Tuesday, December 4, 2012

జైల్లో ఎందుకు ఉండాలి?


నేను ఒక రైతుకూలీని. నాకు రాజకీయాల మీద సరైన అవగాహన లేదు. కానీ ప్రస్తుతం జరుగుతున్న విషయాలను గమనిస్తున్నాను. పేపర్లో చదువుతున్నాను. ఇవన్నీ చూస్తుంటే నాకో విషయం అర్థమవుతోంది. ఇదంతా ఒక కక్షారాజకీయం అని. దివంగత ప్రజానాయకుడు డా.వైయస్ రాజశేఖర్‌రెడ్డిగారు తెచ్చిన ప్రభుత్వం కావాలి. వై.ఎస్‌గారు ప్రవేశపెట్టిన పథకాలు కావాలి. కానీ వారి కుమారుడు మాత్రం అధికారంలోకి రాకూడదు. ఇది చాలా అమానుషం. అనైతికం. చంద్రబాబు వంటి కఠినమైన మనిషిని మళ్లీ చూడగలమా అనిపిస్తోంది? ఇంటి మగదిక్కు అయిన జగన్‌కు దూరమయ్యి భార్యపిల్లలు అంతగా బాధ పడుతుంటే ఆయనకు మనసు రావడం లేదా? అది పాషాణమా? ఎన్ని కుట్రలు చేస్తున్నాడో కదా ఆ మనిషి జగన్‌కు బెయిల్ రాకుండా చూడటానికి. ఇక ప్రభుత్వం సంగతి. జైళ్ళలోని అనేక మంది జీవిత ఖైదీలు సంవత్సరాల తరబడి జీవచ్ఛవాల్లా విడుదలకై ఎదురుచూస్తున్నా వారి గురించి పట్టించుకునే తీరిక గూడా లేదా? వాళ్లు జైలులో ఎందుకు ఉండాలి? జగన్ వంటి ప్రజానాయకుణ్ణి ఎందుకు బంధించి పెట్టాలి?


దివంగత ప్రజానాయకుడు డా. వై.యస్ రాజశేఖరరెడ్డిగారు నక్సలైట్లు జనజీవన స్రవంతిలో కలిస్తే పునరావాసం కల్పించి వారిపై ఉన్న కేసులను ఎత్తివేస్తామని హామీ యిస్తేనే నా భార్త దాసరి వీరయ్య అలియాస్ శంకరన్న ఆయుధాలతో ప్రభుత్వానికి 20-01-2007న కరీంనగర్ ఎస్‌పి డిఎస్ చౌహన్‌గారి ఎదుట లొంగిపోయాడు. వైఎస్‌గారు బ్రతికున్నంత కాలం స్వేచ్ఛగానే జీవించాము. తిరిగి ఆయన మరణానంతరం 19-01-2010న పాతకేసులు తోడి అరెస్ట్ చేసి జైలు పాలు చేసినారు. అప్పటి నుంచి ఇప్పటివరకు జైలులోనే ఉన్నారు. నేను నా ముగ్గురు పిల్లలు మానసికంగా, ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నాము. వైఎస్ మరణానంతరం మా బాధలను అర్థం చేసుకునే నాధుడే లేడు. అదే వైఎస్‌గారు ఉండి ఉంటే మాకు ఈ కష్టాలే ఉండేవి కావు. వైఎస్ మాట మీద నిలబడే వ్యక్తి అందుగురించే నమ్మాము. మళ్ళీ అలనాటి రాజన్న రాజ్యం కావాలని ఆ ప్రభువులను రోజూ ప్రార్థిస్తున్నాను. ఆ రాజ్యం జగన్‌తోనే సాధ్యమని భావిస్తున్నాను.



- దాసరి లక్ష్మి, రామ్‌నగర్, పాల్వంచ, ఖమ్మం జిల్లా

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...