Saturday, December 1, 2012

ప్రజలు వారిని ఈసడించుకుంటున్నారు


ఎముక ముక్క కొరుక్కు తింటూ ఏమీ అనలేదు కుక్క... అన్నారు శ్రీశ్రీ. పెద్దాయన పట్ల, జగన్ మోహన్‌రెడ్డి గారి కేసుల పట్ల, జగన్‌ను జైల్లో పెట్టడం పట్ల ఈ నాటి పాలకుల ప్రవర్తనకు ఈ పదం సరిగ్గా నప్పుతుంది. కేవలం పదవీకాంక్షతో దాన్ని కాపాడుకోవడం కోసం న్యాయం మాట్లాడకుండా మౌనం పాటించే వారిని ఇంతకంటే ఏమనాలి? ఈ మంత్రులకు అధికారం ఎముకముక్కలాగే ఉంది. ‘మంత్రి వర్గ నిర్ణయాలు అందరికీ వర్తిస్తాయి. విధాన నిర్ణయాలు చేయవలసింది ప్రజాస్వామ్యంలో మంత్రివర్గమే. దాన్ని ప్రశ్నించే హక్కు సీబీఐకి లేదు’... ఈ విషయం ధర్మానకు ఈరోజే తెలిసింది! ఆయన మంత్రి వర్గ సహచరులకు కూడా ఇప్పుడే తెలిసింది! వైఎస్సార్ మరణం తర్వాత ఆయన పేరు ఎఫ్‌ఐఆర్‌లో చేర్చినప్పుడుగానీ అకారణంగా జగన్‌మోహన్‌రెడ్డి గారిని అరెస్టు చేసి జైలుకు పంపినప్పుడుగానీ వీరికి తెలియలేదు. 

ధర్మానకూ, మోపిదేవికీ కూడా. ఆ రోజు ఈ సత్యం చెప్పలేక పదవి కోసం మౌనం పాటించారు. స్వార్థంతో తెలియనట్లు నటించడం, పదవి కోసం మౌనం పాటించడం ఎంత చెడ్డపనో దాని పర్యవసానం ఎలా ఉంటుందో పురాణాల్లో ధృతరాష్ట్రుడిని చూసి నేర్చుకోవచ్చు. వైఎస్సార్ రెక్కల కష్టంతో వచ్చిన అధికారం అనుభవిస్తూ, ఆయన ఆదరణతో వెలుగులోకి వచ్చి, ఆయన అనుచరులుగా, స్నేహితులుగా, హితులుగా, ఆత్మీయులుగా చెప్పుకున్న వారిని చూసి ‘‘ఎముక ముక్క కొరుక్కుతింటూ ఏమీ అనలేదు కుక్క’’ అని ప్రజలు భావిస్తున్నారు.

- మాదు వసంతరావు, కంకిపాడు, కృష్ణాజిల్లా

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...