రంగారెడ్డి జిల్లాలోకి ప్రవేశించింది.
ది. పశువులకు రోగం వస్తే మందులు అందుబాటులో ఉండవు. వైద్యులు అసలే ఉండరు. ఈ రాక్షస పాలనలో మనుషుల వైద్యానికే దిక్కు లేదు ఇక పశువుల వైద్యం ఆలోచన చేస్తారా?’’ అని షర్మిల విమర్శించారు. ‘‘రైతుల గోడు పట్టని ఇట్లాంటి సర్కారు ఎక్కువ రోజులు ఉండదు. వీళ్లకు రైతుల ఉసురు, మహిళల ఉసురు తాకి పోతారు. అమ్మా..! అన్నా..! నేను మీకు మాటిచ్చి చెప్తున్నా.. జగనన్న వస్తారు. మీరు కోరుకున్నట్టుగానే పాడి పరిశ్రమ నిలబెడతారు. యువతను పోత్సహించడం కోసం పాడిపరిశ్రమకు వడ్డీ లేని రుణాలు ఇస్తారు. పశువులకు వైద్యం చేయించడం కోసం 103 ఆంబులెన్స్‌ను కూడా పెడతారు’’ అని షర్మిల భరోసా ఇచ్చారు.
హిట్లర్... చంద్రబాబూ.. 420: ‘‘చంద్రబాబు నాయుడుకు హిట్లరుకు చాలా దగ్గరి పోలికలున్నాయి. హిట్లర్ పుట్టింది 4వ నెల 20న, చంద్రబాబు పుట్టిందీ 4వ నెల 20వ తేదీనే. అంటే 420 అన్న మాట. హిట్లర్ దగ్గర గోబెల్స్ అనే ఒక మంత్రి ఉండేవారు. ఆయన అబద్ధాలను ప్రచారం చేసి వాటినే నిజమని ప్రజలను నమ్మించే వారు. చంద్రబాబు కూడా గోబెల్స్ ఎల్లో పత్రికల ద్వారా అబద్ధాలను నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తారు. ఆయన సిద్ధాంతం ఒక్కటే.. ఒక అబద్ధాన్ని 100 సార్లు చెబితే ప్రజలు దాన్ని నిజమనుకుంటారని చంద్రబాబు విశ్వాసం’’ షర్మిల విమర్శించారు. ‘‘మేం పాదయాత్ర చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు కూడా పాదయాత్ర చేస్తున్నారు. ప్రజలు మాకు చెప్పిన కష్టాలనే ఆయనకూ చెప్పారు. ప్రజా సమస్యలు పట్టని ఈ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టి దించవయ్యా అంటే అవిశ్వాసం పెట్టనుగాక పెట్టను అంటున్నారు బాబు’’ అని మండిపడ్డారు.
బతుకమ్మ ఆడిపాడి.. షర్మిలకు వీడ్కోలు..
మహబూబ్‌నగర్ జిల్లాతో తెలంగాణలోకి పాదం మోవైఎస్ ఉన్నప్పుడు రూ.22, ఇప్పుడు 14.40..
No comments:
Post a Comment