Friday, December 14, 2012

సత్యం జయిస్తుంది...

జగన్‌ను విడిపిస్తుంది
రాజన్నాయని పిలిచినవారే - రాక్షసులైనారు నేడు
రాజన్న వలన మేలు పొందినవారే
రాతిగుండె ప్రజలైనారు చూడు
రాజశేఖరుడని పొగిడిన వారే
రాబందులై పొడుచుకుతింటున్నారు
దిక్కులేని పక్షులుగా మమ్మల్ని వదిలేసి
చుక్కల్లో నీవు కలిసి పోయినవేళ
సొమ్మసిల్లింది సామాన్యుడి హృదయం
నిర్జీవమైంది నిరుపేదల జనజీవనం
ఇపుడు మాకున్న ఒకే ఒక దిక్కు
పేదలను అక్కున చేర్చుకొని ఓదార్చిన జగన్!
పగవారి కుట్రలకు గురయిన జగన్!
పేదల మేలు తలచనివారు, పదవులకోసం తిరిగేవారు...
వారి దురాలోచనలన్నీ జగన్‌పై రుద్దుతున్నారు.
వారి కుతంత్రాలన్నీ జగన్‌కు ఆపాదిస్తున్నారు.

అయినా - చీకటి వెంట వెలుగు
కష్టం వెనుక సుఖం
మంచివారికి దేవుడిచ్చిన వరం
అందుకే - సత్యమే జయిస్తుంది.
నిజాయితీ నిలుస్తుంది.
ప్రజల గుండె స్పందిస్తుంది.
జగనన్నను విడిపిస్తుంది.
ఓటమి నుండి గెలిపిస్తుంది.
జననేతగా నిలబెడుతుంది.
- డా. కీర్తిలత, నక్కపల్లి, విశాఖ జిల్లా

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...